S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2016 - 07:58

మన దేశంలో శాస్తవ్రేత్తలకు కొదవ లేదు. ఎంతో ఉన్నతమైన పరిశోధనలు వీరు చేస్తున్నారు. అయితే సమస్య ఎక్కడ వస్తున్నదంటే, శాస్తవ్రేత్తలు చేస్తున్న పరిశోధనా ఫలితాలు కేవలం సైన్స్ పత్రికలలో ప్రచురణలకే పరిమితం అవుతున్నాయి. అవి ప్రజలకు చేరడం లేదు. పాలకులు కూడ వివిధ రంగాలలో పరిశోధకులకు తగిన ప్రోత్సా హం ఇవ్వడం లేదు. అందువలన, ఎక్కువ మంది పరిశోధనల వైపుకు వెళ్ళడం లేదు.

01/15/2016 - 07:57

అవినీతిపై సమరభేరి మోగించిన అన్నాహజారే వొకప్పటి అనుచరుడు, ఆమ్‌ఆద్మీ పార్టీ పేరున గత ఫిబ్రవరి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఢిల్లీ పీఠం మీద కూర్చున్న అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తమ సహజలక్షణమైన ‘అరాచకవాదం’ బయటపెట్టుకున్నారు. ప్రధాని మోదీని సైతం పిరికిపంద అని మానసిక రోగి అని తులనాడారు. ముఖ్యమంత్రి అయినా ఆయన నోటిదురుసుతగ్గలేదు.

01/15/2016 - 07:57

మన పంజాబ్‌లోని పఠాన్‌కోట వైమానిక దళం స్థావరంపై తాను జరిపించిన దాడి గురించి పాకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందట! ఇలా దర్యాప్తు జరపడానికి వీలుగా పాకిస్తానీ ప్రత్యేక పరిశోధక బృందం వారు మన దేశానికి వస్తారట! ఇలా రావడాన్ని మన ప్రభుత్వం స్వాగతించడం మతిమాలిన మన విదేశాంగ విధాన వైపరీత్యానికి మరో నిదర్శనం! పఠాన్‌కోటపై జిహాదీలు దాడి చేసిన తరువాత ఉభయ దేశాల మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతునే ఉన్నాయి!

01/15/2016 - 07:50

జకార్తా, జనవరి 14: ఇండోనేసియా రాజధాని జకార్తా గురువారం పేలుళ్లు, తుపాకీ కాల్పుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది.

01/15/2016 - 07:49

తిరువనంతపురం, జనవరి 14: జాతీయ స్థాయిలో జ్ఞాన్ పేరిట చేపట్టిన జాతీయ నెట్‌వర్క్ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులకు కేంద్ర జనశక్తి వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం వల్ల అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన విద్యావేత్తలు భారత విద్యాసంస్థల్లో పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

01/15/2016 - 07:48

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అంతకుముందు కిడ్నాప్ చేసి, వదలిపెట్టిన పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి) స్థాయి అధికారి సల్వీందర్ సింగ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు వరుసగా నాలుగో రోజు గురువారం విచారించారు.

01/15/2016 - 07:48

న్యూఢిల్లీ, జనవరి 14: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం చేపట్టిన బేసి-సరి విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంత అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా పిటిషనర్‌ను న్యాయస్థానం తీవ్రంగా మందలించింది.

01/15/2016 - 07:47

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి దారితీసిన కారణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లోపాలను కూపీ లాగేందుకు విస్తృత దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఓ దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది.

01/15/2016 - 07:46

న్యూఢిల్లీ, జనవరి 14: అవినీతి నిర్మూలన కోసం ప్రతిపాదించిన లోక్‌పాల్ చైర్‌పర్సన్ పదవికి అనేక మంది ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికోసం 16 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, ఒక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఒక యూజీసీ సభ్యుడు, సమాచార కమిషనర్లు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

01/15/2016 - 07:46

న్యూఢిల్లీ, జనవరి 14: అరుణాచల్ ప్రదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి సంబంధించి గౌహతి హైకోర్టు జారీ చేసిన కొన్ని ఉత్తర్వులపై దాఖలయిన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. గవర్నర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హక్కులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని జస్టిస్ జెఎస్ ఖేహర్, జస్టిస్ సి నాగప్పన్‌లతో కూడిన బెంచ్ తెలిపింది.

Pages