S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/16/2016 - 22:39

హాస్యనటుడు సప్తగిరి హీరోగా మారారు. రుగ్వేదా డ్రీమ్స్ పతాకంపై సాగర్ దర్శకత్వంలో ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది.

01/16/2016 - 22:37

సమర్, అక్షిత, కిమాయ ప్రధాన తారాగణంగా శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ పతాకంపై సతీష్ గుండేటి దర్శకత్వంలో పెర్లా ప్రభాకర్, తోట గోపాల్ రూపొందించిన చిత్రం ‘కొత్త కొత్తగా వున్నది’.

01/16/2016 - 22:34

‘ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయనగానే కొద్దిగా టెన్షన్ పడినమాట నిజమే. కామెడీ చేయడం కష్టమేనని అర్థమైంది. కానీ, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ విజయంతో పూర్తి కాన్ఫిడెన్స్‌తో వున్నా’ అని కథానాయకుడు శర్వానంద్ తెలిపారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్, సురభి జంటగా రూపొందిన ఎక్స్‌ప్రెస్‌రాజా ఈనెల 14న విడుదలైన సంగతి తెలిసిందే.

01/13/2016 - 21:46

రావంత్, పావని జంటగా కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

01/13/2016 - 21:44

ఆమధ్య అగ్ర చిత్రాలలో నటించి అలసిపోయానని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెళ్లిన అనుష్క మళ్లీ వచ్చింది. తాజాగా నాగార్జున కథానాయకుడిగా విడుదల కానున్న సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో కూడా ఆమె కనిపించనున్నదని టాలీవుడ్ సమాచారం. అయితే మనం చిత్రం అఖిల్ తెరంగేట్రం గురించి రహస్యంగా వుంచిన సినిమా యూనిట్, ఈ చిత్రంలో అనుష్క ఎంట్రీ కూడా రహస్యంగా వుంచుతున్నారని తెలుస్తోంది.

01/13/2016 - 21:42

సినిమా హిట్ అయితే ఆ చిత్ర కథానాయికని గోల్డెన్‌లెగ్ అంటారు. ఆమెవల్లే ఈ సినిమా హిట్ అయిందంటారు. పనిలో పనిగా హీరో స్టామినాను కూడా లెక్కలు వేస్తారు. సినిమా ఫట్ అయితే ఐరెన్‌లెగ్ అంటారు. ఈ ఐరెన్‌కు, గోల్డ్‌కు తేడానే లేదు. ఏదైనా ఒకటే కాలండీ బాబూ అంటోంది యువ కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్.

01/13/2016 - 21:41

తెలుగులో రెండు మూడు హిట్ సినిమాలు చేసి ఈమధ్య అవకాశాలు బాగా తగ్గిన హాట్ భామ ఇషాచావ్లా ఇప్పుడు ఐటెం భామగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో ఐటెం సాంగ్‌కి రెడీ అయింది. ‘ప్రేమకావాలి’ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన ఇషాచావ్లా, ‘పూలరంగడు’, ‘మిస్టర్ పెళ్లికొడుకు’ వంటి హిట్ చిత్రాలతో మంచిమార్కులు కొట్టేసింది.

01/13/2016 - 21:37

బాలీవుడ్‌లో దబ్బూ రత్నాని కేలండర్‌కు విశిష్టస్థానం ఉంది. నూతన సంవత్సరానికి సంబంధించిన కేలండర్‌ను ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. హిందీ చిత్రరంగానికి చెందిన అతిరథమహారథులు హాజరైన ఈ వేడుకలో అలనాటి తారలు, ఈతరం భామలు హాజరైనారు.

01/13/2016 - 21:31

‘బ్రూస్‌లీ’ సినిమా తర్వాత మెగా హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన ‘తని ఒరువన్’ చిత్రం ఆధారంగా ఇది రూపొందనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయనున్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి.

01/13/2016 - 21:29

పురాతన దేవాలయాలు నాడు, నేడు ఎలా వున్నాయి అనే అంశంతో ‘సేవ్ టెంపుల్స్’ పేరిట చిత్రీకరించిన డాక్యుమెంటరీలలో ఉత్తమమైనవాటిని ఎంపిక చేసి హైదరాబాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం- 2016ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సాంస్కృతిక ప్రచార సారధి డా.

Pages