S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 23:58

నెక్కొండ, సెప్టెంబర్ 21: నెక్కొండ మండలం లో పార్టీ ఆవిర్భావం నుంచి తెరాస మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న గుంటుక సోమ య్య ఎట్టకేలకు నెక్కొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

09/22/2016 - 23:58

పాలకుర్తి, సెప్టెంబర్ 21: మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పాలకుర్తిలోని వాగులు.. వంకలు పొంగిపొర్లాయి. పాలకుర్తి నుంచి ఘనపూర్‌కు వెళ్లే రహదారిలో రాఘవపురం స్టేజి వద్ద 5్ఫట్లకు పైగా నీళ్లు వెళ్తుండటంతో ఉదయం 10గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులు, ప్రయివేట్ వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి.

09/22/2016 - 23:55

కుంటాల, సెప్టెంబర్ 22: ప్రతీ గ్రామంలో ఉన్న మహిళలందరూ అన్నిరంగాల్లో రాణించాలని డిఆర్‌డిఎ పిడి అరుణకుమారి అన్నారు. గురువారం మండలంలోని పెంచికల్‌పాడ్ గ్రామాన్ని సందర్శించిన అనంతరం లోస్రా మహిళలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబాలు బాగుంటాయన్నారు.

09/22/2016 - 23:55

నిర్మల్, సెప్టెంబర్ 22: శిక్షణ నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలుచేసినప్పుడే శిక్షణకు సార్థకత ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించిన ఉపాధ్యాయులకు నిర్మల్ డి ర్‌సిలో అందిస్తున్న శిక్షణ కార్యక్రమానికి డిఈవో గురువారం హాజరై వారినుద్దేశించి మాట్లాడారు.

09/22/2016 - 23:54

కడెం, సెప్టెంబర్ 22: ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారత సైనికులకు కడెం మండలంలోని దస్తురాబాద్ గ్రామంలో గురువారం యంగ్‌స్టార్ యూత్ సభ్యులు, భజరంగ్‌దళ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున పలు వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మను భజరంగ్‌దళ్ సభ్యులు దగ్ధంచేశారు.

09/22/2016 - 23:54

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22: అదనపు కట్నం కోసం కోడలిని మానసికంగా, శారీరకంగా వేధించి కిరోసిన్ పోసి హతమార్చిన కేసులో అత్తమామలకు జీవితఖైదు విధిస్తూ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉదయ గౌరి తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. కడెం పోలీసు స్టేషన్ పరిధిలోని మొర్రిగూడ గ్రామానికి చెందిన సత్తవ్వ (25) అదే గ్రామానికి చెందిన మొకిరాల మల్లయ్యతో వివాహం జరిగింది.

09/22/2016 - 23:54

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22: కాసిపేట మండలంలోని ఓ గ్రామంలో గత ఏడాది నాలుగేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన కేసులో నిందితునికి ఏడేళ్ళ జైలుశిక్ష, రూ.15వేల జరిమాన విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి కుంచాల సునీత గురువారం తీర్పునిచ్చారు.

09/22/2016 - 23:53

కడెం, సెప్టెంబర్ 22: మండలంలోని దస్తురాబాద్ గ్రామంలో గల గిరిజన సంక్షేమశాఖ ప్రాథమిక ఆశ్రమ పాఠశాలను గురువారం మధ్యాహ్నం ఉట్నూర్ ఐటిడిఎ పివో ఆర్‌వి కర్ణన్ సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో పలు గదుల్లోకి వెళ్లి విద్యార్థులను కలిసి, విద్యాబోధనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మెనూ పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆరా తీశారు.

09/22/2016 - 23:53

భైంసా రూరల్, సెప్టెంబర్ 22: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం భైంసా పట్టణంలోని కస్తుర్భా పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ విద్యావ్యాప్తికి కృషిచేయాలని సూచించారు. భోజన సౌకర్యం, నీరుతోపాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.

09/22/2016 - 23:52

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22: మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్దతులతో వ్యవసాయ సాగులో అధిక దిగుబడులు సాధించేలా రైతుల్లో విస్తృత అవగాహన పరిజ్ఞానం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పాలక వర్గ సమావేశం నిర్వహించారు.

Pages