S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 16:36

లక్నో: బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ కోసం యుపి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మాయావతిని కించపరుస్తూ వ్యాఖ్యానించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు తొలుత పోలీసులు బలియా వెళ్లారు. ఆయన ఇంట్లో లేరని తెలియడంతో లక్నోతో పాటు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

07/21/2016 - 16:36

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పెట్టిన తాజా పోస్టు రాజకీయంగా కలకలం రేపుతోంది. తన మంత్రివర్గ సహచరుడు మనీష్ సిసోదియాకు ఈ ట్వీట్‌ను కేజ్రీవాల్ పంపారు. కొద్దిరోజుల క్రితం సిసోదియా దిల్లీలో ప్రభుత్వ కళాశాల భవనాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ‘సిసోదియా.. నీపైకి మోదీజీ సిబిఐని పంపుతారేమో..

07/21/2016 - 14:41

చెన్నై: కోర్టు వివాదాలను అధిగమించి ‘కబాలి’ సినిమా రేపు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ శుక్ర ఫిలింస్ భాగస్వామి ఆర్. మహాప్రభు దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు గురువారం కొట్టివేసింది. ‘కబాలి’ విడుదలకు న్యాయపరంగా ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

07/21/2016 - 14:36

హైదరాబాద్: ముషీరాబాద్ పఠాన్‌బస్తీలో మూడు కుక్కపిల్లలను తాళ్లతో కట్టి మంటల్లో వేసి పైశాచిక ఆనందం పొందిన ఎనిమిది మంది కుర్రాళ్లను పోలీసులు అరెస్టు చేసి గురువారం నాడు జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని జువైనల్ హోంకు తరలించారు.

07/21/2016 - 14:35

విజయవాడ: ఎపిలో కొత్తగా మంజూరైన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటిల్లో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, ఈనెల 31న మెరిట్ లిస్టు పెడతామని మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఈ రెండు ట్రిపుల్ ఐటిలను ఈ ఏడాదికి నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ రెండు సంస్థల్లో ఆంధ్ర ప్రాంతానికి 1230 సీట్లు, రాయలసీమకు 770 సీట్లు కేటాయిస్తున్నామన్నారు.

07/21/2016 - 14:35

దిల్లీ: జమ్ము-కాశ్మీర్‌లో అల్లర్లను పాకిస్తాన్ ప్రేరేపిస్తూ, అమాయక యువతను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. కాశ్మీర్‌లో హింసాత్మక పరిస్థితులపై గురువారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన దేశానికి కిరీటంలా నిలిచే కాశ్మీర్‌లో విధ్వంసానికి పాక్ కుట్ర పన్నుతోందన్నారు. దేశంలో ఉగ్రవాదులను సమర్ధించేవారి సంఖ్య పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

07/21/2016 - 14:34

దిల్లీ: ఎపిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమస్య లేదని, ఆ ప్రాజెక్టును అనుకున్న సమయానికి తామే పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి గురువారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఈ జాతీయ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంకా పూర్తి చేస్తామన్నారు. తెలుగురాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే ఎపెక్స్ కమిటీని నియమిస్తామన్నారు.

07/21/2016 - 14:34

వరంగల్: నగరంలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకున్నందుకు నిరసనగా ఇద్దరు అర్చకులు గురువారం నాడు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు అడ్డుకోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. నగరంలోని భద్రకాళి ఆలయం సమీపంలోని అయ్యప్ప ఆలయాన్ని దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

07/21/2016 - 13:27

హైదరాబాద్‌: స్మార్ట్‌ సిటీస్‌ ప్రణాళిక, నమూనా, అమలులో ప్రపంచస్థాయి సంస్థ అయిన సిస్కోతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, సిస్కో సంస్థ ప్రతినిధులు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. స్మార్ట్‌సిటీ హైదరాబాద్‌ ప్రాజెక్టులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిష్కారాలను ఉపయోగించి మెరుగైన సేవలు అందించేందుకు ఒప్పందం కుదిరింది.

07/21/2016 - 12:42

విశాఖ: పరవాడ మండలం తానాం వద్ద గురువారం ఉదయం రైలు ఢీకొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రైలు వస్తున్న విషయాన్ని ఆమె గమనించక పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని సమాచారం.

Pages