S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 18:29

హైదరాబాద్‌ : హైకోర్టు విభజనపై వాదనలు గురువారం పూర్తి అయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వే చేసింది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు కేటాయించాలని దాఖలైన ఫిటిషన్‌పై ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తామింకా రాజధాని నిర్మించుకోలేదని, దానికి అవసరమైన నిధులు కేంద్రం సమకూర్చడంలేదన్న విషయాన్ని కోర్టుకు స్పష్టం చేసింది.

07/21/2016 - 18:24

కర్నూలు: కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు మురళీకృష్ణను అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టు కాకుండా మురళీకృష్ణ హైకోర్టును ఆశ్రయించి బెయిల్‌ తీసుకున్నా, విచారణ నిమిత్తం కర్నూలు పోలీసులు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మురళీకృష్ణను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ వినోద్‌కుమార్‌ తెలిపారు.

07/21/2016 - 18:21

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడు ఈనెల 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయనను రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సాంబశివరావు డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

07/21/2016 - 18:19

ముంబయి: ముంబయి ఎయిర్‌పోర్టులో జరిగిన తోపులాటలో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ తల్లి బృందా రాయ్‌ స్వల్పంగా గాయపడ్డారు. లండన్‌లో సెలవులను గడిపి ఐశ్వర్య, తల్లి బృందా, కుమార్తె ఆరాధ్యతో కలిసి గురువారం ముంబయి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఐశ్వర్య కన్పించగానే ఒక్కసారిగా మీడియా ఆమెను చుట్టుముట్టింది.ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అదుపుతప్పిన బృందారాయ్‌ కిందపడిపోయారు. దీంతో ఆమె ముఖానికి స్వల్ప గాయమైంది.

07/21/2016 - 18:15

హైదరాబాద్: అమెరికాలో హత్యకు గురైన హైదరాబాద్ యువకుడు సంకీర్త్ కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఓదార్చారు. కాచిగూడలోని సంకీర్త్ ఇంటికి ఆయన గురువారం ఉదయం వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. సంకీర్త్ మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఈ విషయమై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశానని దత్తాత్రేయ తెలిపారు.

07/21/2016 - 18:15

హైదరాబాద్: ఎన్నిసార్లు చెప్పినా అధికారుల తీరు మారడం లేదని, నగరంలో రహదారుల పరిస్థితి నానాటికీ అధ్వానంగా మారుతోందని మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం జిహెచ్‌ఎంసి అధికారుల సమావేశంలో రహదారుల పరిస్థితిని సమీక్షించారు. రహదారుల నిర్వహణపై సంబంధిత అధికారులంతా నివేదికలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

07/21/2016 - 18:14

లక్నో: పేదప్రజల పాలిట తానొక దేవతలాంటి దాన్నని బిఎస్‌పి అధినేత్రి, మాజీ సిఎం మాయావతి అన్నారు. తనను కించపరుస్తూ బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలు చేసినందుకు పేదలు మనస్తాపం చెందుతూ ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. తనను ఇంతగా అభిమానిస్తున్నందుకే పేదలు తన కోసం ఇపుడు రోడ్కెక్కారని ఆమె అన్నారు.

07/21/2016 - 18:13

దిల్లీ: ఇతరులకు క్షమాపణలు చెప్పడమన్నది గాంధీ కుటుంబానికి తెలియదని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినందుకు అతను క్షమాపణ చెప్పాలి లేదా పరువునష్టం కేసులో విచారణకు సిద్ధం కావాలంటూ సుప్రీం కోర్టు పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ దిగ్విజయ్ ఈమాటలన్నారు.

07/21/2016 - 17:48

నలంద: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత నియోజకవర్గమైన నలంద జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటిపై పాకిస్థాన్‌ జెండానుఎగురవేశాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కుటుంబ సభ్యులు అప్పటికే పాక్ జెండాను తొలగించారు. ఇంట్లో ఉన్న పాక్ జెండాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఎగురవేసిన అన్వరుల్ హక్ పరారిలో ఉన్నాడు.

07/21/2016 - 17:43

హైదరాబాద్: హయత్‌నగర్ మండలం రావిరాలలో చెత్తను తరలించే లారీ ఢీకొని ఐదు సంవత్సరాల చిన్నారి మృతిచెందిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చర్య కోరుతూ చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Pages