S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/15/2016 - 04:26

రాజ్‌కోట్, ఏప్రిల్ 14: గత సీజన్ వరకూ ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఆడిన సురేష్ రైనా ఈ సీజన్‌లో గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా అతనికే షాకిచ్చాడు. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో గురువారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ మరో 12 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

04/15/2016 - 04:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య శుక్రవారం జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిని రేపుతోంది. కోల్త్ నైట్ రైడర్స్‌తో జరిన మ్యాచ్‌లో డేర్‌డెవిల్స్ ఘోర పరాజయాన్ని ఎదుర్కోగా, గుజరాత్ లయన్స్‌తో తలపడిన పంజాబ్ కూడా ఓటమిపాలైంది. గత ఐపిఎల్‌లో డేర్‌డెవిల్స్, పంజాబ్ జట్లు కింద నుంచి మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి.

04/15/2016 - 04:23

మాడ్రిడ్, ఏప్రిల్ 14: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ బార్సిలోనాకు చుక్కెదురైంది. ఆంటోన్ గ్రీజ్మన్ రెండు కీలక గోల్స్ చేసి, బార్కాపై అట్లెటికో మాడ్రిడ్‌ను సెమీ ఫైనల్స్ చేర్చాడు. రెండు సెమీస్‌లో కలిసి అట్లెటికో మాడ్రిడ్ సగటున 3-2 తేడాతో గెలిచింది. మ్యాచ్ ప్రథమార్ధంలో అద్భుతమైన హెడర్‌తో మొదటి గోల్ చేశాడు.

04/15/2016 - 04:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీ లకు భారత స్టార్ మేరీ కోమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించ నుంది. 33 ఏళ్ల కోమ్ ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌గా నిలి చింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకుంది. అయతే, ఈఏడాది రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించ లేకపోయంది.

04/15/2016 - 04:21

సింగపూర్, ఏప్రిల్ 14: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మిం టన్ టోర్నమెంట్‌లో భారత్ పోరు రెండో రౌండ్‌తోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో టైటిల్ సాధిస్తుందనుకున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫిట్నెస్ సమస్య కారణంగా చివరి క్షణాల్లో వైదొలగిన విష యం తెలిసిందే. దీనితో భారత్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించిన తెలుగు తేజం పివి సింధు రెండో రౌండ్‌లో నే ఓటమిపాలైంది.

04/15/2016 - 04:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ 13 శాతం పెరిగి రూ. 3.45 లక్షల కోట్లకు చేరుకుంది. రిటైల్ ఇనె్వస్టర్లు ఈ పథకాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడమే వీటి అసెట్ బేస్ ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణం. 2015 మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ రూ. 3.05 లక్షల కోట్లు ఉండగా, అది ఈ ఏడాది మార్చి చివరికి రూ.

04/15/2016 - 04:10

వాషింగ్టన్, ఏప్రిల్ 14: దేశంలో ఈ ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయని, వర్షపాతం సాధారణ సగటు కంటే అధికంగా నమోదవుతుందని చెబుతున్న వాతావరణ నిపుణుల అంచనాలు నిజమైతే భారత ఆర్థికాభివృద్ధి మరింత వేగాన్ని పుంజుకుని గత ఆర్థిక సంవత్సరం సాధించిన స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రేటు (7.5 శాతం) కంటే మరింత మెరుగైన వృద్ధిరేటును సాధించడం ఖాయమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

04/15/2016 - 04:19

ముంబయి, ఏప్రిల్ 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సాగరమాల’ ప్రాజెక్టు గడువును సగానికి కుదించుకోవాలని నిర్ణయించింది.

04/15/2016 - 04:06

హైదరాబాద్, ఏప్రిల్ 14: ప్లాటినం 3జి నెట్ వర్క్‌ను హైదరాబాద్‌లోని తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. త్వరలో ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.

04/15/2016 - 04:05

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) మహిళా సంస్థ (ఎఫ్‌ఎల్‌ఓ) జాతీయ ఉపాధ్యక్షురాలిగా అపర్ణ పింకీరెడ్డి ఎంపికయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 32వ వార్షిక సమావేశంలో పింకీరెడ్డి ఈ పదవికి ఎంపికయ్యారని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Pages