S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/14/2016 - 05:38

రాజేంద్రనగర్, మార్చి 13: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను జాగృతం చేయడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎనలేని కృషి చేస్తున్నారని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఎంపీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

03/14/2016 - 05:38

జీడిమెట్ల, మార్చి 13: మార్చి మాసంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండుతున్న ఎండల వేడిమికి ఇళ్లల్లో నుండి ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుండి ఎండలు విపరీతంగా వేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి ఎండల తాకిడికి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

03/14/2016 - 05:34

హైదరాబాద్, మార్చి 13: పురాణ కాలంలో స్ర్తికి ఎంతో గౌరవం వుండేదని, మహిళలను దేవతామూర్తిగా పూజించేవారని, ఆ కాలాన్ని స్వర్ణయుగంగా మేధావులు అభివర్ణించారని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వామన్‌రావు అన్నారు. 19వ శతాబ్దంలో కూడా స్ర్తికి గౌరవం వుండేది. ఆ తరువాత కాలంలో బాల్య వివాహాలను అరికట్టి వితంతు వివాహాలను ప్రోత్సహించిన వీరేశలింగం పంతులను గుర్తుచేసారు.

03/14/2016 - 05:33

ఖైరతాబాద్, మార్చి 13: నీటి సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. ప్రపంచ వాటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాక్ ఫర్ వాటర్ సంస్థ, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు.

03/14/2016 - 05:33

* జాబుల కోసం పోటాపోటీ పుస్తక పఠనం
* ఉద్యోగాల నోటిఫికేషన్‌తో అభ్యర్థుల్లో ఉత్సుకత
* రీడర్లతో కిక్కిరిసిన నగర కేంద్ర గ్రంథాలయం
* రీడింగ్ రూంలకూ పెరుగుతున్న ఆదరణ

03/14/2016 - 05:31

జీడిమెట్ల, మార్చి 13: ఆస్తి ఇవ్వడం లేడన్న కోపంతో ఓ వ్యక్తి కన్నతండ్రిపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాజులరామారం డివిజన్ సుభాష్‌చంద్రబోస్ నగర్‌లో నివాసముండే షాబుద్దీన్‌కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు నాజుద్దీన్ పని లేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. కాగా చిన్న కొడుకు వివాహం షాబుద్దీన్ చేశాడు.

03/14/2016 - 05:31

హైదరాబాద్, మార్చి 13: పాఠశాల స్థాయిలోనే కిడ్నీ వ్యాధి గురించి తెలియచేయాలని, ఈ విషయంలో సిఎం కెసిఆర్ దృఢ సంకల్పంతో వున్నారని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

03/14/2016 - 05:30

* సర్కిళ్ల వారీగా దరఖాస్తుల వివరాల సేకరణ

03/14/2016 - 05:19

హాలాహాలాన్ని పుక్కిటపట్టి లోకోద్ధారణ చేసిన మంగళప్రదుడు శివుడు. శివా అన్నశబ్దమేశుభాలనులను కలిగించేది.

Pages