S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/15/2016 - 04:04

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్‌గా దిననాథ్ దుభాషి నియమితులయ్యారు. గురువారం నుంచి దుబాషి నియామకం అమల్లోకి వస్తుందని ఎల్‌అండ్‌టి వెల్లడించింది. ఫైనాన్సియల్ రంగంలో ఆయనకు 25 ఏళ్ల పాటు విశేష అనుభవం ఉందని, కార్పొరేట్ బ్యాంకింగ్, క్యాష్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ రేటింగ్స్, రిటైల్ లెండింగ్, రూరల్ ఫైనాన్సింగ్ విభాగాల్లో ఆయన పని చేశారు.

04/15/2016 - 04:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ‘పన్ను ఎగవేతకు స్వర్గ్ధామాలు’ (టాక్స్ హెవెన్స్) అనే ముద్ర వేయడంపై కొన్ని చిన్న దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది చాలా అవమానకరమైన పదమని భారత్‌లాంటి దేశాలకు ఆ దేశాలు నిరసన తెలియజేయడమే కాకుండా నల్లధనంపై ఆ దేశాలు జరుపుతున్న దర్యాప్తులకు సహకరించబోమని హెచ్చరికలు చేశాయి.

04/15/2016 - 04:02

హైదరాబాద్, ఏప్రిల్ 14:నగర శివార్లలోని మహేశ్వరం మండలంలోని ఫ్యాబ్‌సిటీలో భగవతీ ప్రోడక్ట్స్, మైక్రోమాక్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు గురువారం ప్రారంభించారు.

04/15/2016 - 03:45

ముంబయి, ఏప్రిల్ 14: దేశంలోని నదీ తీరప్రాంత రేవులను అభివృద్ధి చేయడానికి లక్ష కోట్ల రూపాయలమేర పెట్టుబడులు సేకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ ప్రకటించారు. దేశంలోని 7,500 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని ప్రగతి ఇంజన్‌గా మారుస్తామని వెల్లడించారు. సురక్షితంగా, భద్రతాయుతంగా సంతృప్తికరంగా ఈ తీర ప్రాంతాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

04/15/2016 - 03:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ 125వ జయంతిని దేశమంతటా ఘనంగా నిర్వహించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి మహమ్మద్ హమీద్ అన్సారీ గురువారం పార్లమెంటు లాన్స్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ఆయన విశ్వ మానవుడని ప్రశంసించారు.

04/15/2016 - 03:37

నాగ్‌పూర్, ఏప్రిల్ 14: దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌పై ఇక్కడ బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు.

04/15/2016 - 03:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడయిన రాబర్ట్ వాద్రా తనకు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికి ఎలాంటి విముఖత లేదని గురువారం సూచనప్రాయంగా చెప్పారు. ప్రజలకోసం పనిచేయాలని తాను భావించినప్పుడు, అందుకు సంబంధించిన అవకాశాలు కూడా తలుపుతట్టినప్పుడు ఎవరూ కూడా వాటిని కాదనలేరని వాద్రా తెలిపారు. అయితే తన భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందేనని ఆయన అన్నారు.

04/15/2016 - 03:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు జరిపించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం గురువారం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనుగోలునూ మంత్రుల బృందం పరిశీలనలోకి తీసుకుంది. ఈ బృందానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వం వహిస్తారు.

04/15/2016 - 03:35

ముంబయి, ఏప్రిల్ 14: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సుమారు మూడు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల కుటుంబం గురువారం బౌద్ధమతాన్ని స్వీకరించింది. హిందూమతంలోని కుల వ్యవస్థ అణచివేత నుంచి విముక్తి కోసమే బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు రోహిత్ కుటుంబం ప్రకటించింది.

04/15/2016 - 03:34

వాషింగ్టన్, ఏప్రిల్ 14: వినూత్నమైన ఆలోచనల ద్వారా ప్రపంచ మానవాళికి మరింత మెరుగ్గా సేవ చేయడానికి తోడ్పడిన అమెరికాలోని ఇద్దరు భారతీయ బాల సైంటిస్టులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పొగడ్తలతో ముంచెత్తారు. కాలిఫోర్నియాకు చెందిన మాయా వర్మ, మేరీలాండ్‌కు చెందిన అనరుధ్ గణేశన్ వివిధ సైన్స్ పోటీల్లో విజేతలుగా నిలవడం ద్వారా ఈ ఏడాది జరిగే ఆరవ వైట్‌హౌస్ సైన్స్ ఫెయిర్‌కు అర్హత సాధించారు.

Pages