S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/05/2019 - 04:21

కులకచర్ల, జూలై 4: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన కులకచర్ల మండలం రాంపురంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల నారాయణ పొలం పనులు చేస్తుండగా తెగిపడిన విద్యుత్ తీగ పైపులైన్‌కు తగిలిన విషయం గమనించకుండా పైపును పట్టుకోవడంతో ఈ రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఎర్త్ కాకపోవడంతో షాక్‌కు గురైనాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

07/05/2019 - 04:21

జీడిమెట్ల, జూలై 4: ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ కార్మికుడు మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రానికి చెందిన బృందావన్ బోరడ్ (60) సూరారం గ్రామం, విశ్వకర్మ కాలనీలో భార్య శకుంతల, కూతురితో కలిసి నివసిస్తున్నాడు. జీడిమెట్లలోని సూపర్ ఫ్లో ప్రైవేటు పరిశ్రమలో సంపు నిర్మాణ పనుల్లో బృందావన్ బోరడ్ పనిచేస్తున్నాడు.

07/05/2019 - 04:20

షాబాద్, జూలై 4:యువతి అదృశ్యంమైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. షాబాద్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల శిరీష (18) బుధవారం సాయంత్రం తన తండ్రితో శ్రీశైలంతో పాటు షాబాద్‌కు వచ్చింది. మీసేవాలో ఆధార్‌కార్డు తప్పుగా ఉంది సరి చేసుకుంటాన్నని చెప్పి వెళ్లింది. రాత్రి అయిన తిరిగి రాలేదు.

07/05/2019 - 01:57

నార్కట్‌పల్లి, జూలై 4: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి నుండి పది లక్షల నగదు చోరీకి గురైన సంఘటన గురువారం ఉదయం హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారి వద్ద గల నార్కట్‌పల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుండి హైద్రాబాద్‌కు బయలుదేరిన నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ సెమీ లగ్జరీ బస్సు ఉదయం 8గంటల సమయంలో నార్కట్‌పల్లి సమీపంలోని పూజిత హోటల్ వద్ద టిఫిన్ కోసం బస్సు ఆగింది.

07/05/2019 - 01:49

న్యూఢిల్లీ, జూలై 4: ఎంపిక ప్రక్రియలో గరిష్ఠ వయోపరిమితి సడలింపు పొందిన రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థి తరువాత జనరల్ కేటగిరిలో ఉద్యోగాన్ని పొందజాలడని సుప్రీంకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్.అబ్దుల్ నజీర్, ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం గుజరాత్ హైకోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

07/05/2019 - 01:25

ముంబయి, జూలై 4: పరువునష్టం కేసుపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారంనాడు ముంబయిలోని మజ్‌గాన్ సెవ్రీ మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరయ్యారు. తాము దోషులుగా తేలనందున ఈ కేసును ఎదుర్కొంటామని వారు కోర్టుకు స్పష్టం చేశారు. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లకేష్ బెంగళూరులోని తన ఇంటి ముందు హత్యకు గురికావడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది.

07/05/2019 - 01:18

న్యూఢిల్లీ, జూలై 4: దేశవ్యాప్తంగా తాజాగా అంచనాలు వేయకుండా 358 గనులలో నుంచి ఇనుప ఖనిజం తవ్వకాల కోసం వివిధ సంస్థలకు ఇచ్చిన లీజు కేటాయింపులు, పొడిగింపులు, కొనసాగింపులను రద్దు చేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై నాలుగు వారాలలోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

07/05/2019 - 01:06

హైదరాబాద్: మై హోం గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుకు చెందిన కార్యాలయాలు, నివాసంపై గురువారం ఆదాయపన్ను శాఖ సోదలు నిర్వహించింది. ఉదయం 7 గంట నుంచి కొనసాగుతున్న సోదలు చాలా రాత్రి చాలా పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగళూరు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఐటీ అధికారులతో పాటు హైదరాబాద్‌కు చెందిన అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు.

07/04/2019 - 23:07

జోధ్‌పూర్, జూలై 4: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్ జిల్లా కోర్టు ఝలక్ ఇచ్చింది. కృష్ణ జింకల వేట కేసులో ఇప్పటికే బెయిల్‌పై ఉన్న సల్మాన్‌ఖాన్ గురువారం కోర్టుకు హాజరు కావల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో ఆయన జిల్లా, సెషన్స్ కోర్టుకు హాజరు కాలేదు. దీనిని జడ్జి చంద్రకుమార్ సొంగర తీవ్రంగా పరిగణించారు. ‘ఈసారికి వదిలేస్తున్నాం..

07/04/2019 - 06:09

విజయవాడ, జూలై 3: కాంట్రాక్ట్ క్యారేజీ పేరిట పర్మిట్లు తీసుకుని, ఆర్టీసీ బస్సుల తరహాలో అడుగడుగునా ఆగుతూ అక్రమంగా ప్రయాణికులను ఎక్కించుకుంటూ స్వైర విహారం చేస్తున్న ప్రైవేట్ బస్సులపై ఉక్కుపాదం మోపటానికి రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ పీ సీతారామాంజనేయులు నిర్ణయించారు. దీనిలో భాగంగా తొలిసారి మంగళవారం అర్ధరాత్రి వేళ విజయవాడ, విశాఖ, అనంతపురం తదితర ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు.

Pages