S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 12:42

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7న తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని సమాచారం. మెదక్ జిల్లా గజ్వేల్‌లో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, ఆదిలాబాద్ జిల్లా పెగడపల్లిలో ఎన్‌టిపిసి విద్యుత్ ప్లాంటును మోదీ ప్రారంభిస్తారని తెలిసింది. కొద్దిరోజుల క్రితం దిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్ ప్రధానిని కలిసి తెలంగాణకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలసిందే.

07/21/2016 - 12:41

లక్నో: తమ పార్టీ అధినేత్రి మాయావతిపై బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బిఎస్‌పి కార్యకర్తలు యుపిలో గురువారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దళిత మహిళను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన దయాశంకర్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. బిఎస్‌పి ఆందోళనల నేపథ్యంలో పలు చోట్ల పోలీసులు భారీగా మోహరించారు.

07/21/2016 - 12:41

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో తీర్చిదిద్దిన శ్రీవేంకటేశ్వర స్వామి నమూనా ఆలయం ఆగస్టు 7న ప్రారంభమవుతుంది. నమూనా ఆలయ నిర్మాణం పనులను టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు గురువారం ఉదయం పరిశీలించారు. 7వ తేదీ నుంచే ఈ ఆలయంలో భక్తులను అనుమతిస్తామని, తిరుమలలో జరిగినట్టే నిత్యపూజులు, విశేష సేవలను నిర్వహిస్తామన్నారు. వెయ్యిమంది వరకూ సభ్యులున్న సేవాబృందాలు పాల్గొంటాయన్నారు.

07/21/2016 - 12:40

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని సిపిఐ నేత నారాయణ స్పష్టం చేశారు. బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో రేపు జరిగే పరిణామాలకు ప్రధాని మోదీ, చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు.

07/21/2016 - 12:40

హైదరాబాద్: నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడైన అనిల్‌కుమార్‌రెడ్డికి చెందిన ఇళ్లలో, కార్యాలయంలో గురువారం ఉదయం ఐటి శాఖ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్, నల్గొండ, కాకినాడల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేసి ఆస్తిపాస్తులకు సంబంధించి వివరాలను సేకరించారు.

07/21/2016 - 12:38

హైదరాబాద్ : కేపీహెచ్‌బీలోని రోడ్డు నెంబర్ 5 లోని హాస్టల్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

07/21/2016 - 12:34

హైదరాబాద్ : ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసం వద్ద వంటపని చేస్తున్న శరణప్ప దంపతుల కుమార్తె వైష్ణవి (5) బుధవారం మధ్యహ్నం నుంచి కనిపించడంలేదు. పాఠశాలకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో నారాయణగూడ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వైష్ణవిని 14 ఏళ్ల బాలిక తీసుకెళ్తున్నట్లు సీసీ టీవీ లో కనిపిస్తుండటంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

07/21/2016 - 11:38

అంకారా: టర్కీలో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు తయీప్‌ ఎర్డోగాన్‌ ప్రకటించారు. సైనికుల తిరుగుబాటు నేపథ్యంలో జాతీయ భద్రతామండలి, కేబినెట్‌ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. సైనికుల తిరుగుబాటు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు.

07/21/2016 - 11:36

అమృత్‌సర్‌: దుబాయ్‌ నుంచి గురువారం అమృత్‌సర్‌ చేరుకున్న స్పైస్‌జెట్‌ విమానంలో అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. అమృత్‌సర్‌ చేరుకోగానే విమానంలో తనిఖీలు చేపట్టారు.

07/21/2016 - 11:33

ముంబయి: నేడు ఉదయం స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 20 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 10 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు కోల్పోయి రూ.67.25 పైసల వద్ద నమోదైంది.

Pages