S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 20:54

తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా సుస్థిర స్థానం ఏర్పరచుకున్న నయనతార, అటు సీనియర్, ఇటు జూనియర్ హీరోలతో కలిసి నటించింది. దక్షిణాదిలో నెం.1 కథానాయికగా గుర్తింపు పొందింది. ప్రేమాయణాలు నడపడంలో కూడా నెం.1గా నిలిచింది. ఓవైపు శింబుతో, మరోవైపు ప్రభుదేవాతో ప్రేమాయణాలు సాగించి ఎప్పుడూ సంచలన తారగానే వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం తెలుగులో ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తోంది.

04/28/2016 - 21:01

తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్, తాజాగా సినిమాల విషయంలో స్పీడ్ పెంచేసి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించనున్న ‘కత్తి సందై’ అనే సినిమాను ఈ ఉదయం దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించనుందని తెలిసింది.

04/28/2016 - 20:59

వరుణ్‌తేజ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు రూపొందిస్తున్న చిత్రం ‘మిస్టర్’. లావణ్య త్రిపాఠి, హెబాపటేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వెంకటేష్ క్లాప్‌నిచ్చారు.

04/28/2016 - 20:56

మహేష్‌బాబు కథానాయకుడిగా పివిపి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పరం వి.పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి, కవిన్ అనె్న రూపొందిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

04/28/2016 - 20:54

హనీష్, చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతి ప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆమె అతడైతే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

04/28/2016 - 20:53

అల్లు శిరీష్ హీరోగా ఎమ్.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ నెంబర్ 2 సినిమా గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఎస్.శైలేంద్ర బాబు, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్‌కొట్టగా.. శ్రీనువైట్ల కెమెరా స్విచ్‌ఆన్ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు.

04/28/2016 - 20:51

రష్మిగౌతమ్, చరణ్‌దీప్ ప్రధాన తారాగణంగా జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. కథానాయిక రష్మి పుట్టిన రోజు సందర్భంగా అంతం చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

04/28/2016 - 20:49

ఇటీవలే తెలుగులో చిన్న సినిమాగా విడుదలై మంచి హిట్ అందుకున్న ‘క్షణం’ సినిమా ఇపుడు బాలీవుడ్‌కి వెళ్లనుంది. ఆ సినిమాలో అనసూయ చేసిన ఐపిఎస్ పాత్రని టబుతో రీప్లేస్ చేయబోతున్నారట. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తాడని ప్రచారం సాగుతోంది. ఒరిజినల్ వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించిన ఆదాశర్మని హిందీలో కూడా కంటిన్యూ చేయబోతున్నారట.

04/27/2016 - 22:19

ఆ మధ్య పారిస్ లో జరిగిన కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయిన బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ ముంబైలో మరోసారి ఓ మెరుపుమెరిశారు. వరుసగా పదిహేనుసార్లు కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొని రికార్డు సృష్టించిన ఐశ్వర్యరాయ్ ప్రముఖ కాస్మొటిక్స్ సంస్థ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

04/27/2016 - 22:16

ప్రస్తుతం దక్షిణాది టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న గ్లామర్ భామ కాజల్‌కు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అపజయం కాస్త నిరాశనే మిగిల్చింది. పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఎదురుచూసిన ఈమెకు నిరాశ మిగిలింది. తాజాగా బాలయ్య సరసన ఛాన్స్ వచ్చినా కూడా కాదని చెప్పిందట. తేజ దర్శకత్వంలో రానాతో చేసే సినిమాను ఒప్పుకోవడంవల్ల ఆ సినిమా చేయలేకపోతోందట.

Pages