S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2016 - 07:45

దుబాయ్, జనవరి 14: నలభై మంది జిహాదీలను ఉరితీసిన సౌదీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని ఆల్‌ఖైదా చీఫ్ అల్ జవహారీ పిలపునిచ్చాడు. పవిత్ర యుద్ధం చేస్తున్న వారిపై కత్తిగట్టిన వారిపై దాడులు చేయాలని కేడర్‌కు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఆన్‌లైన్లో జవహారీ ఓ ప్రకటన చేస్తూ సౌదీలో అధికార రాచరిక పాలనపై దుమ్మెత్తిపోశారు. సౌదీ అరేబియా ప్రభుత్వం జనవరి 2న 47 మందిని ఉరితీసింది.

01/15/2016 - 07:45

వాషింగ్టన్, జనవరి 14: భారత్‌లో ఆధార్ కార్డులను ప్రవేశపెట్టడాన్ని, వాటివల్ల వస్తున్న సత్ఫలితాలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ఆధార్ కార్డులను ప్రవేశపెట్టడం వల్ల దేశంలో అవినీతి తగ్గిందని, ఫలితంగా భారత ప్రభుత్వానికి ఏటా సుమారు ఒక బిలియన్ డాలర్లు (రూ.650 కోట్లు) ఆదా అవుతోందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

01/15/2016 - 07:33

ప్రత్తిపాడు, జనవరి 14: నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని, రోడ్లు సరిగాలేవని, ప్రజలకు తాగడానికి నీరు లేదని నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. ప్రత్తిపాడు మండలంలోని పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ఎంపి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

01/15/2016 - 07:33

హైదరాబాద్, జనవరి 14: తెలంగాణకు గానీ, హైదరాబాద్‌కు గానీ ప్రధాని మోదీ ఒరగబెట్టింది ఏమిలేదనీ, అలాంటప్పుడు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఆ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావుప్రశ్నించారు. తెలంగాణ సంగతి అటుంచి కనీసం హైదరాబాద్ నగరానికి మోదీ ఏం చేశారో చెప్పాలని బిజెపి నేతలను మంత్రి నిలదీశారు.

01/15/2016 - 07:32

హైదరాబాద్, జనవరి 14: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 150 డివిజన్లు..7757 పోలింగ్ కేంద్రాలు..74 లక్షల పై చిలుకు ఓటర్లు. వీటిలో మన ఓటు ఎక్కడుందో, ఇపుడు వెతుక్కుని ఓటు వేయాలా? అన్న బెంగ అవసరం లేదు. ఎవరి ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో, పోలింగ్ బూత్ నెంబరు, ప్రాంతంతో పాటు పూర్తి ఓటరు వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకునేందుకు వీలుగా మహానగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక యాప్‌కు రూపకల్పన చేశారు.

01/15/2016 - 07:31

అలహాబాద్, జనవరి 14: హిందువులకు ఎంతో పవిత్రమైన మకరసంక్రాంతి సందర్భంగా గురువారం అలహాబాద్‌లోని త్రివేణి సంగమంలో వేలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. నెల రోజుల పాటు జరిగే మాఘమేళా మకరసంక్రాంతినుంచే ప్రారంభమవుతుంది. గట్టి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షల కారణంగా భక్తులు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా మైళ్ల దూరం నడిచి తెల్లవారుజామునుంచే త్రివేణి సంగమానికి చేరుకున్నారు.

01/15/2016 - 07:31

న్యూఢిల్లీ, జనవరి 14: రాజకుటుంబాలు, వాటికి చెందిన నేతల పట్ల ప్రత్యేక విధేయతలకు స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిన్న స్థాయిలో ఉన్నా నిరుపమాన పట్టుదల, అంకిత భావంతో ఎన్నో విజయాలు నమోదు చేసుకున్న వారిపై దృష్టి పెట్టాలన్నారు.

01/15/2016 - 07:30

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడిచేసిన జైషే మహ్మద్ అధినేత వౌలానా మసూద్ ఆజర్‌తోపాటు పలువురు ఇతర ఉగ్రవాదులను అరెస్టు చేశామని భారత ప్రభుత్వానికి వర్తమానం పంపించిన పాకిస్తాన్ పాలకుల అసలు రంగు బయటపడింది. జైషే మహ్మద్ నేతల అరెస్టు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖాజీ ఖలీల్లాహ గురువారం ఇస్లామాబాద్‌లో ప్రకటించారు.

01/15/2016 - 07:29

హైదరాబాద్, జనవరి 14: మినీ కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్ధుల ఖరారులో టిడిపి-బిజెపి కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదరక తంటాలు పడుతోంది. ఇక వైకాపా బరిలోకి దిగకముందే తప్పుకుంది. ఆంధ్ర పార్టీగా ముద్రపడిన టిడిపి శ్రేణుల్లో కదనోత్సాహం కరవైతే, వైకాపా శ్రేణులు పార్టీ ప్రకటనతో నిరాశలో పడిపోయాయి.

01/15/2016 - 07:28

న్యూఢిల్లీ, జనవరి 14: దేశంలో కాలేయ వ్యాధులు పెరిగిపోతుండడం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేయడమే కాక, ఈ వ్యాథుల పట్ల ప్రజల్లో అవగాహన లేక పోవడం, అలాగే ఈ వ్యాధులను నయం చేసేందుకు తగిన చికిత్సలు లేక పోవడం కూడా ఆందోళన కలిగిస్తోందన్నారు.

Pages