S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 23:52

బెల్లంపల్లి, సెప్టెంబర్ 22: తూర్పు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కేంద్ర బింధువుగా ఉన్న బెల్లంపల్లిని ముఖ్యమంత్రి కెసిఆర్ బొందలగడ్డగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని, మంచిర్యాల జిల్లా ఎవరి కోసమో ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేయాలని జిల్లా సాధన అఖిలపక్ష కమిటీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, జడ్పీటీసీ రాంచందర్, బొల్లెడ కేశవ రెడ్డి, ముర్కూరి చంద్రయ్య డిమాండ్ చేశారు.

09/22/2016 - 23:51

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22: జిల్లాల పునర్విభజన లొల్లి గురువారం జిల్లాలో అట్టుడికింది. ఆదిలాబాద్ పరిరక్షణ సమితి అధ్వర్యంలో నిర్మల్ జిల్లాను వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ వెనకబడిన జిల్లాకు నష్టం చేకూర్చవద్దని డిమాండ్ చేస్తూ గురువారం ఇచ్చిన బంద్ పిలుపు సంపూర్ణంగా ముగిసింది. కిల్లికొట్టు నుండి పెట్రోల్ బంక్‌ల వరకు, విద్యాసంస్థల నుండి సినిమా థియేటర్లను మూసివేసి బంద్ పాటించడంతో జనజీవనం స్థంభించిపోయింది.

09/22/2016 - 23:49

నల్లగొండ, సెప్టెంబర్ 22: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తు నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

09/22/2016 - 23:48

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 22: బిజెపి ఆధ్వర్వంలో ఈ నెల చివరి వారంలో రైతాంగం సమస్యలపై ఉద్యమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు పిలుపునిచ్చారు.

09/22/2016 - 23:47

త్రిపురారం, సెప్టెంబర్ 22: భారీ వర్షాలకు చెరువులు అలుగుపోస్తున్నాయి. రహదారిపై వర్షపునీరు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో బుధవారం రాత్రి నుండి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. మండల కేంద్రంలో లిటిల్‌ఫ్లవర్ పాఠశాల సమీపంలో 4అడుగుల మేరా వర్షపునీరు వెలిసింది. ప్రధాన రహదారిపై వర్షపునీరు ప్రవహిస్తుండడంతో రహదారి అంచులు కోతకు గురయ్యాయి.

09/22/2016 - 23:47

కేతేపల్లి, సెప్టెంబర్ 22: రెండవ అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో పరిసర, సుదూర ప్రాంతాల నుండి భారీసంఖ్యలో పర్యాటకులు తరలివస్తూ మూసీ అందాలను తిలకించి మురిసి పోతున్నారు. గత శనివారం నాడు మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోగానే ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటిని దిగువ మూసీకి పంపడానికి గేట్లు తెరిచినాటి నుండి రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.

09/22/2016 - 23:46

మర్రిగూడ, సెప్టెంబర్ 22: మండలంలో రెండో రోజు గురువారం కూడా ఎడతెరపి లేని వర్షం కురిసింది. ఎగువన కురిసిన వర్షాలకు చెర్లగూడెం, నామాపురం, బీమనపల్లి, ధోర్నాలబావి చెరువుల్లోకి వరద ప్రవాహం పెరిగింది. భారీ వర్షాలతో రోడ్లు కోతకు గురవ్వడంతో స్థానిక బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

09/22/2016 - 23:46

మిర్యాలగూడ, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్థంభించిపోయింది. ఉదయం ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో గృహాల నుండి ప్రజలు బయటకు రాలేకపోయారు. పట్టణంలోని కాలనీలో ఉన్న నాలాలు పొంగిపొర్లడంతో రోడ్లన్ని జలమయమై గృహాల్లోకి, షాపుల్లోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరింది.

09/22/2016 - 23:45

సూర్యాపేట, సెప్టెంబర్ 22: వరుసగా కురుస్తున్న వర్షాలతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం పట్టణంలో భారీ వర్షం పడడంతో వీధులన్ని వరదనీటితో పోటెత్తాయి. మరోవైపు మూసీ నుండి నీటిని విడుదల చేస్తుండడంతో పట్టణంలోని సద్దలచెర్వు, పుల్లారెడ్డిచెర్వులు పొంగిపొర్లుతున్నాయి.

09/22/2016 - 23:43

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 22: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికార యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు.

Pages