S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/18/2016 - 07:11

హైదరాబాద్, జనవరి 17: నీటిపారుదల ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గోదావరి నదిలో తెలంగాణకున్న వాటామేరకు నీటిని సమర్ధంగా, సంపూర్ణంగా వాడుకోవడానికి అనుగుణంగానే ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేశామన్నారు.

01/18/2016 - 06:25

హైదరాబాద్, జనవరి 17: జిహెచ్‌ఎంసి ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. అయినా కొన్ని పార్టీల అభ్యర్థులు పూర్తిగా తేలలేదు. ఈనెల 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా ‘బి-్ఫరం’ అందుకున్నవాళ్లే తుది అభ్యర్థులు అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి 150 డివిజన్లకు సుమారు 3 వేల నామినేషన్లు దాఖలయ్యాయి.

01/18/2016 - 06:23

కూచిపూడి, జనవరి 17: కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల మందు వికటించి మూడు రోజుల పసికందు మృతి చెందింది. పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం అయ్యంకి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రం ద్వారా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తమ బాబుకు పోలియో చుక్కలు వేసినట్లు పసికందు తల్లిదండ్రులు తెలిపారు. ఈ నెల 15న బండ్రెడ్డి కుమారి మొవ్వ పిహెచ్‌సిలో కుమారుడికి జన్మనిచ్చింది.

01/18/2016 - 06:20

తిరుపతి, జనవరి 17: రేణిగుంట విమానాశ్రయం మేనేజర్ రాజశేఖర్‌పై జరిగిన దాడి కేసులో 19మంది నిందితుల్లో ఒకరైన కడప జిల్లా రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డిని, మరో నిందితుడు బియ్యపు మధుసూధన్‌రెడ్డిని శనివారం అర్థరాత్రి చెన్నైలోని విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆదివారం రేణిగుంట మండలంలోని గాజులమండ్యం పోలీస్టేషన్‌కు తరలించారు.

01/18/2016 - 06:18

హైదరాబాద్, జనవరి 17 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రతిపాదించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సిఎం చంద్రబాబు సూచనల మేరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్ తదితరులతో సమీక్షిస్తున్నారు. అన్నీ సవ్యంగా కొనసాగితే ఫిబ్రవరి రెండోవారం లేదా మూడోవారంలో అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌ను సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

01/18/2016 - 06:43

హైదరాబాద్, జనవరి 17: బిజెపి సీనియర్ నాయకుడు, సిక్కిం మాజీ గవర్నర్ వి. రామారావు ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడున్నారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్న రామారావు స్థానిక అపొలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1935 సంవత్సరం డిసెంబర్ 11న కృష్ణా జిల్లా మచిలిపట్నంలో జన్మించిన రామారావు బిఎ, ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు.

01/18/2016 - 06:45

విజయవాడ, జనవరి 17: రాష్ట్రంలో కరవుకు పాతరేసేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఎన్ని కష్టాలెదురైనా, ఆర్ధిక పరిస్థితి సహకరించకున్నా భగీరథ ప్రయత్నాన్ని ఆపేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రను కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే తన ముందున్న లక్ష్యమన్నారు.

01/18/2016 - 06:11

న్యూఢిల్లీ, జనవరి 17: రోడ్లపై పొగలు చిమ్ముతూ ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా మారడమేకాకుండా, కాలుష్యానికి, ప్రమాదాలకు కారణమవుతున్న కాలం చెల్లిన వాహనాలకు ఇక చెల్లు చీటీ తప్పదేమో! కాలుష్య కారకాలయ్యే కాలం చెల్లిన వాహనాలకు చెల్లు చీటీ పలికే ఒక పథకాన్ని వచ్చే బడ్జెట్‌లో ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

01/18/2016 - 04:57

మిత్రుడా...
నాకింకా ఈ మనుషుల మీద
బంధాల మీద
నమ్మకం సడలలేదు
నన్నిక్కడే వుండనివ్వు

ఈ పల్లెల మీద, పిలుపుల మీద,
వరుసల మీద
నాకింకా మమకారం తీరలేదు
నన్నిలా వదిలిపెట్టు -

ఇక్కడి చల్లగాలి లేత స్పర్శలో
ఏదో తెలియని
ఆత్మీయత పొడమి వుంది
తనివితీరా గ్రోలనివ్వు -

01/18/2016 - 04:55

అనుకోకుండానే కొన్ని
ఆఖరు క్షణాల్లో చిక్కిపోతుంటాం

మనసుకూ జీవితానికి మధ్యన
తెగని దారం ఒకటి
రెండు చివర్లను కలుపుతుంది

తెగకుండా దగ్గరవకుండా
నిర్ణయానికి భవిష్యత్తుకు పొంతనా ఉండదు
అడుగు వెనకేస్తే ముందు ఆగిపోతుంది
ఒక్క క్షణమే కాలానికీ గమనానికీ ముడివేసేది

Pages