S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/15/2016 - 00:40

వాషింగ్టన్, ఏప్రిల్ 14: హెచ్ 1బి, ఎల్-1 వీసాల ఫీజులను గణనీయంగా పెంచడం వివక్షాపూరితమని, భారత ఐటి కంపెనీలను లక్ష్యంగా చేసుకునే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి, రాయబారి మైకేల్ ఫ్రోమన్‌తో జరిపిన చర్చల సందర్భంగా జైట్లీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

04/15/2016 - 01:09

విజయవాడ, ఏప్రిల్ 14: పేదల సొంతింటి కల నిజం చేసేలా నేటి అవసరాలకు అనుగుణమైన పక్కా గృహాల నిర్మాణంలో ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే గుర్తింపు పొందబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గరీబీ హఠావో నినాదం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తమ పదేళ్ల పాలన కాలంలో నిరుపేదల ఇళ్ల నిధులను సైతం దోచుకుందంటూ నిప్పులు చెరిగారు.

04/15/2016 - 01:10

విజయవాడ, ఏప్రిల్ 14: అంబేద్కర్ కేవలం ఒక్క కులానికో, మతానికో చెందినవాడు కాదని, యావత్ భారత జాతికి స్ఫూర్తి ప్రదాత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని ఎ కనె్వన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతి పితగా గాంధీని, రాజ్యాంగ పితగా అంబేద్కర్‌ను భారత ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

04/15/2016 - 01:16

హైదరాబాద్, ఏప్రిల్ 14: అధిక ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సీజన్‌లోనే ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లా మణుగూరులో నమోదైంది. గురువారం నాడు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మణుగూరు నిప్పుల గుండాన్ని తలపించింది. కాగా వచ్చే మూడు రోజులు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

04/15/2016 - 00:32

విజయవాడ, ఏప్రిల్ 14: ముంబయిలో జరుగుతున్న మారిటైం సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ నుంచి ముంబైలో జరుగుతున్న సదస్సుకు వెళ్లారు. కాకినాడ నుంచి పుదుచ్చేరికి నేషనల్ వాటర్‌వే అభివృద్ధి చేయడానికి ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

04/15/2016 - 00:30

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు వివాదం మరోమారు వివాదాస్పదం కాబోతోంది. రాష్ట్రంలో జెఎన్‌టియు గుర్తింపుపై ప్రైవేటు యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ, స్వయంగా జెఎన్‌టియులోనూ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ప్రైవేట్ కాలేజీలపై మాత్రం జెఎన్‌టియు కర్రపెత్తనం చేస్తోందని ఆరోపిస్తూ న్యాయవివాదానికి సైతం దిగాయి.

04/15/2016 - 00:31

టంగుటూరు, ఏప్రిల్ 14: పుణ్య క్షేత్రాల సందర్శన చేస్తున్న భక్త బృందం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద గురువారం జరిగింది.

04/15/2016 - 00:17

పటన్‌చెరు, ఏప్రిల్ 14: ఇటీవల జరిగిన గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలలో కారు దూకుడుకు బ్రేకులు వేసి, పటన్‌చెరు కార్పొరేటర్‌గా శంకర్‌యాదవ్ విజయం సాధించారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు వాకిట సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జరిగిన శంకర్‌యాదవ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఆమె ఆయనను శాలువా సత్కరించారు.

04/15/2016 - 00:16

జగదేవ్‌పూర్, ఏప్రిల్ 14: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సాయత్రం మెదక్ జిల్లాజగదేవ్‌పూర్ మండల పరిధిలోని ఎర్రవల్లిలో గల తన ఫాంహౌస్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సిఎం విశ్రాంతి కోసం రోడ్డు మార్గం ద్వారా ఫాంహౌస్‌కు చేరుకోగా పోలీసులు భారీ బందోబస్తును ఎర్పాటు చేశారు.

04/15/2016 - 00:15

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 14: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను గురువారం జిల్లాకేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు.
బిజెపి ఆధ్వర్యంలో

Pages