S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 18:29

తిరువనంతపురం: సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటంతో పాటు ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

07/02/2016 - 18:25

హైదరాబాద్: ఆస్తి గొడవల నేపథ్యంలో సొంత అన్నపైనే ఓ తమ్ముడు దాడి చేసి అతని గొంతుకోసిన ఘటన నగరంలోని గాంధీనగర్‌లో శనివారం జరిగింది. ఆస్తి కోసం అన్న శ్రీ్ధర్ యాదవ్, తమ్ముడు శేఖర్ యాదవ్‌ల మధ్య ఎప్పటిలాగే మాటామాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన తమ్ముడు శేఖర్ అన్న శ్రీ్ధర్ గొంతును కత్తితో కోశాడు. వెంటనే స్థానికులు జోక్యం చేసుకుని శ్రీ్ధర్‌ను ఆస్పత్రికి తరలించారు.

07/02/2016 - 18:24

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టిన వివిధ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎపి సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన శనివారం ఇక్కడ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, కచ్చితంగా నెల రోజుల్లోగా పుష్కర ఘాట్లు, బారికేడ్ల ఏర్పాట్లు, ఆలయాల సుందరీకరణ, రోడ్డు పనులు పూర్తికావాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు.

07/02/2016 - 18:24

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ సిఎం కెసిఆర్ శనివారం రాజ్‌భవన్‌లో కలిశారు. తెలంగాణలో న్యాయవాదులు ఆందోళన, న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు, హైకోర్టు విభజన, తాజా పరిణామాలపై ఆయన గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. లాయర్ల ఆందోళనపై గవర్నర్ శుక్రవారం నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు కొంతమంది ప్రముఖుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

07/02/2016 - 18:23

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వైకాపా ఇచ్చిన పిటిషన్‌ను ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం తిరస్కరించారు. టిడిపిలో చేరిన 13 మందిని అనర్హులుగా ప్రకటించాలని గతంలో వైకాపా స్పీకర్‌కు అర్జీని సమర్పించింది. అయితే, పలు సాంకేతిక లోపాల వల్ల ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ స్పష్టం చేశారు.

07/02/2016 - 18:23

హైదరాబాద్: తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి 5వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ సిఎం కెసిఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి శనివారం లేఖ రాశరు. జలవనరులను పెంచేందుకు మిషన్ కాకతీయ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ పథకానికి నిధుల కోసం నీతి ఆయోగ్ కూడా సిఫారసు చేసిందన్నారు. వెనుకబడిన తెలంగాణ జిల్లాలను దృష్టిలో పెట్టుకుని నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు.

07/02/2016 - 18:22

ఆదిలాబాద్: భైంసా పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు నడిరోడ్డుపై యువతిని దారుణంగా హతమార్చాడు. తనను ప్రేమించలేదన్న కక్షతో మహేష్ అనే యువకుడు స్థానిక గోవిందనగర్‌కు చెందిన సంధ్య (16)పై కిరాతకంగా కత్తితో గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే రక్తపుమడుగులో ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు.

07/02/2016 - 18:21

మహబూబ్‌నగర్: బిజెపి నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతుండగా తెరాస కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకువచ్చి నిరసనకు దిగారు. ఆయనపై దాడి చేసేందుకు వారు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బిజెపి, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

07/02/2016 - 18:18

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సాయంత్రం డిండి ఎత్తిపోతల పథకంపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

07/02/2016 - 18:16

ఘజియాబాద్‌ ( ఉత్తరప్రదేశ్‌): ఆస్తి తగాదాలతో భార్యే భర్తను చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. తండ్రి జితేంద్ర సింగ్‌ తోమర్‌ జూన్‌ 26 నుంచి కనిపించడం లేదని ఆయన కూతురు కవినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కుమారుడు అమిత్‌, కారు డ్రైవర్‌ ప్రవీణ్‌ను ప్రశ్నించారు. తల్లి, కారు డ్రైవర్‌లతో కలిసి తండ్రిని హత్య చేసినట్లు అమిత్‌ అంగీకరించారు.

Pages