S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 07:40

ఖమ్మం, ఏప్రిల్ 29: కాంగ్రెస్ వ్యతిరేక విధానాల వల్ల ఏర్పడిన తెలుగుదేశం పార్టీ పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌తో పొత్తు కలవటంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ సందర్భంగా ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ అనైతిక పొత్తులతో పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు.

04/30/2016 - 07:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్టమ్రంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవరావు విలేఖరులతో మాట్లాడుతూ రోడ్డు భద్రతపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

04/30/2016 - 07:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో సహా అన్ని విషయాల్లో కేంద్ర సాకులు వెదకుతోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావువిమర్శించారు. పార్లమెంట్ అవరణలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావల్సిన నిధులు హామీల విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కొద్దిపాటి నిధులు విడుదల చేస్తే 2018 నాటికి ఏ విధంగా పూర్తవుతుందని ప్రశ్నించారు.

04/30/2016 - 07:38

రాజంపేట, ఏప్రిల్ 29: పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కే ఇవ్వాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం కడప జిల్లా రాజంపేట మండల పరిషత్ అతిథిగృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీ రామారావు రూపొందించిన తెలుగుదేశం పార్టీ మార్గదర్శకాలు, సిద్ధాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిలోదకాలిస్తున్నారని దుయ్యబట్టారు.

04/30/2016 - 07:38

కడప/కర్నూలు/అనంతపురం, ఏప్రిల్ 29:కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో శుక్రవారం వడదెబ్బకు 10 మంది మృతిచెందారు.

04/30/2016 - 07:37

విశాఖపట్నం, ఏప్రిల్ 29: పారిశ్రామిక నగరం విశాఖలోని పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పరిశ్రమల్లో పాటిస్తున్న భద్రతాప్రమాణాలు, ఇతర అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌కు ఆదేశాలందాయి. ఈ మేరకు కలెక్టర్ యువరాజ్ ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి, నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.

04/30/2016 - 07:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఎపికి ప్రత్యేక హోదా సహా రాష్ట్ర సమస్యలు పరిష్కారానికి వైకాపా సహకరిస్తుందని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర సమస్యల పరిష్కారంపై ధ్యాస లేదని, ఎంతసేపూ వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలనే చూస్తున్నారని ఆయన విమర్శించారు.

04/30/2016 - 07:36

ఖమ్మం, ఏప్రిల్ 29: టిఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తూ ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ఆరోపించారు.

04/30/2016 - 07:35

తిరుమల, ఏప్రిల్ 29: తిరుమల శేషాచలం అడవుల్లో శుక్రవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటలకు జాపాలి తీర్థం వెళ్లే కాలినడక మార్గం మధ్యలో ఉన్న గౌతమి వనం ప్రాంతంలో, సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తుంబుర తీర్థం వద్ద ఉన్న కన్యమడుగు ప్రాంతాలు అగ్నికి ఆహుతైయ్యాయి. గౌతమివనం వద్ద జరిగిన ప్రమాదంలో సుమారు మూడు హెక్టార్ల అటవీప్రాంతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

04/30/2016 - 07:34

కాకినాడ, ఏప్రిల్ 29: కనీవినీ ఎరుగని రీతిలో భారీ అవినీతి తిమింగలం ఆస్తులు బయటి ప్రపంచానికి బహిర్గతమవుతున్నాయి. తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల ఆస్తుల వివరాలను చూసేసరికి సాక్షాత్తూ అవినీతి నిరోధక శాఖాధికారులకే దడ పుడుతోంది.

Pages