S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 00:45

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణలో జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి పునర్విభజనపై జారీ చేసిన ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించడానికి విధించిన గడువు 21న సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. ఇక తుది నోటిఫికేషన్ విడుదల చేయడం ఒక్కటే తరువాయి.

09/23/2016 - 00:37

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 22: కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వనీని ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీలో కీర్తించిన పాకిస్తాన్‌పై భారత్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకుముందెన్నడూ ఉపయోగించనంత ఘాటు పదజాలాన్ని వినియోగిస్తూ తన విమర్శలకు పదునుపెట్టింది. అసలు పాకిస్తానే ఒక ‘ఉగ్రవాద దేశం’ అని తెగేసి చెప్పింది.

09/23/2016 - 00:35

ముంబయి, సెప్టెంబర్ 22: ఉరీ ఘటన మరువకముందే ముంబయి తీరంలో మరో అలజడి చోటుచేసుకుంది. సైనిక దుస్తులు ధరించిన నలుగురు వ్యక్తులు ఉరాన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో అటు కోస్ట్‌గార్డ్, ఇటు మహారాష్ట్ర పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముంబయికి 47 కి.మీ దూరంలోని ఉరాన్, కరంజా ప్రాంతంలో సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు సంచరించడాన్ని నలుగురు పాఠశాల విద్యార్థులు గుర్తించి సమాచారం అందించారు.

09/23/2016 - 00:33

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 22: కాశ్మీర్ అంశం సహా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఏ వివాదంలోనూ జోక్యం చేసుకోవడానికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిరాకరించింది. ఉభయ దేశాలు ద్వైపాక్షిక చర్చలద్వారా తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.

09/23/2016 - 00:31

న్యూయార్క్, సెప్టెంబర్ 22: ఉరి ఘటన నేపథ్యంలో ఓ వైపు ఐరాసలో భారత్ పాక్‌పై దుమ్మెత్తి పోయడం, మరోవైపు ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలుస్తుండడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే చైనా మాత్రం పాకిస్తాన్ తమకు చిరకాల మిత్ర దేశమని, తమ బంధం విడదీయలేనిదని చెబుతూ ఉండడం గమనార్హం.

09/23/2016 - 00:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఉరీ సెక్టార్‌పై దాడి నేపథ్యంలో భారత్ యుద్ధానికి దిగవచ్చునేమోనని పాకిస్తాన్‌లో భయం మొదలైంది. వాయుమార్గాల్లో కొన్నింటిని, రెండు రోడ్డు మార్గాలను మూసేశారు. పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభించారు.

09/23/2016 - 00:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న నవ్‌తేజ్ సర్నాను అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. నవ్‌తేజ్ 1980 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. ఈ ఏడాది జనవరిలోనే లండన్‌లో హైకమిషనర్‌గా నియమించబడ్డారు. అంతకుముందు విదేశాంగ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు.

09/23/2016 - 00:40

కైరో, సెప్టెంబర్ 22: సుమారు 600 మంది అక్రమ వలసదారులతో వెళ్తున్న పడవ ఒకటి ఈజిప్టు తీరానికి దగ్గర్లో సముద్రంలో మునిగిపోవడంతో కనీసం 42 మంది చనిపోగా, మరో 400 మందికి పైగా గల్లంతయ్యారు. కైరోకు దక్షిణంగా 120 కిలోమీటర్ల దూరంలో కఫ్-్రఅల్‌షేక్ తీరానికి దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఈజిప్టు, సిరియా ఆఫ్రికా దేశాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు.

09/23/2016 - 00:26

ఉరీ, సెప్టెంబర్ 22: ఉరీ సెక్టార్‌లో భారీ భద్రతతో ఉండే సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడికి సెక్యూరిటీ గార్డు పోస్టుల మధ్య సమన్వయ లోపమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఈ కేసు విచారణలో ఇప్పటికే డాక్యుమెంటేషన్ పనిని పూర్తి చేసింది. దాడి జరిగిన ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించింది. ఉరీ సైనిక శిబిరానికి చాలా చోట్ల కంచె సరిగా లేదని అధికార వర్గాలు తెలిపాయి.

09/23/2016 - 00:40

లండన్, సెప్టెంబర్ 22: అంతర్జాతీయ ఉన్నత విద్యా రంగంలో మన దేశం తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వ విద్యాలయాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన జాబితాలో రికార్డు స్థాయిలో మన దేశానికి చెందిన 31 విద్యా సంస్థలకు చోటు లభించింది. కాగా, ఈ జాబితాలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అగ్రస్థానంలో నిలిచింది.

Pages