S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/13/2019 - 02:38

ముంబయి: దొంగతనం కేసులో తనను అకారణంగా అరెస్టు చేశారని, అందుకు పది లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ ఒక మహిళ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముంబయి పోలీసులకు నోటీసులు జారీచేసింది.

01/13/2019 - 02:24

పల్గార్, జనవరి 12: పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడనే ఆగ్రహంతో కొంత మంది యువకులు ఒక వృద్ధుడిని తీవ్రంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన మహారాష్ట్ర పల్గార్ జిల్లాలోని వసాయ్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్ర రావత్ అనే 70 వృద్ధుడు ఇటీవలే కొంతమందిపై దొంగతనం కేసు పెట్టాడు. తాను పెంచుకుంటున్న పావురాలను వారు దొంగించారని ఆరోపించారు.

01/13/2019 - 02:21

చండీగఢ్, జనవరి 12: అమృత్‌సర్ జిల్లాలో శనివారం చోటు చేసుకున్న ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. జిల్లాలోని వాలా గ్రామం వద్ద శనివారం తెల్లవారు జామున ఒక ట్రాక్టర్ పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న గృహ నిర్మాణ కార్మికుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

01/13/2019 - 01:31

విజయవాడ (క్రైం), జనవరి 12: నగరంలోని మసాజ్ సెంటర్లపై పోలీసులు దృష్టి సారించారు. స్పా, మసాజ్ మాటున అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ బృందాలు శనివారం సాయంత్రం పలుచోట్ల దాడులు నిర్వహించారు.

01/13/2019 - 01:14

హైదరాబాద్, జనవరి 12: అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సెల్‌ఫోన్ దొంగలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఖరీదైనా ఫోన్లను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.

01/12/2019 - 01:51

గచ్చిబౌలి, జనవరి 11: తిన్నింటి వాసాలు లెక్కగట్టి కటకటాలపాలైన ఉదంతం రాయదుర్గం పోలీసు పరిధిలోని చోటు చేసుకుంది. డ్రైవర్‌గా 23 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. నమ్మకంగా ఉంటున్నాడని ఇల్లును అప్పచెప్పితే ఇంట్లో ఉన్నదంతా ఉడ్చేసిన ఘనుడి ఉదంతం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేటకు చెందిన కుంట బాలరాజు అలియాస్ బాలయ్య(43) సుచిత్ర సమీపంలో రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నాడు.

01/12/2019 - 01:46

గచ్చిబౌలి, జనవరి 11: బిజినెస్ ప్లాన్ ఉందని అమాయక నిరుద్యోగులను లక్షల రూపాయలు మోసం చేసిన క్యూనెట్ బాధితులు సైబరాబాద్ కమిషనరేట్‌కు క్యూ కట్టారు. సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం.. క్యూనెట్ ఏజెంట్లుగా భావిస్తున్న 58 మందిని రెండు రోజుల క్రితం అరెస్టు చేయగా తాజాగా మరో ఇద్దరిని రిమాండ్‌కు పంపడంతో ఆ సంఖ్య 60కి చేరింది. 1998లో హాంకాంగ్‌లో క్యూ ఐగ్రూప్‌ని విజయ్ ఈశ్వర్ అనే వ్యక్తి ప్రారంభించారు.

01/12/2019 - 01:35

మిర్యాలగూడ టౌన్, జనవరి 11: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం టీక్యా తండా సమీపంలో శుక్రవారం తెల్లవారుఝామున ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మాల్యానాయక్ తండాకు చెందిన ధీరావత్ భాస్కర్, ధీరావత్ సాల్కిలని రైల్వే పోలీసులు గుర్తించారు. వీరిద్దరు గత నవంబర్ 7న తండా నుంచి అదృశ్యమయ్యారని బంధువులు తెలిపారు.

01/12/2019 - 01:28

ఇబ్రహీంపట్నం, జనవరి 11: ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి రక్తమోడింది. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు నలుగురిని చిదిమేసింది. కారు, అంబులెన్స్‌ను ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడ మృతిచెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొంగర రావిరాల ఔటర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

01/12/2019 - 00:19

విజయవాడ (క్రైం), జనవరి 11: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణ విజయవాడకు చేరింది. అనేక పరిణామాల అనంతరం కేసు రాష్ట్ర పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) చేతుల్లోకి వెళ్లాక అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

Pages