S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2016 - 03:49

ప్రత్యూష్ వి.ఆర్., హర్షిత పన్వర్ జంటగా సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ఎం.మహేష్ కన్నా రూపొందిస్తున్న సత్యాగ్యాంగ్ చిత్రం గురువారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. కాశీవిశ్వనాధ్ కెమెరా స్విచ్చాన్ చేయగా పద్మా దేవేందర్ రెడ్డి తొలి క్లాప్‌నిచ్చారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.

11/25/2016 - 03:48

పవన్‌కళ్యాణ్ హిట్ సినిమా ‘బద్రి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అమీషా పటేల్ ఆ తరువాత మహేష్‌బాబుతో నాని, న్టీఆర్‌తో నరసింహుడు వంటి సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది. 2011లో నందమూరి బాలకృష్ణతో పరమవీరచక్ర సినిమాలో నటించిన ఆమె ఆ తరువాత బాలీవుడ్‌వైపు వెళ్లిపోయింది. దాదాపు 5 సంవత్సరాల తరువాత ఇప్పుడామె తెలుగు సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

11/25/2016 - 03:47

ఆనంద్‌కృష్ణ, స్వరూప, బేబి హర్షిత ప్రధాన తారాగణంగా నీలిమా ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో ఆనంద్‌కృష్ణ రూపొందిస్తున్న చిత్రం నీలిమలై. దీనికి సంబంధించి షూటింగ్ వనపర్తి పరిసర ప్రాంతాల్లో పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్‌కృష్ణ మాట్లాడుతూ, కేరళలోని వివిధ లొకేషన్లలో 70 శాతం షూటింగ్ పూర్తిచేశామని, మిగిలిన షూటింగ్ పార్ట్ ఇక్కడ జరుపుతున్నామని తెలిపారు.

11/25/2016 - 03:46

దర్శకుడు త్రివిక్రమ్ వీణావేదిక ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించే చిత్రం ‘కారం దోసె’. జి.శివరామచంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, చందన నాయికా నాయికలుగా నటించారు. దీన్ని వచ్చేనెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/25/2016 - 03:45

కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి పలు సూపర్‌హిట్ సినిమాలకు కథా రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ ఎప్పట్నుంచో దర్శకుడిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుందంటూ ప్రచారం రావడమే తప్ప ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికి అన్నీ కుదిరి వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు రంగం సిద్ధమైంది. అల్లు అర్జున్ హీరోగా వంశీ సినిమా తెరకెక్కనుంది.

11/24/2016 - 09:16

విజయవాడ, నవంబర్ 23: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని విజయవాడలో మొదటి సారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మెయిన్స్ పరీక్షను డిసెంబర్ 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 3న శనివారం పేపర్-1 ఎస్సే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

11/24/2016 - 09:15

విజయవాడ, నవంబర్ 23: కృష్ణా జిల్లాలోని 620 ఎటిఎంలలో రూ.25 కోట్ల విలువైన రూ.500 నోట్లను అందుబాటులో ఉంచినట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ నెంబర్‌తో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ ముఖ్యమంత్రిని కోరారు.

11/24/2016 - 09:15

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 23: నగర వ్యాప్తంగా విజయవాడ నగర పాలక సంస్థ ద్వారా ప్రజలకు సరఫరా అవుతున్న నీటి తీరును ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. ఈసందర్భంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మోనటరింగ్ (స్కాడా) వైబ్‌సైట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు.

11/24/2016 - 09:14

విజయవాడ, నవంబర్ 23: కనకదుర్గపై వంతెన పనులు నత్తనడకగా జరగడం పట్ల కాంట్రాక్టర్లు, అధికారులపై కల్టెర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ సలోని సిదానా, డిఆర్‌వో సిహెచ్ రంగయ్య, ఆర్‌అండ్‌బి, పిఆర్, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యూఎస్, ఎన్‌హెచ్, ఇంజనీర్లు, సంబంధిత కాంట్రాక్టర్లతో దుర్గగుడి పైవంతెన పనులపై సమీక్షించారు.

11/24/2016 - 09:13

విజయవాడ, నవంబర్ 23: జిల్లాలో నగదురహిత లావాదేవీలు అమలు జరిపే విధంగా పెద్ద ఎత్తున ఈ-పోస్ మిషన్లు ప్రవేశపెట్టటానికి కార్యక్రమం రూపొందించటం జరిగిందని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్‌లో సబ్-కలెక్టర్ సలోని సిదాన, డిఎస్‌ఓ వి రవికిరణ్, ఎల్‌డియం వెంకటేశ్వరరెడ్డితో ఇ-పాస్ మిషన్లపై సమావేశం నిర్వహించారు.

Pages