S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/19/2015 - 06:43

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించిన వేతనాల అమలుకు జీవో జారీచేయాలంటూ ‘చలో విజయవాడ’ పేరిట రాష్టవ్య్రాప్తంగా తరలివచ్చిన వేలాదిమంది అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు ఎర్ర జెండాలు చేతబట్టి కదంతొక్కారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రదర్శనగా బయల్దేరిన కార్యకర్తలను తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ప్రారంభంలోనే నిలుపుదల చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

12/19/2015 - 06:41

హైదరాబాద్, డిసెంబర్ 18: కాల్ మనీ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో గందరగోళం, దుమారం చెలరేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుయ్యబట్టగా, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదురు దాడి చేశారు. టిడిపి-వైకాపా ఎమ్మెల్యేలు పరస్పరం విమర్శించుకున్నారు.

12/19/2015 - 06:39

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్ర రాష్ట్రంలో తొమ్మిది మంది పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రాష్ట్రంలో పొగాకు రైతుల ఆత్మహత్యల నిరోధానికి చర్యలు తీసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుశాసనసభకు తెలిపారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో లిఖితపూర్వకసమాధానం ఇచ్చారు.

12/19/2015 - 06:39

శ్రీకాళహస్తి/ఆత్మకూరు, డిసెంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కాల్ మనీ వ్యవహారం చిత్తూరు శ్రీకాళహస్తిలోనూ వెలుగుచూసింది. శ్రీ కాళహస్తి పట్టణంలో ఒక మహిళా వడ్డీ వ్యాపారి రుణం తీసుకొన్న వారిని వేధిస్తోందని ఫిర్యాదు రావడంతో పోలీసులు శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

12/19/2015 - 06:32

* టిఎన్జీవో గౌరవ అధ్యక్షుడు దేవిప్రసాద్

12/19/2015 - 06:31

హైదరాబాద్, డిసెంబర్ 18: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉద్దేశపూర్వకంగా ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్టు వచ్చిన అభియాగాల్లో వాస్తవం లేదని ఎన్నికల కమిషన్ హైక్టోరుకు తెలియజేసింది.

12/19/2015 - 06:31

* పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి

12/19/2015 - 06:30

హైదరాబాద్, డిసెంబర్ 18: మిషన్ భగీరథ పనులకు అవసరం అయిన భూమిని ప్రజలు సంతోషంగా ఇస్తున్నారని, భూ సేకరణలో ఎక్కడా ఇబ్బందులు ఎదురు కావడం లేదని, తాగునీటి కొరతను తీర్చే ఈ పథకానికి ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారని పంచాయితీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులపై ఎస్‌పి సింగ్ శుక్రవారం సమీక్షించారు.

12/19/2015 - 06:30

అభివృద్ధి దిశగా కొమురవెల్లిని ముందుకు తీసుకెళ్దాం * డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి

12/19/2015 - 06:30

* ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

Pages