S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 02:33

విజయవాడ, జూలై 2: కృష్ణాడెల్టా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించుకునేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి నీటిమట్టం 14 అడుగులకు మించి ప్రవహిస్తున్న దృష్ట్యా ఈ నెల 6న పట్టిసీమ పథకం 24 పంపుల ద్వారా నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువకు మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.

07/03/2016 - 02:30

న్యూఢిల్లీ, జూలై 2: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోసలే శనివారం ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఎస్ ఠాకూర్‌ను కలిసి అత్యంత వివాదాస్పదంగా మారిన ఉమ్మడి హైకోర్టు విభజనపై సమాలోచనలు జరిపారు. గతరాత్రి ఢిల్లీకి వచ్చిన భోసలే శనివారం ఉదయం ఠాకూర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.

07/03/2016 - 02:28

ఢాకా, జూలై 2: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ, రెస్టారెంట్‌పై శుక్రవారం రాత్రి దాడి చేసిన ఉగ్రవాదులు 20మందిని కిరాతకంగా నరికి చంపారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఆరుగురిని సైనిక దళాలు మట్టుపెట్టగా, ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నాయి.

07/03/2016 - 02:25

హైదరాబాద్, జూలై 2: పార్టీ మారిన 13 మంది వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులపై ఆ పార్టీ సభ్యులు ఇచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించినట్లు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఎన్నికల్లో తాను 11 కోట్లు ఖర్చు చేశానన్న ఆరోపణలను త్రోసిపుచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

07/03/2016 - 02:22

విజయవాడ, జూలై 2: కృష్ణా పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులు, భక్తుల కోసం తలపెట్టిన ఏర్పాట్లు ఈ నెలాఖరులోగా పూర్తికావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, గడువులోగా పూర్తి చేయకుంటే చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు.

07/03/2016 - 02:18

హైదరాబాద్, జూలై 2: కాకినాడకు సమీపంలోని వాకలపూడి వద్ద ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ సంస్థకు 48 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ఇక్కడ ఫ్లోటింగ్ స్టోరేజి, రీ గ్యాసిఫికేషన్ యూనిట్‌ను ఎల్‌ఎన్‌జి టెర్మినల్ కోసం నిర్మిస్తారు. దీని నిమిత్తం ఈ భూమిని కేటాయించారు.

07/03/2016 - 02:17

గుంటూరు, జూలై 2: స్నానానికి వెళ్లి పంటకుంటలో పడి నలుగురు విద్యార్థులు మృతిచెందిన సంఘటన శనివారం సాయంత్రం గుంటూరు జన్మభూమినగర్‌లో జరిగింది. స్తంభాలగరువు హాస్టల్‌లో 9, 10 తరగతులు చదువుతున్న సంకుల కార్తీక్ (13), నేర్లకంటి రామకృష్ణ (17), దక్షిణామూర్తి ఈశ్వర్ (13), ఒంటెద్దు రవి (12)లతోపాటు మరో ఇద్దరు విద్యార్థులు స్నానం చేసేందుకు సమీపంలోని పంటకుంటలో దిగారు.

07/03/2016 - 02:16

హైదరాబాద్, జూలై 2: వివాదాస్పదంగా మారిన విజయవాడ దేవాలయాల కూల్చివేతల వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సీరియస్ అయింది. దీంతో ఇప్పటివరకూ ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చిన బిజెపి నేతల్లో కూడా చురుకుదనం మొదలయింది. చివరకు ఏపి సీఎం చంద్రబాబు కూడా స్పందించి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని ఆదేశించాల్సి వచ్చింది.

07/03/2016 - 02:08

పెద్దవాళ్లు చిన్నపిల్లల చేష్టలు చేస్తే ఎలా ఉంటుంది? ఏపి-తెలంగాణ ప్రభుత్వాల గొడవల్లా ఉంటుంది! హైకోర్టు విభజనపై తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న తగాదాల్లో ఇంతకూ తప్పెవరిది? పరిష్కారకర్త ఎవరన్నది బ్రహ్మపదార్ధం మాదిరిగా తయారయింది. అం దరూ తమ తప్పు లేదంటే తమ తప్పు లేదని అడ్డంగా వాదించేవారే. ఇద్దరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాల్సిన గవర్నర్ గుళ్లు, గోపురాలు, విందుల్లో బిజీగా ఉన్నారు.

07/03/2016 - 01:59

‘‘ఏదీ శాశ్వతం కాదు.’’
‘‘ఔను ఎప్పుడైనా అనుకున్నామా సికిందరాబాద్‌లో ఆనంద్ భవన్ మూసేస్తారని, జె రామచంద్రయ్య క్లాత్ స్టోర్‌ను కూల్చేసారని, నగరం రూపే మారిపోతోంది’’
‘‘అఫ్ఘానిస్తాన్‌లో అంత పెద్ద బుద్ధుని విగ్రహానే్న , రష్యాలో ఎర్ర దేవుడు లెనిన్ విగ్రహాలను కూల్చేసినప్పుడు ఆనంద్‌భవన్‌ను కూల్చడం ఎంత సేపు.. నేనంటున్నది దాని గురించి కాదు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించనివి జరుగుతుంటాయి’’

Pages