S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/21/2015 - 07:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశంలో దాదాపు నిరుపయోగంగా పడి ఉన్న దాదాపు లక్ష కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని నగదు రూపంలోకి తీసుకు రావాలని ప్రభుత్వం కోరుకుంటుండడంతో ఇప్పుడు అందరి దృష్టీ బంగారం నిల్వలు పెద్ద ఎత్తున ఉన్న దేశంలోని ప్రముఖ ఆలయాలపైనే ఉంది. అయితే భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన బంగారు నగలను కరిగించినట్లయితే వారి మనోభావాలు దెబ్బతింటాయేమోనని చాలా దేవాలయాలు భయపడుతున్నాయి.

12/21/2015 - 07:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలను తీవ్రంగా నిరశిస్తూ ఢిల్లీ వీధులు ప్రదర్శనలతో అట్టుడికాయి. ఆదివారం ఇండియా గేట్ వద్ద ప్రదర్శనకు వందలాది మంది ఈ తాజా పరిణామంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్భయ తల్లిదండ్రులతో సహా అనేక మందిని ఇండియా గేట్ వద్ద పోలీసులు నిరోధించారు.

12/21/2015 - 07:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: మరో మూడు రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నందున ఈలోగానే పెండింగ్‌లో వున్న బిల్లులన్నింటినీ గణనీయ పరిమాణంలో ఆమోదింపజేసుకోవాలని కేం ద్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటులో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో పెండింగ్ బిల్లుల వ్యవహారాన్ని దాదాపుగా ఒక కొలిక్కి తేవాలని ఆశిస్తోంది.

12/21/2015 - 07:22

రాణ్ ఆఫ్ కచ్, డిసెంబర్ 20: ఐసిస్, ఇతర ఉగ్రవాద ముఠాలు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ప్రయత్నించడంపై ఫ్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో సున్నితత్వం పోలీసింగ్‌లో కీలక అంశం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

12/21/2015 - 07:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కేంద్రం లో మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల కొరత ఉం ది. అందువల్ల ఈ వర్గాలకు చెందిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని రాష్ట్రాలను కోరింది.

12/21/2015 - 07:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నుంచి రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగే చర్చల్లో అణు ఇంధన సహకారం సహా అనేక కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా కుళంకుళంకు సంబంధించి రెండు దేశాలు ఓ ఒడంబడికపై సంతకం చేయవచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

12/21/2015 - 07:20

అయోధ్య/న్యూఢిల్లీ, డిసెంబర్ 20: అయోధ్య వ్యవహారం ఇటు రాజకీయ, అటు న్యాయపరమైన అంశాల్లో చిక్కుకుపోవడంతో ఈ జటిల సమస్యను పరిష్కరించేందుకు ఓ మాజీ న్యాయవాది ముందుకొస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా శాంతియుతంగా ఈ సంక్లిష్ట సమస్యను ఓ కొలిక్కి తెస్తానని పలోప్ బసు అనే ఈ మాజీ న్యాయవాది చెబుతున్నారు.

12/21/2015 - 07:12

హైదరాబాద్, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఈనెల 23న నుంచి జరిగే అయుత చండీయాగం మతాలకు అతీతంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరో మూడు రోజుల తరువాత యాగం ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటి నుంచే జనం యాగం జరిగే ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఆదివారం కొంత మంది నన్స్ యాగశాలకు వచ్చారు. గజ్వేల్ చర్చికి చెందినవారు యాగశాల వద్ద ఏర్పాట్లు చూసి వివరాలు తెలుసుకొని వెళ్లారు.

12/21/2015 - 07:12

నల్లగొండ, డిసెంబర్ 20: టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి విపక్షాల ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరుతున్నారంటున్న మంత్రి జి.జగదీష్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఎందుకు ప్రలోభ పెడుతున్నారని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

12/21/2015 - 07:11

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 20: శాసనమండలికి ఈనెల 27న జరిగే ఎన్నికలను ఓటర్లయిన టిడిపి ప్రజాప్రతినిధులు బహిష్కరించనైనా బహిష్కరించాలని, లేకుంటే ఆత్మప్రభోధంపై ఓటైనా వేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు కోరారు.

Pages