S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/12/2019 - 00:17

మహబూబాబాద్, జనవరి 11: మావోయిస్టు పార్టీ కొరియర్‌గా పనిచేస్తున్న బత్తుల ప్రకాష్ అలియాస్ ప్రదీప్‌ను శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి పిస్టల్, ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన బత్తుల ప్రకాష్‌ను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి విలేఖరుల ఎదుట హాజరుపరిచారు. ప్రకాష్ అరెస్ట్ వివరాలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి విలేఖరులకు తెలిపారు.

01/11/2019 - 23:37

న్యూఢిల్లీ, జనవరి 11: కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కుటుంబానికి కోర్టు చిక్కులు తప్పడం లేదు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఫిబ్రవరి 1 వరకూ అరెస్టు చేయవద్దంటూ శుక్రవారం ఢిల్లీ కోర్టు ఆదేశించగా, శారదా చిట్స్ కుంభకోణం కేసులో ఆయన సతీమణి నళినీ చిదంబరంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నిందితునిగా ఉన్నారు.

01/11/2019 - 23:36

న్యూఢిల్లీ, జనవరి 11: సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరిస్తూ, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోరాదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. అతనిపై సీబీఐ కేసు విచారణను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది.

01/11/2019 - 23:35

పంచ్‌కుల, జనవరి 11: జర్నలిస్టు హత్యకేసులో డేరాబాబా(51) దోషి అని సీబీఐ కోర్టు శుక్రవారం నిర్ధారించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరోముగ్గురు సైతం దోషులేనని పేర్కొంది. అయితే వీరికి ఎంతకాలం శిక్ష వేసేది ఈనెల 17న ప్రకటిస్తామని కేసును విచారించిన సీబీఐ జడ్జి జగదీప్ సింగ్ ప్రకటించారు.

01/11/2019 - 23:34

న్యూఢిల్లీ, జనవరి 11: మేఘాలయలో గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులను రక్షించేందుకు భారత నౌకాదళం రిమోట్ ద్వారా పనిచేసే ఐదు వాహనాలను వినియోగిస్తోందని ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గత నెల 13వ తేదీన రాష్ట్రంలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో నదీతీరంలోని గనిలో ఈ ప్రమాదం సంభవించింది. ఇంతవరకు ఒక కోటి లీటర్ల నీటిని బయటకు తోడారని ధర్మాసనానికి రాష్ట్రప్రభుత్వం తెలిపింది.

01/11/2019 - 22:23

ఒంగోలు, జనవరి 11: మార్కాపురం డివిజన్ పరిధిలోని త్రిపురాంతకంలో నకిలీ ఎరువులను రైతులకు విక్రయస్తున్న పలు ఎరువుల షాపులను శుక్రవారం జిల్లాకు చెందిన విజిలెన్స్ అధికారులు, త్రిపురాంతకం పోలీసులు తనిఖీలు నిర్వహించి సుమారు 20 లక్షల రూపాయలు విలుచేసే నకిలీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

01/11/2019 - 03:35

వరంగల్, జనవరి 10: టాస్క్ఫోర్స్ పోలీసులు దూకుడు పెంచారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ షాపులకు సరఫరాకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తుల నిల్వలపై వరంగల్ పోలీస్ కమిషరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులను నిర్వహించారు.

01/11/2019 - 03:33

మహబూబాబాద్, జనవరి 10: మహబూబాబాద్ జిల్లాకేంద్రంపై మరోసారి ఏసీబీ అధికారులు వల విసిరారు. ఈసారి జిల్లా పరిశ్రమల శాఖ జీఎం వేముల వీరేశం రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. మానుకోటలోని పెద్దవంగర మండలం మేట్యతండా శివారు ఈక్యతండాకు చెందిన గిరిజన రైతు దారావత్ భగ్న 2017లో సబ్సిడిపై వరి కోత యంత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2018లో అతనికి వరి కోత యంత్రం మంజూరైంది.

01/11/2019 - 01:06

కొందుర్గు, జనవరి 10: ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటనపై పోలీసులు సుమోటగా కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారు జామున మండల పరిధిలోని తంగిళ్లపల్లి గ్రామంలో సంఘటనపై సుమోటగా కేసు నమోదు చేసినట్లు కొందుర్గు ఎస్‌ఐ శ్రీను తెలిపారు.

01/11/2019 - 03:42

కీసర, జనవరి 10: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు వ్యక్తులకు మల్కాజ్‌గరి కోర్టు శిక్ష విధించింది. శిక్షలో భాగంగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడుపరాదు అనే ప్లేకార్డులు చేతబూని నాగారం, రాంపల్లి గ్రామాల చౌరస్తాలో ఒకరోజు ప్రదర్శించారు.

Pages