S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 22:05

ప్రపంచ క్రీడా రంగాన్ని కుదిపేసిన సంఘటనల్లో రష్యా వ్యూహాత్మక డోపింగ్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీపై ఎనిమిదేళ్ల వేటు పడడం సంచలనాన్ని సృష్టిస్తే, రష్యా వ్యూహాత్మక డోపింగ్ అంశం ప్రకంపనలకు కారణమైంది.

07/02/2016 - 22:02

ప్రపంచ మాజీనంబర్ వన్ రోజర్ ఫెదరర్‌ది విలక్షణ శైలి. తనదైన ఆట తీరుతో అతను లక్షలాది మందిని ఆకట్టుకున్నాడు. ఫెదరర్ కొట్టిన ఒక ‘ట్రిక్ షాట్’ చాలా కాలంగా యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది. ఒక కంపెనీ వ్యాపార ప్రకటనలో పాల్గొన్న ఫెదరర్ అద్భుతమైన సర్వీస్ చేశాడు. అతను కొట్టిన బంతి వేగంగా వెళ్లి, స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి తలపై పెట్టుకున్న క్యాన్‌కు తగిలింది. ఒకసారి కాదు..

07/02/2016 - 22:00

పూలకి
రంగుల్ని పులుముతున్నాయ్
సీతాకోకలు!
మబ్బులకు
రెక్కల్ని తొడుగుతున్నాయ్
గాలి తెమ్మెరలు!
మనిషి పడిపోకుండా
వాని పాదాల్ని పట్టుకు
నడిపిస్తోంది
ధరిత్రి!
చెట్టుకొమ్మ
పచ్చని పతంగుల్ని
ఎగరేస్తోంది
సంక్రాంతి సంబురంగా!
తాను పారేసుకున్న పాటని
గూట్లో వెదకుతోంది పక్షి!

07/02/2016 - 21:59

ఆటగాళ్లలో చాలా మందికి ఏదో ఒక అలావాటు లేదా నమ్మకం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎదుటివారికి హాస్యాస్పదంగా కనిపించే చాలా నమ్మకాలు ఎంతో మందిలో కనిపిస్తాయ. ప్రపంచ మాజీ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఇందుకు అతీతుడేమీ కాదు. అతనికీ ఓ వింత నమ్మకం ఉంది. మ్యాచ్‌లు ఆడే ప్రతిసారీ అతను తన వాటర్ బాటిల్‌ను కుర్చీకి మధ్యగా ఉంచుతాడు.

07/02/2016 - 21:59

వారి దేహంలో
విదేశీ మోజులున్నాయి
ఆర్కిటెక్టులు, ఆహ్వానాలతో
ఆకర్షిస్తున్నాడు.
హైటెక్‌లతో హంగులు దిద్దుతున్నాడు
స్మార్ట్‌గా స్మైల్ ఇస్తూ సైలెన్స్ చేస్తున్నాడు
కామ్‌గా కారిడార్లు అంటూ కాటేస్తున్నాడు
సింపుల్‌గా సింగపూర్ అంటూ
ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు
ఫైల్స్‌తో పోజులిస్తూ ఫొటోలు దిగుతున్నాడు
ఒప్పందాలు అంటూ వాటేసుకుంటున్నాడు

07/02/2016 - 21:59

అర్జెంటీనాలో సాకర్‌కు ఎంతో ఆదరణ. చిన్నతనం నుంచే ఫుట్‌బాల్‌తో ఆటలాడడం, జాతీయ జట్టుకు ఎంపిక కావాలని నిరంతరం శ్రమించడం అక్కడ ప్రతి ఒక్కరికీ అలవాటు. జాతీయ జట్టుకు మ్యాచ్‌లు ఆడడం చాలా గొప్ప. ఇక ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగితే, అంతకంటే కావాల్సింది ఏముంటుంది. అందుకే, కేవలం ఒక్క నిమిషమైతేనేం...

07/02/2016 - 21:58

చెమట చుక్కనెప్పుడూ చులకన చెయ్యొద్దు
నుదుటి మీద రాతనే మార్చగలదు -
నుదురుపై మొలిచిన చెమట!
సేవకుడూ, కర్షకుడూ, శ్రామికుడూ.. వీళ్లంతా
భ్రమల్లో బతకరు - శ్రమలోనే జీవిస్తారు!!
స్వేదం - ఒక వేదం...
కరకురాయిని పిండి చేసి
బీడు భూమిని పండించే మనోజ్ఞ రాగం
శ్రమైక జీవన సౌందర్యానికి నిలువెత్తు సత్యం
నరనరాన బిరాబిరా పరిగెత్తే రక్తఘోష నాదం

07/02/2016 - 21:57

రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఐఒసి తీవ్రంగా స్పందించింది. రియో ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లుపై నిషేధాన్ని విధిస్తూ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) తీసుకున్న నిర్ణయానికే ఐఒసి ఓటు వేసింది. సస్పెన్షన్‌ను అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎసి)లో రష్యా అథ్లెట్లు కొందరు సవాలు చేసినప్పటికీ, సానుకూల స్పందన రావడం అనుమానంగానే ఉంది.

07/02/2016 - 21:57

ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి రోజురోజుకూ మాయమవుతున్నది. రష్యా ఒలింపిక్ ట్రయల్స్‌లో చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రియో ఒలింపిక్స్‌లో పోటీపడే రెజ్లర్లను ఎంపిక చేయడానికి రష్యా రెజ్లింగ్ సమాఖ్య ట్రయల్స్‌ను నిర్వహించినప్పుడు 57 కిలోల విభాగంలో విక్టర్ లెబెడెన్, ఇస్మాయిల్ ముసుకయెవ్ పోటీపడ్డారు. అయితే, బౌట్ మధ్యలో ఇద్దరూ రెజ్లింగ్ పోటీని మరచిపోయి బాహాబాహీకి దిగారు.

07/02/2016 - 21:56

రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ చేస్తున్న ప్ర యత్నాలకు గండి పడింది. కండరాల నొప్పి కారణంగా అతను జమైకా ఒలింపిక్ ట్ర యల్స్ నుంచి వైదొలిగాడు. దీనితో అతను బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకాల వేట కొనసాగిం చ గలుగుతాడా? లేదా? అన్నది అనుమానంగా మారింది.

Pages