S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/21/2016 - 05:21

మిర్యాలగూడ టౌన్, అక్టోబర్ 20: మిర్యాలగూడ రెడ్డికాలనీలోని ఒక అపార్ట్‌మెంట్ కార్ పార్కింగ్‌లో ఉన్న కారులో రియల్టర్, వ్యాపారి మారం శ్రీనివాస్ (48) మృతదేహం గురువారం ఉదయం లభ్యం అయింది. జిల్లా రైస్‌మిల్లర్స్ మాజీ అధ్యక్షుడు మారం ముత్తయ్య కుమారుడైన మారం శ్రీనివాస్ హైద్రాబాద్‌లో ఉంటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

10/21/2016 - 05:20

చౌటుప్పల్, అక్టోబర్ 20: ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ సాధన కోసం బలమైన ఉద్యమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోని ముందుకు వెళ్తున్నట్లు ఎస్సీ కార్ఫొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

10/21/2016 - 05:20

భువనగిరి, అక్టోబర్ 20: విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని రాచకొండ కమిషనరేట్ యాదాద్రి జోన్ డిప్యూటీ కమిషనర్ పాలకుర్తి యాదగిరి తెలిపారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల కుటుంభాల సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డిసిపి యాదగిరి మాట్లాడుతు అమరవీరుల సేవలు ఎన్నటికీ మరిచిపోలేనివని తెలిపారు.

10/21/2016 - 05:18

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 20: పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రజా సాధికారిత సర్వే మరింత వేగవంతం చేయాలని, అక్టోబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ ఆదేశించారు. గురువారం ప్రజా సాధికారిత సర్వే, స్వచ్ఛ్భారత్ మిషన్, ఆరోగ్యం, వనం-మనం, ఫైల్ మేనేజ్‌మెంట్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

10/21/2016 - 05:17

విజయవాడ (క్రైం), అక్టోబర్ 20: సమాజ భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు నండూరి సాంబశివరావు చెప్పారు. ఆయా కుటుంబాల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, పోలీసు శాఖ ఆరోగ్య భద్రతతోపాటు, ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు.

10/21/2016 - 05:17

విజయవాడ, అక్టోబర్ 20: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికార శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తదితరులు స్వాగతం పలికారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించనున్న పోలీస్ సంస్మరణ పెరేడ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన గవర్నర్ నరసింహన్‌కు మంత్రి రావెల కిషోర్‌బాబు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

10/21/2016 - 05:16

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 20: ప్రక్రితి వైపరీత్యాలే కాకుండా వివిధ తప్పిదాల వలన ఎదురయ్యే విపత్తు నష్ట నివారణను విజయవాడ నగరపాలక సంస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని విఎంసి కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలుసుకున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి విభాగం (యుఎన్‌డిపి) ప్రతినిధి బృందానికి నగర విపత్తు నిర్వహణలో విఎంసి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.

10/21/2016 - 05:16

విజయవాడ (క్రైం), అక్టోబర్ 20: అమర వీరుల సంస్మరణ సప్తాహం సందర్భంగా నగర పోలీసు శాఖ స్కూల్ విద్యార్థులకు, పోలీసులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.

10/21/2016 - 05:15

విజయవాడ, అక్టోబర్ 20: ముద్రా లోన్ బ్యాంక్ ఖాతాలను ప్రజలకు అందించడం ద్వారా చిరు వ్యాపారులు, చేతివృత్తిదారులు, చిన్న, మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ. 10 లక్షల వరకు ఎటువంటి హామీలు, సెక్యూరిటీలు లేకుండా ఇవ్వనున్న రుణాలపై అవగాహన పెంచి రుణాలు అందజేస్తామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా రూ. 10 లక్షల నుండి రూ.

10/21/2016 - 05:15

విజయవాడ (క్రైం), అక్టోబర్ 20: సమాజ భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు నండూరి సాంబశివరావు చెప్పారు. ఆయా కుటుంబాల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, పోలీసు శాఖ ఆరోగ్య భద్రతతోపాటు, ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు.

Pages