S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/15/2016 - 03:32

లక్నో, ఏప్రిల్ 14: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దళితులు, వెనకబడిన వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దళితుల పట్ల మొసలికన్నీరు కార్చడమే తప్ప వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన దాఖలాలే లేవని గురువారం ఇక్కడ ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గం బిజెపికే ఆయనేమీ చేయలేకపోయారని మాయావతి ఎద్దేవా చేశారు.

04/15/2016 - 03:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేస్తున్నా ఫలితాలు సాధించలేకపోతున్నారు, అవినీతిని అరికట్టలేకపోతున్నారు, మంత్రులను అదుపు చేయలేకపోతున్నారని సిఎంఎస్ సర్వే తేల్చింది. చంద్రబాబు రెండేళ్ల పాలనపై సిఎంఎస్ మార్చి నెలలో జరిపిన సర్వే ఫలితాలను సంస్థ అధినేత డాక్టర్ ఎన్.్భస్కర్‌రావు గురువారం విలేఖరుల సమావేశంలో విడుదల చేశారు.

04/15/2016 - 03:20

రాజేంద్రనగర్, ఏప్రిల్ 14: రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లిలోని శ్రీఅభయాంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని దేవాలయ పునఃప్రతిష్ఠాపన ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

04/15/2016 - 03:19

హైదరాబాద్, ఏప్రిల్ 14: మెహిదిపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రికి కొనసాగుతున్న నీటి సరఫరాను జలమండలి డైరెక్టర్ జి.రామేశ్వర్‌రావు గురువారం పరిశీలించారు. సరోజినీ ఆసుపత్రికి నీటి సరఫరా సరిగ్గా జరుగడం లేదని, లోప్రెషర్ నీటి సరఫరాతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆసుపత్రి వర్గాలు ఈనెల 5న జలమండలికి ఫిర్యాదు చేశారు.

04/15/2016 - 03:19

ఖైరతాబాద్, ప్రిల్ 14: దేవాలయాల్లోకి మహిళల ప్రవేశంపై దేశంలో విస్తృతస్థాయి చర్చ జరగాలని ఆచార్యులు విష్ణ్భుట్ల వెంకట లక్ష్మీనరసింహ నారాయణప్రసాద్ అభిప్రాయపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శింగనాపూర్ శనైశ్చర దేవాలయ గర్భగుడిలోకి మహిళలను అనుమతించడం తనను తీవ్ర కలతకు గురిచేసిందన్నారు.

04/15/2016 - 03:18

హైదరాబాద్, ఏప్రిల్ 14: లాల్ బహుదూర్ ప్లేగ్రౌండ్, అభినవ్ కోల్ట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లాల్‌బహుదూర్ పిజి జట్టు విజయం సాధించింది. లాల్ బహుదూర్ పిజి జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 132 పరుగులు సాధించి ఆలౌటయింది. రాహుల్ 32 పరుగులు సాధించగా, జైసింహ 30 పరుగులు నమోదు చేశాడు. కిరణ్ 53 పరుగులిచ్చి ఆరు వికెట్లు చేజిక్కించుకోగా, అషిర్ 46 పరుగులిచ్చి మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు.

04/15/2016 - 03:17

హైదరాబాద్, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ కర్త, అంటరానితనం, అస్పృశ్యతపై పోరాటం సాగించి యుగకర్తగా నిలిచిన అంబేద్కర్ 125వ జయంతికి ప్రధాన వేదికైన ట్యాంక్‌బండ్‌పై విచిత్రమైన పరిస్థితులు కన్పించాయి.

04/15/2016 - 03:16

నాచారం, ఏప్రిల్ 14: మహనీయుల త్యాగాలతోనే బడుగు బలహీన వర్గలకు రాజ్యాధికారం దక్కుతుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఉస్మానియా యూనివర్స్‌టీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో మహనీయుల జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా పిడమర్తి రవి హాజరై మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు రాజ్యాధికారం దిశగా యూనివర్సిటీ స్ధాయిలో చదువుతున్నామంటే కేవలం మహానీయుల త్యాగం ఫలితమేనని తెలిపారు.

04/15/2016 - 03:15

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత విశేషాలతో గురువారం ఆదర్శనగర్ సాయికళా మందిరంలో ‘బాబాసాహెబ్ అంబేద్కర్’ నృత్యరూపాకాన్ని ప్రదర్శించారు. శ్రీసత్య కళానికేతన్ ఆధ్వర్యంలో సంస్కృతి ఆర్ట్స్ సమర్పించిన కార్యక్రమం సమైఖ్యతను ప్రబోధిస్తూ ‘మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్య’ అనే గీతంతో ప్రారంభించారు.

04/15/2016 - 03:14

మేడ్చల్, ఏప్రిల్ 14: మేడ్చల్ మండలం రాజబొల్లారం పరిధిలోని బార్‌ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో సుమారు కోటి రుపాయలకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఎస్‌ఐ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం రాజబొల్లారం గ్రామ పరిధిలో గల బార్‌ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సిమ్ కార్డులు తయారవుతాయి. కాగా గురువారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.

Pages