S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/24/2016 - 07:47

హైదరాబాద్, నవంబర్ 23: సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమిలో శనివారం జరుగనున్న డిజిపి, ఐజిపిల సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ రెవిన్యూ, పోలీస్, జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

11/24/2016 - 07:47

విజయవాడ, నవంబర్ 23: ఆన్‌లైన్ లావాదేవీల్లో, మొబైల్ బ్యాంకింగ్‌లో విద్యార్థులకు వర్కుషాపులు నిర్వహించాలని, ఆ తరువాత వారు ప్రజలకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులను ఏపి సిఎం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గురు, శుక్రవారాల్లో విద్యార్థుల వర్కుషాపుల నిర్వహణ పూర్తి చేసి, శనివారం నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజలకు మొబైల్ బ్యాంకింగ్‌లో శిక్షణ ఇచ్చేలా చూడాలని ఆదేశించారు.

11/24/2016 - 07:46

హైదరాబాద్, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది పెద్ద దేవాలయాల్లోనే (సింహాచలం, అన్నవరం, కనకదుర్గ- విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం మొదలగునవి) బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు అమలు చేయాలని అర్చక సంక్షేమ నిధి ట్రస్టు నిర్ణయించింది. ఇటీవల జరిగిన ట్రస్టు సమావేశం మినట్స్‌ను బుధవారం విడుదల చేశారు. అర్చక సర్వీసు నిబంధనలను ప్రభుత్వం ఇప్పటి వరకు రూపొందించలేదు.

11/24/2016 - 07:45

హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ న్యాయవిద్యా కళాశాలల్లో పాత పద్ధతిలోనే 2016-17 సంవత్సరానికి సైతం ఫీజులు కొనసాగుతాయని తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రకటించింది. రాష్ట్ర హైకోర్టు 33922/2016 రిట్‌పిటీషన్‌లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రెగ్యులేటరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు.

11/24/2016 - 07:44

హైదరాబాద్, నవంబర్ 23: సంతకం ఫోర్జరీ చేసిన కేసులో చందన బ్రదర్స్ చైర్మన్ రామారావును హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ కుమారుడు కన్నా ఫణీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

11/24/2016 - 07:35

పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులకు కునుకు పట్టకుండా పోయిందో లేదో గానీ, చిల్లర నోట్లకు కరువొచ్చి సామాన్య ప్రజలకు వణుకొస్తోంది. ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వచ్చి రెండు వారాలు గడిచినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు, బ్యాంకులో ఉన్న తమ కొద్దిపాటి డబ్బును తీసుకునేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు.

11/24/2016 - 07:33

పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ రాత్రికి రాత్రి ప్రకటించడంతో- దేశంలో నల్లధనం అంతా అదృశ్యమైపోయి ఆర్థికవ్యవస్థ గాడిన పడుతుందన్న ప్రచారం ప్ర స్తుతం జోరుగా సాగుతోంది. మోదీ నిర్ణయం వల్ల నల్లకుబేరుల సామ్రాజ్యం కుప్పకూలుతుందని ప్రజలను నమ్మించేందుకు భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. 2014లో ప్రధాని పదవి చేపట్టగానే మోదీ నల్లధనం విషయమై గంభీర ప్రకటనలే చేశారు.

11/24/2016 - 07:31

ప్రతి మీటింగ్‌లో మీరు ఎప్పుడూ ఫిన్లాండ్, సింగపూర్ విద్యనే ప్రస్తావిస్తారు. మనం వాళ్లకు సమానం కాలేమా? మన లోపాలు చెప్పకుండా విదేశాల విద్యాప్రగతిని పొగిడి ఇక్కడి మన విద్యా విధానాన్ని మీరు నీరుగార్చుతున్నారా?- అని ఓ విద్యార్థి నన్ను ప్రశ్నించాడు. ఆ దేశాల్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?

11/24/2016 - 07:30

పనె్నండు దేశాలు
ఎండుచున్నాగాని
పట్టడన్నమె
లోపమండి, ఉప్పు
ముట్టుకుంటె దోషమండి!
నోట మట్టికొట్టి
పోతాడండి, అయ్యో..
కుక్కలతో పోరాడి
కూడు తింటామండి
మాకొద్దీ తెల్ల దొరతనము..

11/24/2016 - 07:27

ప్రపంచీకరణ వల్ల ఏర్పడిన ప్రధాన వైపరీత్యం భూ మిని వాణిజ్య ‘హిరణ్యాక్షులు’ కాజేస్తుండడం. ఇలా కాజేయడం తెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లుగా మరీ మితిమీరిపోయింది. ఉన్నత న్యాయస్థానం వారు భూమి సేకరణను నియంత్రించడానికి, అక్రమంగా సేకరించే ప్రక్రియను నిరోధించడానికి పదే పదే జోక్యం చేసుకోవలసి వస్తుండడం ఇందుకు నిదర్శనం.

Pages