S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 04:32

హైదరాబాద్, జూలై 2: రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన విజయ డెయిరీ పాల ప్యాకెట్ల పోలికతో ప్రైవేట్ సంస్థ శ్రీ సాంబశివ డెయిరీ ప్రోడక్ట్స్ పాల ప్యాకెట్లను విడుదల చేస్తోందని విజయ డెయిరీ (తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య) మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు.

07/03/2016 - 04:31

బెంగళూరు, జూలై 2: కీలక ఎరువులైన డైఅమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి), మురియత్ ఆఫ్ పొటాష్ (ఎమ్‌ఒపి), నైట్రోజన్ ఫాస్ఫేట్ అండ్ పొటాష్ కంపోజిషన్ (ఎన్‌పికె) ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఇక్కడ కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ‘డిఎపి, ఎమ్‌ఒపి, ఎన్‌పికె ఎరువుల ధరలు గడచిన పదిహేను సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తగ్గలేదు. పైగా వీటి ధరలు పెరిగాయి.

07/03/2016 - 04:30

బోస్టన్, జూలై 2: ‘కత్తులతో కాదు.. కంటి చూపుతో చంపేస్తా’ ఓ సూపర్‌హిట్ తెలుగు సినిమాలోని పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ సంగతి ఎందుకు? అనుకుంటున్నారా.. అదే చెబుతున్నాం.. త్వరలో ఓ సరికొత్త టెక్నాలజీ పరిచయం కానుంది. రోజుకో టెక్నాలజీ వస్తోంది అయితే ఏంటి? అనుకోకండి. ఎందుకంటే ఈ టెక్నాలజీతో మీరు మీ స్మార్ట్ఫోన్‌ను కంటి చూపుతోనే కంట్రోల్ చేసేయొచ్చు.

07/03/2016 - 04:27

న్యూఢిల్లీ, జూలై 2: బులియన్ మార్కెట్‌లో వెండి వెలుగులు విరజిమ్ముతున్నాయి. శనివారం ఒక్కరోజే కిలో వెండి ధర 960 రూపాయలు ఎగిసిపడగా, వారం రోజుల్లో 3,170 రూపాయలు పెరిగి కిలో వెల 45 వేల మార్కును అధిగమించి 45,560 రూపాయలను తాకింది. గత నాలుగు రోజులుగా వెండి ధరలు పెరుగుతూనే ఉండగా, శనివారం కూడా అదేతీరు సాగింది. దీంతో రెండేళ్ల గరిష్ఠ స్థాయికి ధర చేరింది.

07/03/2016 - 04:25

న్యూఢిల్లీ, జూలై 2: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తిగత ఆస్తులు గత ఆర్థిక సంవత్సరం (2015-16) 2.8 కోట్ల రూపాయలు క్షీణించాయి. 2015 మార్చి 31కి 71.95 కోట్ల రూపాయలుగా ఉన్న జైట్లీ సంపద.. 2016 మార్చి 31కి 69.13 కోట్ల రూపాయలకు వచ్చింది. ఈ మేరకు 2015-16కుగాను తాజాగా విడుదల చేసిన వ్యక్తిగత వార్షిక ఆస్తులు, అప్పుల ప్రకటనలో జైట్లీ పేర్కొన్నారు.

07/03/2016 - 04:20

నెల్లూరు, జూలై 2: నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో దుగరాజపట్నం తీరం వద్ద పోర్టు నిర్మాణం ఇప్పట్లో సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ పోర్టు నిర్మాణం లాభసాటిగా ఉండదన్న నిపుణుల నివేదికతో దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుపై జిల్లా వాసుల్లో ఉన్న ఆనందం ఆవిరైపోయింది. గత యుపిఎ ప్రభుత్వం ఈ పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

,
07/03/2016 - 04:10

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. విందుకు హాజరైన ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ , ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తదితరులు

07/03/2016 - 04:04

మెంఫిస్, జూలై 2: అమెరికాలో నలుగురు పిల్లలను కన్నతల్తే హతమార్చింది. పదునైన ఆయుధంలో చిన్నారుల గొంతుకోసి చంపేసినట్టు పోలీసులు తెలిపారు. టనె్సస్సీలో ఈ దారణం చోటుచేసుకుంది. గేటెడ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో హత్యలు జరిగినట్టు పోలీసు అధికారి ఇర్లే ఫరెల్స్ చెప్పారు. కన్నతల్లే ఇలాంటి ఘాతుకానికి ఎందుకు పాల్పడిందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

07/03/2016 - 04:03

జైపూర్, జూలై 2: రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. తప్పతాగినట్లు అనుమానిస్తున్న ఒక ఎమ్మెల్యే కుమారుడు తన బిఎండబ్ల్యు కారుతో శనివారం ఒక ఆటోరిక్షాను ఢీకొట్టి ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నాడు. అనంతరం ఈ కారు ఒక పిసిఆర్ వ్యాన్‌ను ఢీకొనడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు.

07/03/2016 - 03:59

న్యూఢిల్లీ, జూలై 2: అభివృద్ధి చెందుతున్న దేశాలకంటేౄ అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ కర్బన ఉద్గారాలను వదిలిపెడుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అన్నారు. మానవ హక్కులను, పర్యావరణాన్ని పరిరక్షించడానికి పటిష్ఠమైన అంతర్జాతీయ చట్టం ఆయుధంగా పని చేస్తుందని కూడా అన్నారు.

Pages