S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/21/2016 - 05:14

విజయవాడ, అక్టోబర్ 20: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికార శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తదితరులు స్వాగతం పలికారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించనున్న పోలీస్ సంస్మరణ పెరేడ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన గవర్నర్ నరసింహన్‌కు మంత్రి రావెల కిషోర్‌బాబు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

10/21/2016 - 05:14

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 20: ప్రక్రితి వైపరీత్యాలే కాకుండా వివిధ తప్పిదాల వలన ఎదురయ్యే విపత్తు నష్ట నివారణను విజయవాడ నగరపాలక సంస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని విఎంసి కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలుసుకున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి విభాగం (యుఎన్‌డిపి) ప్రతినిధి బృందానికి నగర విపత్తు నిర్వహణలో విఎంసి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.

10/21/2016 - 05:13

విజయవాడ (క్రైం), అక్టోబర్ 20: అమర వీరుల సంస్మరణ సప్తాహం సందర్భంగా నగర పోలీసు శాఖ స్కూల్ విద్యార్థులకు, పోలీసులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.

10/21/2016 - 05:13

విజయవాడ, అక్టోబర్ 20: ముద్రా లోన్ బ్యాంక్ ఖాతాలను ప్రజలకు అందించడం ద్వారా చిరు వ్యాపారులు, చేతివృత్తిదారులు, చిన్న, మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ. 10 లక్షల వరకు ఎటువంటి హామీలు, సెక్యూరిటీలు లేకుండా ఇవ్వనున్న రుణాలపై అవగాహన పెంచి రుణాలు అందజేస్తామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా రూ. 10 లక్షల నుండి రూ.

10/21/2016 - 05:12

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 20: పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రజా సాధికారిత సర్వే మరింత వేగవంతం చేయాలని, అక్టోబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ ఆదేశించారు. గురువారం ప్రజా సాధికారిత సర్వే, స్వచ్ఛ్భారత్ మిషన్, ఆరోగ్యం, వనం-మనం, ఫైల్ మేనేజ్‌మెంట్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

10/21/2016 - 05:10

విజయనగరం(టౌన్), అక్టోబర్ 20: వచ్చే నవంబర్ ఒకటో తేదీ నుండి ప్రజాప్రాధికార సర్వేను పాలనలో వినియోగించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ వెల్లడించారు. గురువారం ఆయన సిఎం కార్యాలయం నుండి ప్రజాప్రాధికార సర్వే ప్రగతిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

10/21/2016 - 05:08

శ్రీకాకుళం: సిక్కోలు రాజకీయాల్లో తరాలు మారుతున్నా తలబడే నైజం పోవడం లేదు. స్థానబలం కోసం కాదు. ఆర్థిక లబ్ధికోసం అంతకంటే కాదు. పోనీ ఆధిపత్య పోరు అనుకుంటే అదీకాదు. కేవలం తరతరాలుగా రెండు సామాజికవర్గాల ఉనికిని చాటుకునే ప్రయత్నమే!

10/21/2016 - 05:06

ఒంగోలు, అక్టోబర్ 20: చిత్తకార్తెలో భూమి అంతా వర్షపునీటితో చిత్తడి చిత్తడిగా ఉండాల్సిన పరిస్థితుల్లో అందుకు భిన్నంగా వాతావరణంలో వచ్చిన మార్పుల నేపధ్యంలో వేడిగాలులు వీస్తున్నాయి. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు పూట మండుతున్న ఎండలు, అర్ధరాత్రి దాటితే చలిగాలులు వీస్తుండటంతో ఈ వాతావరణానికి తట్టుకోలేక అన్ని వర్గాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

10/21/2016 - 05:04

కావలి, అక్టోబర్ 20: రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏకపక్ష విధానాలు, నిరంకుశ ధోరణితో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం కావలి పట్టణానికి రాగా, ఎమ్మెల్యే రామిరెడ్డితో కలిసి విలేఖరులతో మాట్లాడారు.

10/21/2016 - 05:02

ఆదోని, అక్టోబర్ 20:పట్టణంలోని బంగారు బజారు అక్రమాలకు అడ్డాగా మారిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక్కడ జీరో వ్యాపారంతోనే పెద్దఎత్తున బంగారు, వెండి నగల వ్యాపారం సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా తెలిసినా ఆదాయపు పన్ను అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే అని చెప్పవచ్చు.

Pages