S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/27/2015 - 21:44

రమేష్ వర్మ దర్శకత్వంలో మోహనరూపా ఫిలింస్, జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట రూపొందించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’.

11/27/2015 - 21:42

రణబీర్‌కపూర్‌తో కలసి నటించిన ‘తమాషా’ చిత్రం విడుదల సందర్భంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనె

11/27/2015 - 21:39

శ్రీ పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై గౌతమ్ నాయుడు దర్శకత్వంలో విష్ణురెడ్డి, అభిరామ్, సంజన ప్రధాన తారాగణంగా పద్మజానాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘త్రయం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.

11/27/2015 - 21:34

తమిళంలో విజయవంతమైన నానమ్ రౌడీదామ్ చిత్రాన్ని తెలుగులో నేనూ రౌడీగా అనువదిస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన తారాగణంగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన, రమేష్ అన్నంరెడ్డి అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని చక్కగా అనువాదం చేస్తున్నామని, డబ్బింగ్ పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు.

11/27/2015 - 21:31

సాయిరంగా ఫిలింస్ పతాకంపై ఎస్.డి.రమేశ్ సెల్వన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘వజ్రం’ చిత్రాన్ని తెలుగులో ‘ఓదార్పుయాత్ర’గా అందిస్తున్నారు. శ్రీరామ్, కిశోర్, పాండి, కుట్టిమణి ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ చిత్రానికి నిర్మాత కె.రంగారావు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/27/2015 - 21:27

శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నందినిరెడ్డి దర్శకత్వంలో దామూ రూపొందిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

11/27/2015 - 21:26

అంతర్జాతీయ ఫిల్మోత్సవాలలో భాగంగా పారిస్‌లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో నిర్వహిస్తున్నట్టుగా ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ గ్రాబిలో బెనె్నన్ తెలిపారు. గోవాలో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ పాత్రికేయుల సమావేశంలో పారిస్‌లో భారతీయ సినిమా అంశంపై ఆమె మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని, గొప్పతనాన్ని పారిస్ ప్రజలకు పరిచయం చేయడానికి ఈ ఫిల్మోత్సవ్ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

11/25/2015 - 21:11

వరుస విజయాలతో తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేసులో నిలిచింది అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. గోపీచంద్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటిస్తున్న ఈ భామకు తన సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని తెగ ఆశపడుతోంది. ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో నటిస్తోన్న రకుల్ ఈ సినిమాలో సొంత డబ్బింగ్ చెబుతోందని అంటున్నారు. దీనికోసం ఆమె తెలుగుకూడా బాగానే నేర్చుకుంటోంది.

11/25/2015 - 21:09

అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ తన మొదటి సినిమా ‘అఖిల్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తన తదుపరి సినిమాపై చాలా శ్రద్ధ తీసుకునే పనిలో పడ్డాడు అఖిల్. మరోవైపు నాగార్జున కూడా అఖిల్‌ను సరైన దారిలో తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం అఖిల్‌తో సినిమా చేసేందుకు దర్శకుడు క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడట.

11/25/2015 - 21:05

దక్షిణాదిలో సంచలన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం తమిళంలో బిజీగా వుంది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న నయనతారకు ఇటీవలే విడుదలైన ‘మయూరి’ చిత్రం మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. అయితే ఎన్ని చిత్రాల్లో చేసినా కూడా నయనతారకు విక్రమ్ సరసన నటించాలనే కల ఉండేదట. ఆయనతో ఎప్పటికైనా నటిస్తానని అంటోంది ఆమె.

Pages