S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/15/2016 - 03:13

కీసర, ఏప్రిల్ 14: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి చెందుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం రాంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎం.జ్యోతి సురేశ్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామసభలో దత్తాత్రేయ పాల్గొన్నారు.

04/15/2016 - 03:11

హైదరాబాద్, ఏప్రిల్ 14: నగరంలో ప్రతిరోజు పోగవుతున్న చెత్తను వీలైనంత త్వరగా డంపింగ్ యార్డుకు తరలించాలన్న ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఇంటింటి పంపిణీ చేసిన డస్ట్‌బిన్ల ద్వారా తడి, పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, దీంతో పాటు ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు తప్పక సమయానికి విధులకు హాజరుకావాలని, ఆలస్యంగా వచ్చే వారికి జరిమానాలు విధించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

04/15/2016 - 03:09

ఉప్పల్, ఏప్రిల్ 14: ఉప్పల్ కల్యాణపురిలో వీధి కుక్కలు విజృంభించాయి. ఒంటరిగా ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై దాడిచేసి బీభత్సం సృష్టించాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే..కల్యాణపురిలో నివసిస్తున్న భాస్కర్ భార్య తన కూతురు పల్లవి (3)ని పక్కన కూర్చుండ బెట్టుకుని ఆమె పని చేస్తుండగా బయట నుంచి వచ్చిన నాలుగు వీధి కుక్కలు అరుస్తూ చిన్నారిపై దాడిచేసాయి.

04/15/2016 - 03:08

హైదరాబాద్, ఏప్రిల్ 14: హుస్సేన్‌సాగర తీరం అంబేద్కర్ అమర్‌హై..! జై భీం నినాదాలతో మారుమోగింది. బాబాసాహెబ్ 125వ జయంతిని ఘనంగా జరిగింది. కులాలకతీతంగా అధికార, విపక్షాలంటూ తేడా లేకుండా వివిధ పార్టీల, కుల, విద్యార్థి, ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రముఖులు అంబేద్కర్‌కు నివాళులర్పించటంతో జయంతి ఘనంగా జరిగింది.

04/15/2016 - 03:07

సికింద్రాబాద్, ఏప్రిల్, 14: సికింద్రాబాద్ స్టేషన్‌లో బాంబు ఉందని అగంతకుని ఫోన్‌కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి సికింద్రాబాద్ స్టేషన్‌లో బాంబు ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగుల మీద స్టేషన్‌ను రైళ్లను అడగడుగునా తనిఖీ చేసి బెదిరింపుకాల్ అని తేల్చారు.

04/15/2016 - 02:23

ఒంటిమిట్ట, ఏప్రిల్ 14: మరో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామయ్య బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం వ్యాసాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు.

04/15/2016 - 02:20

భద్రాచలం, ఏప్రిల్ 14: లోక కళ్యాణకారకుడు జగదభిరాముని కల్యాణ గడియలతోభద్రాద్రి దేదీప్యమానంగా శోభిల్లుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం రంగుల దీపాలు, తాటాకు పందిళ్లతో కళకళలాడుతోంది. భద్రాద్రిలో గురువారం రాత్రి ఎదుర్కోలుతో సీతారాముల కల్యాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి. శుక్రవారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి మిథిలానగరాన్ని సకల హంగులతో తీర్చిదిద్దారు. తలంబ్రాలు, లడ్డూలను సిద్ధం చేశారు.

04/15/2016 - 02:17

హైదరాబాద్, ఏప్రిల్ 14: సువ్యవస్థలో ప్రజలు నడిపించేందుకు అనువైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణనందస్వామి పిలుపునిచ్చారు. అంబేద్కర్ అశయ సిద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు.

04/15/2016 - 02:14

హైదరాబాద్, ఏప్రిల్ 14: నేడు విడుదల కానున్న పోలీసోడు, మెంటల్ పోలీస్ సినిమా టైటిల్స్‌పై వివాదం చోటుచేసుకుంది. పోలీస్‌లను కించపరచే విధంగా టైటిల్స్ ఉన్నాయని, అలాగే కొన్ని సినిమాల్లోని పోలీస్ సన్నివేషాలు సైతం పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను అవమానపరిచేలా ఉన్నాయంటూ పోలీస్ అధికారుల సంఘం సినీ నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసింది.

04/15/2016 - 02:13

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: రాజకీయాల గురించి తాను మాట్లాడనని ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ తేజ అన్నారు. తనకంత వయసు, అనుభవం లేదని ఆయన పేర్కొన్నారు. అపోలో లైఫ్ ఆధ్వర్యంలో తయారుచేసిన జియో మొబైల్ అప్లికేషన్‌ను గురువారం రామ్ చరణ్ తేజ ఢిల్లీలో ఆవిష్కరించారు.

Pages