S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/15/2016 - 02:13

హైదరాబాద్, ఏప్రిల్ 14:కలకత్తాలో భారీ ఫ్లై ఓవర్ కూలిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు మెట్రో అధికారులకు సూచించారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష జరిపారు. మెట్రో భవన్‌లో జరిగిన సమీక్షలో ఎల్ అండ్ టి ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

04/15/2016 - 02:11

గరిడేపల్లి, ఏప్రిల్ 14: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన పోటు భగత్‌కుమార్ దేశంలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక యూరోపియన్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ఎడిటోరియల్ బోర్డులో మెంటర్‌గా ఎంపికయ్యారు.

04/15/2016 - 02:09

సుల్తానాబాద్, ఏప్రిల్ 14: నిప్పుల కొలిమిగా ఎండలు మండిపోతుండడంతో.. నడిరోడ్డుపైనే యువకులు గురువారం గుడ్డుతో ఆమ్లెట్ వేశారు. ముఖ్యంగా బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రత నమోదు పెరిగింది. ఈ దశలో కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ పాత జెండా, గాంధీనగర్‌కు చెందిన యువకులు మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుపైన పెనం పెట్టి కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసుకున్నారు.

04/15/2016 - 02:07

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 14: ఏఓబి (ఆంధ్ర-ఒడిశా సరిహద్దు)గా ఒకప్పుడు వ్యవహరించిన తూర్పు గోదావరి, ఖమ్మం, చత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలు మావోయిస్టు కదలికలు, పోలీసు ప్రత్యేక బలగాల తాకిడితో దద్దరిల్లుతున్నాయి. సరిహద్దు ఆదివాసీ ప్రాంతాలు భయం గుప్పిట అల్లాడుతున్నాయి. చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట మావోయిస్టు ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

04/15/2016 - 02:06

హైదరాబాద్, ఏప్రిల్ 14: నిధులు లేవని బావురుమంటున్న విశ్వవిద్యాలయాలు కోట్లు ఇస్తామన్నా కిక్కురుమనడం లేదు. లాజిక్ అంతా ఆయా విశ్వవిద్యాలయాలు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ (న్యాక్) గుర్తింపు పొందాల్సి ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాలు గతంలో ‘న్యాక్’ గుర్తింపు పొందినా అది కాస్తా ముగింపు దశకు వచ్చింది. అయినా వర్శిటీలు మేలుకోవడం లేదు.

04/15/2016 - 01:08

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాజ్యాంగంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన వెసులుబాటు వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆయన దయ వల్లనే ప్రస్తుతం తెలంగాణ సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తోందన్నారు.

04/15/2016 - 01:05

హైదరాబాద్, ఏప్రిల్ 14: అధిక ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సీజన్‌లోనే ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లా మణుగూరులో నమోదైంది. గురువారం నాడు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మణుగూరు నిప్పుల గుండాన్ని తలపించింది. కాగా వచ్చే మూడు రోజులు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

04/15/2016 - 01:04

ఆదిలాబాద్, ఏప్రిల్ 14: ఓ బంధువు అంత్యక్రియల కోసం ఆటోలో వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఆటో అదుపుతప్పి వంతెన పైనుండి లోయలో పడ్డ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కన్గుట్టలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

04/15/2016 - 01:01

హైదరాబాద్/ బేగంపేట, ఏప్రిల్ 14:విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికిందరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ సమీపాన జరిగిన ఈ సంఘటన స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మహంకాళి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌పెక్టర్ డిడి సింగ్ కథనం ప్రకారం.. నగరంలోని చింతల్‌కు చెందిన హోంగార్డు బాల్‌రాజ్ (44) గత ఎనిమిది మాసాలుగా మహంకాళి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

04/15/2016 - 01:55

మహూ(ఎంపీ), ఏప్రిల్ 14: బాబాసాహెబ్ అంబేద్కర్ సాధారణ మనిషి కారని.. ఆయన ధైర్యానికి, పట్టుదలకు ప్రతిరూపమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సమానత్వం, గౌరవం కోసం ఆయన పోరాటం సాగిందని మోదీ కొనియాడారు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని అంబేద్కర్ జన్మస్థలం మహూలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.

Pages