S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/07/2016 - 00:32

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరో ప్రభాస్. ఈ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి-2’ చిత్రం షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఈ ఏడాది మొత్తం ఈ సినిమాకే టైమ్ కేటాయించాడు. ఈ సినిమా తర్వాత ఆయన నటించే తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి.

02/07/2016 - 00:30

కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్నాడు మదన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘గరం’. ఆది, ఆదాశర్మ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మదన్ చెప్పిన విశేషాలు.
కథ గురించి?

02/07/2016 - 00:29

శ్రీనివాసులు, శిల్ప, మేఘన ముఖ్యపాత్రల్లో శ్రీ వెంకటసాయి ఫిలిమ్స్ పతాకంపై ఎస్.శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘యువతేజం’. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. అనంతరం దర్శకుడు, హీరో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం గాంధీతత్వాన్ని, దేశభక్తిని మరిచిపోతున్నామని, అదే అంశంతో అందరికీ నచ్చేలా తెరకెక్కించిన సినిమా ఇదన్నారు.

02/07/2016 - 00:29

ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుపుకుంటోంది. ఐదురోజులపాటు ఏకధాటిగా జరిగే షూటింగ్‌లో హీరోయిన్ కాజల్ కూడా పాల్గొంటుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన విడుదల హక్కుల్ని ప్రముఖ సంస్థ ఏరోస్ సొంతం చేసుకుంది.

02/05/2016 - 21:36

ఆదిత్యా క్రియేషన్స్ పతాకంపై సోనాలి, ఆదిత్యా జంటగా కోట మునీష్ దర్శకత్వంలో లక్ష్మీ శ్రీవాస్తవ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమికులపై పీహెచ్‌డీ. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మీ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయని తెలిపారు.

02/05/2016 - 21:36

అజయ్ , భరత్, అర్జున్, వెంకటేష్, సుస్మితా ప్రధాన తారాగణంగా భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్‌రాజ దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్ట్ఫికెట్ లభించింది.

02/05/2016 - 21:35

ఈ సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ నటుడు శర్వానంద్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. రన్‌రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ నటుడు విభిన్నమైన కథా చిత్రాన్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా మరో యంగ్ డైరెక్టర్‌కు ఓకె చెప్పాడట.

02/05/2016 - 21:34

నవీన్ సంజయ్, వౌనిక జంటగా కావేరీ ట్రావెల్స్ పతాకంపై తమ్మినేడి సతీష్‌బాబు దర్శకత్వంలో ఎంపీనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘జానకిరాముడు’. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తికావస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

02/05/2016 - 21:34

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రం త్వరలో దక్షిణాది భాషల్లో రీమేక్ కానుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా పూర్తికావాలి. కానీ సరైన నటీనటులు దొరకకపోవడంతో ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సీనియర్ నటి, దర్శకురాలు రేవతి సన్నాహాలు చేస్తోంది.

02/05/2016 - 21:33

ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో లిప్‌లాక్‌లకు కొదవే లేకుండాపోయింది. ఏ సినిమాలో చూసినా అవసరం వున్నా లేకున్నా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఈ తరహా లిప్‌లాక్ సన్నివేశాలతో రక్తికట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ముద్దుసన్నివేశంతో సంచలనం సృష్టిస్తోంది నాటి గ్లామర్ తార కాజోల్. వెండితెరపై ఎవర్ గ్రీన్ లవ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్, షారూఖ్‌ల జంట అంటే అందరికీ క్రేజే.

Pages