S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 11:41

సికింద్రాబాద్: బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో షాపూర్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

07/02/2016 - 11:41

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో అనుమానితుడైన రామ్‌కుమార్ (24)ను చెన్నై పోలీసులు తిరునెల్వేలిలో ఎట్టకేలకు అరెస్టు చేశారు. పోలీసులను చూడగానే బ్లేడుతో గొంతుకోసుకుని నిందితుడు ఆత్మహత్యకు యత్నించి గాయపడడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు కోలుకున్న తర్వాత పోలీసులు విచారణ జరిపితే హత్యకు దారితీసిన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

07/02/2016 - 11:39

తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు బయలుదేరారు. సూళ్లూరుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బళ రాజిరెడ్డి అంత్యక్రియల్లో జగన్ పాల్గొంటారు.

07/02/2016 - 11:36

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య దిశగా కదులుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని, గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

07/02/2016 - 08:37

నాగార్జునసాగర్, జూలై 1: నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై రెండు రోజులుగా భద్రతను పెంచామని నాగార్జునసాగర్ డ్యాం భద్రత అధికారి రమణారెడ్డి తెలిపారు. హైద్రాబాద్‌లో ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా పోలీసుశాఖ ఇంటెలిజెన్స్ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, బహళార్థ సాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై నిఘాను పెంచారు.

07/02/2016 - 08:37

నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ కేంద్రంగా గంజాయిని స్మగ్లింగ్ చేసే అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ రూరల్ పోలీసులు గట్టి నిఘా వేసి చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 3కోట్ల రూపాయల విలువ చేసే శుద్ధి చేయబడిన ఎండు గంజాయి నిల్వలతో పాటు 7.12లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

07/02/2016 - 08:36

నల్లగొండ, జూలై 1: కరవు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా రైతాంగానికి ఒకవైపు డిండి ఎత్తిపోతలతో కృష్ణా నీరు, మరోవైపు ప్రాణహిత-చేవెళ్ల (కాళేశ్వరం) ప్రాజెక్టుతో గోదావరి జలాలను, ఇంకోవైపు మూసీ కాల్వల విస్తరణతో సాగునీటిని అందించాలన్న ప్రభుత్వం లక్ష్యం క్రమంగా ముందడుగు వేస్తోంది.

07/02/2016 - 08:35

నిజామాబాద్, జూలై 1: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా సరిహద్దున మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం పైకి లేపి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ వర్షాకాలం సీజన్ ముగింపు సమయమైన అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ ప్రాజెక్టు గేట్లను యథాతథంగా తెరిచి ఉంచనున్నారు.

07/02/2016 - 08:31

విజయవాడ, జూలై 1: రంజాన్ పండుగ రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖల మంత్రి డా.పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. స్థానిక చిట్టినగర్‌లోని ఈద్‌గాహ్ షాదీఖానాలో శుక్రవారం ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫాను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి అందజేవారు.

07/02/2016 - 08:31

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే విషయమై వచ్చే వారం వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయబోమని తెరాస సర్కారు హైకోర్టుకు తెలియజేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.

Pages