S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/24/2016 - 08:29

వాషింగ్టన్, నవంబర్ 23: అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా నియమితమవుతాననుకున్న ఇండో అమెరికన్ నిక్కీహేలీకి ఐరాసలో అమెరికా రాయబారి పదవి దక్కింది.

11/24/2016 - 08:28

న్యూఢిల్లీ, నవంబర్ 23: పెద్దనోటు రద్దుపై పార్లమెంట్ బుధవారం కూడా దద్దరిల్లింది. విపక్షాల నిరసనలు, అరుపులు, నినాదాలు, వ్యంగ్య కూత లు, హాహాకారాలు ఉభయ సభల్లో వినిపించాయి. లోక్‌సభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి ‘ఓ ఓ’ అంటూ సభ దద్దరిల్లేలా భయంకరంగా అరుస్తూ కార్యక్రమాలకు అడ్డుతగిలారు.

11/24/2016 - 08:28

ఇస్లామాబాద్, నవంబర్ 23: ప్రపం చ వ్యాప్తంగా కాశ్మీర్ వివాదాన్ని ప్రధానాంశం చేయడంతో పాటు భారత్‌లో ప్రధాని మోదీ అనుసరిస్తున్న ‘తీవ్రవాద విధానాల’ను వ్యతిరేకిస్తున్న ప్రజలను ఆకర్షించేలాగా కాశ్మీర్ వివాదంపై ఆచరణ సాధ్యమైన విధానాన్ని రూపొందించడానికి పాకిస్తాన్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

11/24/2016 - 08:28

న్యూఢిల్లీ, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్ల విచారణపై స్టే ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి స్పష్టం చేసింది. నోట్ల రద్దుకు సంబంధించి వివిధ కోర్టులో దాఖలవుతున్న పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టులోనో, ఏదైనా ఒక హైకోర్టులోనో ఒకేచోట విచారణ జరపాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.

11/24/2016 - 08:27

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి మెహబూబా అక్తర్ గూఢచర్యం బయటపడడంతో ఎనిమిది మంది ఎంబసీ అధికారులను ఆ దేశం ఉపసంహరించుకుందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే భారత్ కూడా ఎనిమిది మంది అధికారులను వెనక్కురప్పించినట్టు బుధవారం పార్లమెంటుకు తెలిపింది.

11/24/2016 - 08:27

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతికి పార్లంమెంట్ ఉభయ సభలు సంతాపం తెలిపాయి. బుధవారం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే బాల మురళి సంగీత ప్రపంచానికి చేసిన సెవలను సభ కొనియాడింది. ఆయన మృతికి సంతాప సూచకంగా సభ 2 నిముషాలు వౌనం పాటించింది. అలాగే రాజ్యసభ కూడా ఆయన భారతీయ శాస్ర్తియ సంగీత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిఅని చైర్మన్ అన్సారీ కొనియాడారు.

11/24/2016 - 07:56

హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాస భవన సముదాయం గురువారం ప్రారంభం కానుంది. తెల్లవారు జామున ఉదయం 5:22 గంటలకు శుభ ముహూర్తంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దంపతులు గృహ ప్రవేశం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న క్యాంపు కార్యాలయంలోని రెండు భవనాలు, కొత్తగా నిర్మించిన సిఎం నివాసం, సిఎం కార్యాలయం, సమావేశ మందిర సముదాయానికి ‘ప్రగతి భవన్’గా ప్రభుత్వం నామకరణం చేసింది.

11/24/2016 - 07:51

విశాఖపట్నం, నవంబర్ 23: రైల్వే కార్మికుల సమస్యలపై కేంద్రం స్పందించకపోవడంతో అమీతుమీ తేల్చుకునేందుకు రైల్వే కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుతో అనేకసార్లు చర్చలు జరిపినా అవి ఫలించలేదు. మరోసారి ఇచ్చిన గడువు సైతం ముగుస్తున్నా కేంద్రం స్పందించకపోవడంతో భారతీయరైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐఆర్) ఇపుడు అమీతుమీకి సన్నద్ధమవుతుంది.

11/24/2016 - 07:51

హైదరాబాద్, నవంబర్ 23: తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల్లో చేరిన వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులకు పెద్ద సమస్య వచ్చి పడింది. నియోజకవర్గాల సంఖ్య పెంచడం ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ బుధవారం రాజ్యసభలో విస్పష్టంగా తేల్చి చెప్పటంతో ఎంతో ఆశతో ఆయా పార్టీల్లోకి ఫిరాయించిన వారికి చిక్కొచ్చిపడింది.

11/24/2016 - 07:48

అనంతపురం, నవంబర్ 23: అనంతపురం నగరంలోని ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కార్యాలయంపై బుధవారం ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన ఐటి అధికారుల బృందం బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కార్యాయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కంపెనీ యజమాని అమిలినేని సురేంద్రబాబు కార్యాలయంలో లేరు.

Pages