S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/24/2016 - 08:53

కౌలూన్, నవంబర్ 23: ఇటీవలే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తెలుగు తేజం పివి సింధు, గాయం నుంచి కోలుకొని మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న హైదరాబాదీ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. సింధు తన తొలి రౌండ్ మ్యాచ్‌లో సుశాంతో యులియాను 21-13, 21-16 తేడాతో సునాయాసంగా ఓ డించింది.

11/24/2016 - 08:49

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో.. కొన్ని వెసులుబాట్లను కల్పిస్తున్నాయి ప్రభుత్వ, బ్యాంకింగ్ వర్గాలు. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేలా డెబిట్ కార్డు లావాదేవీల చార్జీలను రద్దు చేయాలని బుధవారం బ్యాంకులకు కేంద్రం సూచించింది.

11/24/2016 - 08:48

ముంబయి, నవంబర్ 23: టిసిఎస్‌ను రతన్ టాటా అమ్మేద్దామనుకున్నారంటూ సైరస్ మిస్ర్తి చేసిన వ్యాఖ్యలను టిసిఎస్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎఫ్‌సి కోహ్లీ ఖండించారు. గతంలో ఐబిఎమ్‌కు టిసిఎస్‌ను అమ్మేయాలని రతన్ టాటా ప్రతిపాదించినట్లు టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన మిస్ర్తి మంగళవారం ఆరోపించినది తెలిసిందే.

11/24/2016 - 08:47

ముంబయి, నవంబర్ 23: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనమవుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు నష్టపోతూ 9 నెలల కనిష్టాన్ని తాకింది. బుధవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో 31 పైసలు క్షీణించి 68.56 రూపాయల వద్ద నిలిచింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విదేశీ మదుపరులు భారత్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటం, అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్..

11/24/2016 - 08:47

విజయవాడ, నవంబర్ 23: విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో పేద, బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాల కోసం అధునాతన సదుపాయాలతో టౌన్‌షిప్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

11/24/2016 - 08:46

విజయవాడ, నవంబర్ 23: విదేశీ పర్యాటకులకు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యాటక సంస్థను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సీఎంఓలో పర్యాటక శాఖాధికారులు భేటి అయినప్పుడు ఆయనపై విధంగా సూచించారు.

11/24/2016 - 08:46

గుంటూరు, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 58 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని భావిస్తున్నారు. ఇందులో 2017, 18, 19 సంవత్సరాలలో వౌలిక సదుపాయాల కల్పనకే 32 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని సీఆర్డీయే అంచనాలు రూపొందించింది.

11/24/2016 - 08:37

న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల చలామణీని రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై భారీగా సానుకూల స్పందన వ్యక్తమైంది. ఈ నిర్ణయం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ దానివల్ల ఒనగూడే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే దీన్ని భరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఈ సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

11/24/2016 - 08:35

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేయటం వలన సామాన్య జనం పడుతున్న కష్టాలను ఎన్‌డిఏ ప్రభుత్వం పరిష్కరించటం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు బుధవారం పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మహా ధర్నా చేశాయి.

11/24/2016 - 08:30

న్యూఢిల్లీ, నవంబర్ 23: ఓసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గటం అన్నది ప్రధాని నరేంద్రమోదీ రక్తంలోనే లేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం ఉద్ఘాటించారు. కొన్ని విపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినంత మాత్రాన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రద్దు చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Pages