S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2015 - 21:15

‘ఆలస్యం అమృతం’ సినిమా రిలీజ్ సమయంలో నేను థియేటర్ దగ్గర ఉన్నపుడు ఒకతను నా దగ్గరకు వచ్చి సినిమా బాగాలేదు, అందుకనే వెళ్లిపోతున్నానని చెప్పాడు. నేను షాక్ అయ్యాను. అపుడే నిర్ణయించుకున్నాను, భిన్నమైన సినిమాల్లో నటించాలి’ అని అంటున్నాడు యువ హీరో నిఖిల్. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి వరుస విజయాలతో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు నిఖిల్.

12/01/2015 - 02:08

గ్లామర్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సొట్టబుగ్గల తాప్సీకి ఎన్ని సినిమాల్లో నటించినా కూడా సరైన కమర్షియల్ గుర్తింపు దక్కలేదు. అయితే అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఈమధ్యే బాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ తన తదుపరి చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చేయడానికి సిద్ధపడుతోంది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్‌కే పరిమితం కాదని, అన్నీ చేయాలని చెబుతోంది.

12/01/2015 - 02:06

బాలీవుడ్ హీరోయిన్స్‌కు సౌత్ సినిమా అంటే చాలా ఆసక్తి. ఇక్కడ సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు తెగ ఆసక్తి కనబరుస్తారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు సౌత్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ భామ టాలీవుడ్‌లో జెండా ఎగరేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇషాక్ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైన అమైరా దస్తూర్ ఈమధ్యే ధనుష్ సరసన తమిళంలో ‘అనేగన్’ సినిమాలో నటించింది.

12/01/2015 - 02:03

రాజ్‌తరుణ్, ఆర్తన జంటగా శ్రీనివాస్‌గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.శైలేంద్రబాబు, హరీశ్ దుగ్గిశెట్టి, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకుంటోంది.

12/01/2015 - 02:00

ఈ ఏడాది ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్న నాని ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. ‘అందాల రాక్షసి’ ఫేం హనూ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత నాని తదుపరి చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే మరో చిత్రం డిసెంబర్ రెండవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నది.

12/01/2015 - 01:57

ఇండస్ట్రీలోకి వచ్చి ఇనే్నళ్లయినా ఇంకా సముద్రం మధ్యలోనే ఈదుతున్నట్టుంది, సాధించాల్సింది చాలా వుంది అని అంటున్నాడు నటుడు శ్రీకాంత్. ఆయన హీరోగా సత్యం ద్వారపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీడికి దూకుడెక్కువ’. కామ్నాజఠ్మలానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈనెల 4న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన విశేషాలు..

12/01/2015 - 01:53

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం టీచ్ ఎయిడ్స్ ఇండియా ట్రస్ట్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని వయసుల విద్యార్థినీ విద్యార్థులకు హెచ్.ఐ.వి. ఎయిడ్స్‌పే అవగాహన పెంచేందుకు యానిమేటెడ్ మల్టీమీడియా ఇంటరాక్టివ్ హెచ్.ఐ.వి. ఎడ్యుకేషన్ పేరుతో రూపొందించిన సీడీని సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ యానిమేషన్ ఫిలిమ్‌లో తమ పాత్రలకు 22 మంది భారతీయ సినీ నటులు తమ వాయిస్‌ను అందజేశారు.

12/01/2015 - 01:48

‘సినిమా అంటే ఎవరికైనా ప్రేమే. అందులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ ఏ దేశానికి చెందిన ప్రేక్షకుడైనా తమ కథగానే భావిస్తాడు. అలా ప్రపంచంలో సినిమా అనేది దేశాలమధ్య ఎల్లలు చెరిపేస్తుంది’ అని కేంద్ర మంత్రి రాజవర్ధన్‌సింగ్ రాథోడ్ అన్నారు. గోవాలో జరుగుతున్న 46వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు.

12/01/2015 - 02:10

యస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి ఎస్.సరిత సమర్పణలో హేరి ఫెర్నాండెజ్ దర్శకత్వంలో భోజ్‌పురిలో విడుదలై ఘనవిజయం సాధించిన ఆజ్ కె కరణ్ అర్జున్ చిత్రాన్ని ఆర్.కె. నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం నేటి విజేతలు. ఈ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రతాని రామకృష్ణగౌడ్ సీడీని ఆవిష్కరించారు.

11/29/2015 - 22:33

కెనడాలో స్థిరపడిన తెలుగు నటులు ఉదయ్, స్వప్న జంటగా కెనడా బేస్డ్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై ఉదయ్ కల్లూరి రూపొందించిన చిత్రం ‘రామసక్కని రాకుమారుడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, టీజర్‌ను విడుదల చేశారు. ఉదయ్‌కల్లూరి మాట్లాడుతూ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, డిసెంబర్ 5న కెనడాలోని టోరంటోలో ఆడియో విడుదల చేయనున్నామని తెలిపారు.

Pages