S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/09/2019 - 23:24

యాదగిరిగుట్ట రూరల్, మే 9:యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ పాత లక్ష్మీనారసింహ స్వామి వారి దేవాలయం సమీపంలో దర్శనానంతరం రాచ కొండ పోలీసు ఇన్నోవా వాహనం అదుపు తప్పి నిద్రిస్తున్న చిన్నారి ప్రణతి (3)పై నుండి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరీస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

05/09/2019 - 23:23

ఎల్లారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మే 9: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఈనెల 7వ తేదీ మంగళవారం అపహరణకు, గురైన చిన్నారి, గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం శివ్వానగర్‌లో లభించింది. మూడు రోజులుగా ఆందోళనకు గురైన తల్లితండ్రులు, పాప ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులకు చిన్నారి లభ్యం కావడం పట్ల ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారి అపహరణ వివరాలు ఇలా ఉన్నాయి.

05/10/2019 - 02:42

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించేలా కేంద్ర, ఈసీని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పౌరసత్వంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ దానిపై స్పష్టత వచ్చేవరకూ ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించాలంటూ బరుణ్ కుమార్ సిన్హా అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

05/09/2019 - 23:03

న్యూఢిల్లీ, మే 9: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా అనిరుద్ధ బోస్, ఏఎస్ బొప్పన్నల నియామకంపై ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. వీరికి సుప్రీం న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలన్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. ఈ న్యాయమూర్తుల సామర్థ్యం, ప్రవర్తన, నిజాయితీల విషయంలో ఎలాంటి సందేహాలు కనిపించలేదని స్పష్టం చేసింది.

05/09/2019 - 04:27

హైదరాబాద్, మే 8: వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద ఏటీఎం డబ్బులు ఎత్తికెళ్లింది చెన్నై రాంజీ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో రూ.58.97 లక్షల నగదును ఉంచడానికి వెళ్ళిన సిబ్బందిని దృష్టి మళ్లించి నగదుతో పరారైన దొంగల ముఠా ఆచూకీ తెలిసింది.

05/09/2019 - 03:34

హైదరాబాద్, మే 8: ఏడాది కాలంలో శంషాబాద్ అంతర్జాతీయ విమాశ్రయంలో వివిధ దేశాలకు వచ్చివెళ్లే ప్రయాణికుల నుంచి 24 కోట్ల రూపాయిల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొన్నట్లు హైదరాబాద్ కస్టమ్ శాఖ కమిషనర్ ఎంఆర్‌ఆర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఎయిర్‌పోర్టులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ విదేశాలకు చెందిన 30 మంది స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు.

05/09/2019 - 02:05

న్యూఢిల్లీ, మే 8: అస్సాంలో జాతీయ పౌర రిజస్టర్(ఎన్‌ఆర్‌సీ) గడువును పొడిగించే ప్రసక్తిలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్‌ఆర్‌సీకి జూలై 31 తుది గడువుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తి ఆర్‌ఎఫ్ నారిమన్ బుధవారం ఈ మేరకు తేల్చిచెప్పారు.

05/09/2019 - 02:04

న్యూఢిల్లీ, మే 8: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి బీఎస్‌ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణపై సుప్రీం కోర్టు స్పందించింది. తేజ్‌బహదూర్ యాదవ్ పిటిషన్‌ను బుధవారం విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం ఈసీని వివరణ కోరింది. గురువారం దీనిపై సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం తరఫున్యాయవాదిని బెంచ్ ఆదేశించింది.

05/09/2019 - 02:02

న్యూఢిల్లీ, మే 8: ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రసంగాలపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేశారు. మోదీ, అమిత్‌షా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని, వారిపై చర్టలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మిత దేవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు.

05/09/2019 - 02:00

ముంబయ, మే 8: మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియాకు బెయిల్ మంజూరు చేసేందుకు ముంబై హైకోర్టు బుధవారం నిరాకరించింది. పెంపుడు కుమార్తె ఈనా బోరా హత్యోదంతంలో ప్రమేయంపై 2015 నుంచి ముఖర్జియా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో బైపాస్ సర్జరీ జరిగిన నేపథ్యంలో ఆపరేషన్ అనంతర చికిత్సల నిమిత్తం తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ముఖర్జియా హైకోర్టులో పిటిషన్ వేశారు.

Pages