S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/27/2016 - 22:13

యువ కథానాయకుడు నానీ హీరోగా ‘సినిమా చూపిస్తమావా’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

04/27/2016 - 22:11

ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించిన బాలీవుడ్ తార ప్రియాంకచోప్రా అమెరికాలో మంగళవారం రాత్రి జరిగిన ‘టైమ్100 గాలా’లో తళుక్కుమన్నారు. ప్రఖ్యాత టిస్డూడియో డిజైనర్ ఒల్కెగుల్‌సిన్ రూపొందించిన తెల్లని పాంట్‌సూట్‌లో తళతళలాడిన ప్రియాంక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్య సంచలనం రేపింది.

04/27/2016 - 22:08

నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో తెలుగులోకి పరిచయమై టాప్ హీరోయిన్‌గా వెలిగిన అనుష్కకి నాగార్జున సినిమాల్లో చేయడం అంటే చాలా ఆసక్తి. కారణం తను ఈ స్థాయిలో ఉండడానికి ఆయనే కారణమని చెబుతూంటుంది. కాబట్టి ఆయన సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పుడల్లా నటించేందుకు సిద్ధమంటోంది అనుష్క.

04/27/2016 - 22:05

ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ఖుషి’, ‘పులి’ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. 15 ఏళ్ల క్రితం ‘ఖుషి’ సినిమా విడుదలైన రోజే ఈ సినిమాను మొదలుపెట్టడం విశేషం. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ఖుషి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథగా ఉంటుందని అన్నారు.

04/27/2016 - 22:02

వాల్డ్ డిస్నీ సంస్థ రూపొందించిన ‘జంగిల్‌బుక్’ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అడవి జంతువుల సంరక్షణలో ఎదిగిన ఓ అనాథ బాలుడి సాహసయాత్ర కథాంశంగా రూపుదిద్దుకున్న ఈ అమెరికన్ కల్పితకథకు సెల్యులాయిడ్ రూపమే జంగిల్‌బుక్. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ‘వౌగ్లి’గా నీల్‌సేథి నటించాడు. చిత్రం అంతా లాస్‌ఏంజిలిస్‌లోనే నిర్మించారు.

04/27/2016 - 22:00

గోపీచంద్‌తో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న దర్శకుడు శ్రీవాస్ మరోసారి ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే బాలకృష్ణతో ‘డిక్టేటర్’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ వివరాలు తెలియజేస్తూ..

04/27/2016 - 21:57

‘బజరంగీ భాయ్‌జాన్’ దర్శకుడు కబీర్ ఖాన్‌కు పాకిస్తాన్‌లో చేదు అనుభవం ఎదురైంది. లాహోర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కబీర్ పాకిస్తాన్ వెళ్లారు. కరాచీలోని జిన్నా విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగినప్పుడు కొందరు ప్రయాణికులు గుర్తుపట్టి అడ్డుకున్నారు. బజరంగీ చిత్రంలో పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా చూపడాన్ని వారు తప్పుబట్టారు.

04/27/2016 - 21:55

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్ హీరోగా శ్రీ చక్ర మీడియా పతాకంపై కె.శ్రీనివాసులు నిర్మిస్తున్న నక్షత్రం చిత్రం బుధవారం ప్రారంభమైంది. విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిలిమ్‌నగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

04/26/2016 - 21:13

భవానీప్రసాద్, పూజ జంటగా ధృవ ఆర్ట్ ఫిలిమ్స్‌పతాకంపై బాలాజీ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘వస్తున్నాడు’. సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. ఈనెల 16తో మొదటి షెడ్యూల్ పూర్తిచేశామని, 22 నుండి రెండో షెడ్యూల్ జరుపుతున్నామని తెలిపారు.

04/26/2016 - 21:12

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ భారీ అపజయాన్ని మూటకట్టుకుంది. దీనినుంచి కోలుకున్న పవన్ ఇప్పుడు కొత్త సినిమాపై దృష్టిపెట్టారు. ఈనెల 29న పవన్‌కళ్యాణ్ కొత్తసినిమా మొదలుకానుంది. ఎస్‌జె సూర్య దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తయింది. పవన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఆరోజే అనౌన్స్ చేస్తారు.

Pages