S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 17:40

హైదరాబాద్ : పాలమూరు-డిండి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గురువారం సమీక్ష నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, నల్గొండ, పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు నీటిపారుదలశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

07/21/2016 - 17:38

తిరుమల : తిరుమల రెండో ఘాట్ పదో మలుపు వద్ద గురువారం సాయంత్రం పది మంది భక్తులతో తిరుమలకు బయలుదేరిన బోలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఏడుగురికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది.

07/21/2016 - 17:24

దిల్లీ: మహారాష్ట్ర కేడర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏబీపీ పాండేను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా నియమించారు. యూఐడీఏఐకి నియమించిన తొలి సీఈవో పాండేనే కావడం గమనార్హం.

07/21/2016 - 16:40

చండీగఢ్: తమ పార్టీ అధినేత్రి, యుపి మాజీ సిఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ నాలుకను కోసి తనకు ఎవరైనా ఇస్తే అక్షరాలా అరకోటి రూపాయలను నజరానాగా ఇస్తానని జన్నత్ జహాన్ అనే మహిళా నేత ఆఫర్ ప్రకటించింది. బిఎస్‌పి చండీగఢ్ విభాగం అధ్యక్షురాలిగా ఉన్న జన్నత్ గురువారం నాడు దయాశంకర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

07/21/2016 - 16:39

హైదరాబాద్: ఇటీవల నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన ఐసిస్ సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తానని ప్రకటించిన ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై దేశద్రోహం నేరం కింద కేసు పెట్టాలని బిజెపి నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసదుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ తరఫున గురువారం యూసఫ్‌గూడలో సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు.

07/21/2016 - 16:39

హైదరాబాద్: బ్రెజిల్‌లో రద్దు చేసిన పాత కరెన్సీని భారతీయ కరెన్సీలోకి మార్పిడి చేసేందుకు యత్నించిన అయిదుగురిని నగరంలో పోలీసులు అరెస్టు చేశారు. రామగుండకు చెందిన 36 ఏళ్ల మహేష్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఉంటూ భానుచందర్, భవానీ ప్రవీణ్, యాదగిరిరెడ్డి, రాధాకృష్ణ అనే యువకులతో పరిచయాలు పెంచుకున్నాడు. బ్రెజిల్‌లో 1986-89 కాలంలో చెలామణిలో ఉన్న కరెన్సీని వీరు ముంబయిలో 36 వేలకు తీసుకున్నారు.

07/21/2016 - 16:38

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్టు వైకాపా నేత బొత్స సత్యనారాయణ గురువారం తెలిపారు. ఎపికి ప్రయోజనం కలగాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాగా, ప్రత్యేక హోదా విషయంలో సిఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని బొత్స ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు.

07/21/2016 - 16:38

మెదక్: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మల్లన్నసాగర్ జలాశయ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా నిర్వాసిత రైతు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. గజ్వేల్ ప్రాంతానికి చెందిన నర్సయ్య అనే రైతు మల్లన్నసాగర్‌తో తన పొలం పోతోందన్న మనస్తాపానికి లోనై బుధవారం సాయంత్రం ఉరివేసుకున్నాడు.

07/21/2016 - 16:37

అనంతపురం: ఇక్కడి రుద్రంపేట జంక్షన్ సమీపంలో గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. పాతకక్షల కారణంగానే ఈ హత్యలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను వెంకటేష్ నాయక్, గోపీ నాయక్‌లుగా స్థానికులు గుర్తించారు.

07/21/2016 - 16:37

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ల నిర్మాణం, ఇతర పనులు మందకొడిగా సాగుతున్నాయని ఎపి సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతానగరం వద్ద పనులను ఆయన గురువారం పరిశీలించి ఇంకా పనులు పూర్తికానందుకు సంబంధిత కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. సకాలంలో నాణ్యతతో పనులు పూర్తయ్యేలా అధికారులు బాధ్యత వహించాలన్నారు. పనులను పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలన్నారు.

Pages