S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 03:07

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ జల వనరులకు సంబంధించిన ప్రతి సమాచారం ప్రజల ముందుంచడానికే ఇస్రోతో అవగాహన కుదుర్చుకున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఇదొక చారిత్రక ఘట్టమన్నారు. తెలంగాణ జల వనరుల సమాచారం క్రోడీకరణకు ఒప్పందం ఉపయుక్తమన్నారు. శనివారం గ్రాండ్ కాకతీయ హోటల్‌లో తెలంగాణ నీటిపారుదల శాఖ, ఇస్రోల మధ్య ఒప్పందం కుదిరింది.

08/07/2016 - 03:05

హైదరాబాద్, ఆగస్టు 6: భారతదేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, అందులో అతిపెద్ద సవాలు ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ అన్నారు. నల్సార్ వర్శిటీ 14వ స్నాతకోత్సవానికి హాజరైన జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిధిగా మాట్లాడారు. దేశంలో వివిధ న్యాయస్థానాల్లో 3 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 1300మంది

08/07/2016 - 02:49

విజయవాడ, ఆగస్టు 6: కృష్ణా పుష్కరాల సందర్భంగా గతంలో ఇప్పటివరకు జరిగిన ఏ పుష్కరాల్లోను లేని విధంగా ఈ దఫా విజయవాడ నగరం సిసి కెమెరాల నిఘా నీడలోకి వెళ్లింది. రాజమండ్రి పుష్కరాల్లో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనలు మరోవైపు సంఘవిద్రోహులు, తీవ్రవాదుల నుంచి ముందస్తు రక్షణకై ఒక్క విజయవాడ నగరంలోనే దాదాపు 2400 పైగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఇప్పటికే అత్యధికం ఏర్పాటయ్యాయి.

08/07/2016 - 02:46

రియో డి జెనీరోలో 31వ ఒలింపిక్స్ ఆరంభం అదిరిపోయింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మొదలైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రెజిల్ సంప్రదాయ సంగీత, నృత్య రూపకాలు అలరించాయి. భారత బృందానికి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ఏస్ షూటర్ అభినవ్ బింద్రా నాయకత్వం వహించాడు. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న బ్రెజిల్ ఒలింపిక్స్‌కు సమర్థంగా ఆతిథ్యమిస్తుందా? అన్న అనుమానాలకు ప్రారంభోత్సవ వేడుక తెరదించింది.

08/07/2016 - 02:44

అనంతపురం, ఆగస్టు 6: ‘రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఉపాధి కష్టమైంది. యంత్రాలు రావడంతో చేనేతకు ఆదరణ తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో చేనేత కార్మికుల్ని అన్నివిధాలా ఆదుకుంటాం. వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

08/07/2016 - 02:39

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందనే ఆశాభావాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నీతి ఆయోగ్ అధ్యక్షుడు పణిగరియా కసరత్తు చేస్తున్నారని చెప్పారు.

08/07/2016 - 02:37

కర్నూలు, ఆగస్టు 6: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. శనివారం రాత్రికి ఎగువనుంచి 1,68,764 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శనివారం 851.10 అడుగులకు చేరింది. జలాశయంలో 82.56 టిఎంసిల నీరు నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం 18,414 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

08/07/2016 - 04:10

న్యూఢిల్లీ, ఆగస్టు 6: గోసంరక్షణ పేరుతో దేశంలో పలుచోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అసాంఘిక కార్యకలాపాల పరిధిలోకి వస్తాయని ఆయన అన్నారు. గోసంరక్షకుల పేరుతో చెలామణి అవుతున్న వారిలో 80శాతం మంది చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారేనని తీవ్రంగా మండిపడ్డారు.

08/07/2016 - 02:32

జైపూర్, ఆగస్టు 6: బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గో సంరక్షణ శాలలో ఆకలి బాధ తాళ లేక, ఆలనా పాలనా చూసే వాళ్లు లేక 500కు పైగా ఆవులు మృత్యువాత పడడం సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఆవుల రాజకీయాలు నడుస్తున్న వేళ వెలుగు చూసిన ఈ సంఘటన అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఇబ్బందికరంగా మారింది.

08/07/2016 - 02:23

సూళ్లూరుపేట, ఆగస్టు 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల చివరలో జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు.

Pages