S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/29/2016 - 18:32

హైదరాబాద్: రాయలసీమ వాసులకు మంచినీళ్లిచ్చే పట్టిసీమ ప్రాజెక్టుపై విపక్షనేత జగన్ ఎందుకు అడ్డుపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని, ఆయన తీరు చూస్తుంటే ఈరోజు తనకు నిజంగా మతిపోతోందని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. ‘జగన్ వితండవాది అని ఎవరు చెప్పినా వినరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘నీళ్లు ఇస్తామంటే మీరు వద్దంటారా?

03/29/2016 - 18:32

దిల్లీ: బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియాల్లో పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి బయలుదేరి వెళుతున్నారు. ముందుగా ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ చేరుకుని అక్కడ జరిగే యూరోపియన్ యూనియన్ సమావేశంలో పాల్గొంటారు. ఈనెల 31న వాషింగ్టన్ చేరుకుని రెండు రోజుల అక్కడ జరిగే పలు సదస్సుల్లో పాల్గొంటారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటించి పలు ఒప్పందాలు చేసుకుంటారు.

03/29/2016 - 18:31

హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకున్న ‘బాహుబలి’ సినిమా తెలుగువాళ్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ప్రశంసించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కంచె’ అవార్డులను సాధించడం పట్ల అభినందనలు తెలుపుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభలో ఏకగ్రీవంగా ఆమోదించారు.

03/29/2016 - 18:31

చండీగఢ్: జాట్ కులస్థులకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు మంగళవారం హర్యానా అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు ఇదివరకే రాష్ట్ర మంత్రిమండలి సుముఖత తెలిపింది.

03/29/2016 - 18:30

అనంతపురం: పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు ఓ రైతు నుంచి మూడువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా బ్రహ్మసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటేశులును ఎసిబి అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నిందితుడిని ఎసిబి కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు.

03/29/2016 - 16:43

హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధానిగా అవతరించే అమరావతిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, 125 అడుగుల పొడవుండే ఈ విగ్రహం రాజధానికే వనె్న తెస్తుందని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో చెప్పారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్ జయంతి నాడు ఆరులక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.

03/29/2016 - 16:42

హైదరాబాద్: నీటి స్టోరేజీకి అవకాశం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలను వృథా చేసిందని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో విపక్షనేత జగన్ ఆరోపించారు. పట్టిసీమ ద్వారా నీళ్లు కిందకు వెళుతున్నాయంటే అందుకు వైఎస్ హయాంలో ప్రారంభించిన పోలవరం కుడికాలువే కారణమన్నారు.

03/29/2016 - 16:42

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తమను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కొందరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు వేసిన పిటిషన్‌పై క్యాట్ మంగళవారం తీర్పునిచ్చింది. మొత్తం 15 మంది అధికారులను తెలంగాణలోనే పనిచేయనీయాలని ఆదేశించింది. సోమేశ్‌కుమార్‌, అనంతరాము, శంషేర్‌, ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్‌, వాకాటి కరుణ, రంగనాధ్‌, అంజనికుమార్‌లు తెలంగాణలోనే పనిచేయాలని క్యాట్‌ తీర్పు ఇచ్చింది.

03/29/2016 - 16:40

హైదరాబాద్: అనుకున్న సమయం కంటే ముందుగానే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామని, ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలకు నష్టం కలుగుతుందన్న అపోహలు అర్థం లేనివని సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. పట్టిసీమపై వైకాపా తప్పుడు ప్రచారం చేసిందన్నారు. నదుల అనుసంధానాన్ని చేతల్లో చూపించిన ఘనత తమకే దక్కిందన్నారు.

03/29/2016 - 16:44

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్టప్రతి పాలనపై ఇక్కడి హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఈ నెల 31న అసెంబ్లీలో ఎమ్మెల్యేల విశ్వాసం నిరూపించుకోవాలని సిఎం హరీష్ రావత్‌ను కోర్టు ఆదేశించింది. తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా రాష్టప్రతి పాలన విధించిందని రావత్ హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలిక స్టే విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Pages