S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/21/2016 - 04:33

నిజామాబాద్, అక్టోబర్ 20: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా గాడితప్పింది. ఏడంతస్తుల అద్దాల మేడ, అధునాతన సదుపాయాలు సమకూరినప్పటికీ నిర్వహణా లోపాల కారణంగా వైద్య సేవలు మాత్రం మెరుగుపడడం లేదు. వైద్య కళాశాలతో అనుసంధానించబడి డిఎంఇ పరిధిలోకి చేర్చబడినప్పటికీ, సగానికి పైగా వైద్యులు, సిబ్బంది కొరత నెలకొని ఉండడం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం కనబరుస్తోంది.

10/21/2016 - 04:32

బాన్సువాడ, అక్టోబర్ 20: రెవెన్యూ డివిజన్, తహశీల్ కార్యాలయాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా రెవెన్యూ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించాలని కామారెడ్డి జాయింట్ కలెక్టర్ సురభి సత్తయ్య సూచించారు. గురువారం బాన్సువాడలోని ఆర్డీఓ, తహశీల్ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు.

10/21/2016 - 04:32

కామారెడ్డి, అక్టోబర్ 20: తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా 14లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియాంబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుతున్నారని, 2వేల 78కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియాంబర్స్‌మెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు ఆజాద్ అన్నారు.

10/21/2016 - 04:30

హైదరాబాద్, అక్టోబర్ 20: మహానగరంలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు సర్కారు ప్రతిపాదించిన డబుల్ బెడ్ రూం స్కీం మరో అడుగు ముందుకు పడింది. నిన్నమొన్నటి వరకు టెండర్ల ప్రక్రియను చేపట్టిన అధికారులు టెండర్లు ఖరారైన ప్రాంతాల్లో వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలంటూ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.

10/21/2016 - 04:30

సరూర్‌నగర్, అక్టోబర్ 20: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన గురువారం బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఎం.సుధాకర్ కథనం మేరకు రామవత్ జయరాం (46), రామవత్ శివ (42) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వీరు బాలాపూర్ మండలం బాలాజీనగర్‌లో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రామవత్ జయరాం ఆటో నడిస్తుండగా రామవత్ శివ వెనుకాల కుర్చునాడు.

10/21/2016 - 04:29

శేరిలింగంపల్లి, అక్టోబర్ 20: శేరిలింగంపల్లి సర్కిల్ 12 పరిధిలోని సిటిజన్ కాలనీ, హుడా కాలనీల మధ్య గల రోడ్డు కబ్జాను ఆపాలని కోరుతూ స్థానికులు గురువారం చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి, ఉప కమిషనర్ వి.మమతకు ఫిర్యాదు చేశారు.

10/21/2016 - 04:29

హైదరాబాద్, అక్టోబర్ 20: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆన్‌లైన్ సేవలందిస్తున్నామని ప్రకటించుకున్న జిహెచ్‌ఎంసి ఇంజనీర్లు, అధికారులకు రోడ్ల నిర్మాణంలో శిక్షణనివ్వాల్సిన అవసరముంది. ఇప్పటికే నగరంలోని బంజారాహిల్స్‌లో కిలోమీటరు పొడువున నిర్మించిన వైట్ టాపింగ్ రోడ్డు ఇటీవలి వర్షాలకు అక్కడక్కడ కొట్టుకుపోయింది. అంతేగాక, కొత్తగా వేస్తున్న బిటి రోడ్లు ఎన్ని రోజుల వరకు ఉంటాయో తెలియదు.

10/21/2016 - 04:28

హైదరాబాద్, అక్టోబర్ 20: ఈ నెల 22,23 తేదీల్లో రెండు రోజుల పాటు అకౌంటింగ్, ఫైనాన్స్, బిజినెస్ రంగాలపై అంతర్జాతీయ సదస్సును జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఎం దేవరాజురెడ్డి తెలిపారు. ఈ సదస్సును కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు.

10/21/2016 - 04:28

సరూర్‌నగర్, అక్టోబర్ 20: నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ‘కనేక్ట్ ది డాస్ట్’ సంస్థ నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బిఎస్సీ, బికాం, బిఏ, ఎంబిఎ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటర్వ్యూలో సక్సెస్ అయి, ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. చాల మంది విద్యార్థులు ఇంటర్వ్యూలో సక్రమంగా చేయకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదన్నారు.

10/21/2016 - 04:27

హైదరాబాద్, అక్టోబర్ 20: మహానగరాభివృద్ధి, జంటనగర ప్రజలకు పౌరసేవలను అందించటంతో పాటు కార్పొరేషన్ విధి విధానాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే స్థారుూ సంఘం గురువారం మళ్లీ సమావేశమైంది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశం పలు అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలించి చర్చించింది. ఎట్టకేలకు ఆరు ప్రతిపాదనలకు అనుకూలంగా తీర్మానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Pages