S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/21/2016 - 04:40

నిర్మల్, అక్టోబర్ 20: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అమలవుతున్న పథకాలన్నీంటిలో వందశాతం ఫలితాలు సాధించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబర్తి అన్నారు.

10/21/2016 - 04:40

లక్ష్మణచాంద, అక్టోబర్ 20: ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్నలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయించి లబ్ధి పొందాలని నిర్మల్ మార్కెట్ ఛైర్మెన్ దేవెంధర్‌రెడ్డి తెలిపారు. గురువారం లక్ష్మణచాంద మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. దళారులబారినుండి రైతులను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరుస్తుందన్నారు.

10/21/2016 - 04:38

జనగామ టౌన్, అక్టోబర్ 20: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు గర్జన సభకు వెళ్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజులకు గురువారం జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.

10/21/2016 - 04:38

నక్కలగుట్ట, అక్టోబర్ 20: పోలీసు కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు ప్రకటించారు. ఈ నెల 23వ తేదీన నిర్వహించబడే కానిస్టేబుళ్ల తుది రాత పరీక్ష సందర్బంగా గురువారం కెయు సెనేట్ హాల్‌లో పోలీసు అధికారులు, పరిశీలకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

10/21/2016 - 04:37

వరంగల్, అక్టోబర్ 20: కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ నిర్వహించిన రైతుగర్జన సదస్సు సక్సెస్ అయింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా భరత్‌చందర్‌రెడ్డి రెండు రోజుల కిందటే పదవి బాధ్యతలు చేపట్టగా ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఏర్పడింది.

10/21/2016 - 04:37

వడ్డేపల్లి, అక్టోబర్ 20: ప్రజల సమస్యల పట్ల శాంతి భద్రతలను పరిరక్షించడంలో తెలంగాణ పోలీసుల పాత్ర భేష్‌గా ఉందని వరంగల్ జిల్లా అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో నగర ప్రజానీకంతో ఆత్మీయ సదస్సును గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు.

10/21/2016 - 04:36

రఘునాథపల్లి, అక్టోబర్ 20: రఘునాథపల్లి మండలాన్ని బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత మండలంగా తీర్చిదిద్దాలని జనగామ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపిపి దాసరి అనిత అధ్యక్షతన మరుగుదొడ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

10/21/2016 - 04:36

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 20: జనగామ వద్దు.. వరంగల్ ముద్దు... అంటూ స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్ మండలాల జాక్ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్త పరిస్ధితులకు దారి తీస్తున్నాయి. రోజురోజుకు మిన్నంటుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాలలో జాతీయ రహాదారిపై జాక్ నాయకులు బైఠాయించారు.

10/21/2016 - 04:34

నిజామాబాద్, అక్టోబర్ 20: తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేసేందుకు వీలుగా బిందు సేద్యానికి తమ ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

10/21/2016 - 04:34

భీమ్‌గల్, అక్టోబర్ 20: గ్రామాల్లో ప్రజలకు రెవెన్యూ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి సూచించారు. గురువారం భీమ్‌గల్ మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయంలో వేల్పూర్, భీమ్‌గల్ రెవెన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

Pages