S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 02:11

కడప/మార్కాపురం, మార్చి 26: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ఇంగ్లీషు పేపర్ -1 ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంగ్లీషు పేపర్-1 పరీక్ష పత్రంలో 13వ ప్రశ్నకు సంబంధించిన పేరా ‘ది డియర్ డి పార్టెడ్-2’ అనే పాఠ్యాంశానికి చెందినదిగా బ్రాకెట్‌లో ఇచ్చారు. అయితే వాస్తవంగా ఆ పేరాలో ఇచ్చిన వాక్యం ‘స్టోర్డ్‌హౌస్’కు చెందినదిగా ఉపాధ్యాయులు గుర్తించారు.

03/27/2016 - 02:35

హైదరాబాద్, మార్చి 26: మహిళలు స్వశక్తితో పైకి ఎదిగినప్పుడే సాధికారత సాధించినట్లు అవుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్వర్యంలో జరిగిన సమావేశానికి దత్తాత్రేయ, బిజెపి నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

03/27/2016 - 02:08

తిరుమల, మార్చి 26: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల కొండంతా భక్తజనంతో నిండిపోయింది. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా కాలినడకన వచ్చే భక్తులకు 8గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి ఇ ఒ చిన్నంగారి రమణలు అధికారులతో కలసి క్యూలైన్లను పరిశీలించారు. ఈసందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు.

03/27/2016 - 02:08

న్యూఢిల్లీ, మార్చి 26: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సమావేశాలు ఆంధ్ర, తెలంగాణ భవన్‌లో రెండవరోజు ఘనంగా జరిగాయి. ఈ సమావేశాలలో భాగంగా ప్రముఖ నర్తకీమణి యామినీ కృష్ణమూర్తి, చిత్రకారులు రామారావు, ప్రముఖులు జయరామారావు, రాజా రాధారెడ్డి, విజయసాయి, మెండు చక్రపాణి తదితరులను సమాఖ్య ఘనంగా సన్మానించింది.

03/27/2016 - 02:07

అమలాపురం, మార్చి 26: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర, కేశవదాసుపాలెం గ్రామ పంచాయతీల్లో శనివారం మధ్యాహ్నం ఒఎన్‌జిసికి చెందిన రెండు పైపులైన్ల నుండి భారీ ఎత్తున గ్యాస్ లీకేజి అయ్యింది. అంతర్వేది కర సెయింట్ మేరీ స్కూలు సమీపంలో కెవి 32 బావికి సంబంధించిన పైపులైన్ లీకై పెద్దఎత్తున శబ్దం చేస్తూ గ్యాస్ పైకి వెదజల్లింది.

03/27/2016 - 01:57

ప్రస్తుత పరీక్షలు నూతన విధానంలో జరగాలి. అంటే పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు స్వేచ్ఛాపూరిత, స్నేహపూరిత వాతావరణంలో కొనసాగాలి. కాని ఇందుకు భిన్నంగా గతంలో లాగే పరీక్షల్ని నిర్వహించి విద్యార్థుల్ని భయాందోళనకు గురిచేయడం జరుగుతున్నది. దీన్ని గుర్తించడానకి, నియంత్రించడానికి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు, ఎలాగో పట్టింపు లేదు.

03/27/2016 - 01:59

సభలు సమావేశాలు రకరకాలు.
విద్యాసంస్థలు నిర్వహించే సభలు సైతం భిన్నగా ఉం టాయి. సదస్సులు, చర్చాగోష్ఠులు, రౌండ్ టేబుళ్ళు, ముఖాముఖులు వగైరాలు ఎనె్నన్నో.

03/27/2016 - 02:00

మూస కథలతో ఊపిరి ఆగిపోయే దశలో ఉన్న తెలుగు సినిమాకు ఊపిరి పోసిందట కదా ? ఊపిరి సినిమా’’
‘‘రాజకీయ తెరపై కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, ప్యామిలీ సెంటిమెంట్ కలగలిసిన సినిమాలు వరుసగా కనిపిస్తుంటే ’’
‘‘ నాకైతే రాజకీయాలు బోర్ అనిపిస్తున్నాయి. ’’
‘‘అంతరించి పోతున్న కమ్యూనిస్టులకు, బక్కి చిక్కి పోతున్న కాంగ్రెస్‌కు కన్నయ్య అనే కాలేజీ కుర్రాడు దొరికడం సినిమా కథలానే ఉంది.’’

03/27/2016 - 01:51

సాధారణంగా ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చే నేతలకు తమ ప్రాంతంలో రోడ్డు వేయించాలనో, విద్యుత్తు దీపాలు వేయించాలనో, పార్కు, లైబ్రరీ, కమ్యూనిటీ హాలు కావాలనో ప్రజలు కోరుతుంటారు. కాగా పశ్చిమ్ బంగాలోని సుందర్బన్ ప్రాంతానికి చెందిన ఓటర్లు మాత్రం ‘ఎలుకలను పట్టగలరా?, కొట్టగలరా?’ అని ప్రశ్నిస్తున్నారు. సుందర్బన్‌లో ప్రజల కంటే ఎలుకల సంఖ్యే ఎక్కువ ఉందట. పంటలను, ఇంట్లో వస్తువులను తినేస్తున్నాయి.

03/27/2016 - 01:42

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్ధుల సంఘర్షణ నేపథ్యంలో వైస్ ఛాన్సలర్‌ను రీ కాల్ చేయాల్సిందిగా కోరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శాసనసభలో చెప్పడంతో మరోమారు విసిల తొలగింపు అంశం తెరమీదకు వచ్చింది.

Pages