S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2015 - 08:10

వరుసగా రెండు సినిమాల అపజయాలతో కాస్త డీలాపడ్డ మెగా హీరో రామ్‌చరణ్ తన తదుపరి చిత్రాలతో జోరు పెంచనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత చాలా జాగ్రత్తగా తదుపరి చిత్రాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలు కథలు వింటున్న చరణ్, ఇటీవలే తమిళంలో ఘనవిజయం సాధించిన తని ‘ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.

11/25/2015 - 08:10

సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్

11/25/2015 - 08:07

హీరోయిన్ మధుశాలిని
జాతీయ నటుడు కమల్‌హాసన్ హీరోగా రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిలింస్, గోకులం మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ‘చీకటి రాజ్యం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా త్రిష, మధుశాలిని నటించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన మధుశాలిని చెప్పిన విశేషాలు...
మంచి రెస్పాన్స్

11/25/2015 - 08:05

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అంజలి, సోనాల్ చౌహాన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 99వ చిత్రం. తెలుగు పరిశ్రమలో వంద సినిమాలు పూర్తిచేసిన హీరోల్లో ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, చిరంజీవిల తరువాత ఈ లిస్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు బాలయ్య.

11/25/2015 - 08:04

సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాజీరావ్ మస్తాని’ కొత్త పోస్టర్ ఇవాళ విడుదలైంది.

11/24/2015 - 05:24

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ తాప్సి. ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ పరంగా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి ప్రయత్నించిన ఈ భామకు అక్కడా అంతంతమాత్రంగానే అవకాశాలు దక్కాయి. మళ్లీ సౌత్‌లోనే టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఇక్కడే ప్రయత్నాలు సాగిస్తోంది. తాజాగా ఈ భామకు మరో క్రేజీ అవకాశం దక్కింది.

11/24/2015 - 05:23

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుని క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అంజలి ప్రస్తుతం బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’, లేడీ ఓరియెంటెడ్ ‘చిత్రాంగద’ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత అంజలి మరో సినిమాకు ఓకె చెప్పిందట. అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం.

11/24/2015 - 05:22

టి.ఎస్.ఆర్. యేసుక్రీస్తు పాత్రలో చండ్ర చంద్రశేఖర్ సమర్పణలో సంగాల దయానంద క్రియేషన్స్ ఇండియా పతాకంపై ఎస్.ఆర్.కుమార్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘క్రీస్తు యేసు’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర వివరాలను గురించి దర్శకుడు కుమార్ రాజా మాట్లాడుతూ ‘ఇది గొప్ప చారిత్రాత్మకమైన చిత్రం. భారతదేశ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది.

11/24/2015 - 05:22

ప్రకాశ్ రాజ్ దర్శకత్వం వహించే మూడవ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించే ఈ చిత్రానికి ‘మన ఊరి రామాయణం’ అనే టైటిల్‌ను నిర్ణయంచారు.

11/24/2015 - 05:21

విభిన్నమైన కథాంశాలతో చిత్రాలు రూపొందించి క్రియేటివ్ దర్శకుడిగా తెలుగు పరిశ్రమలో తనదైన స్థానాన్ని స్వంతం చేసుకున్న కృష్ణవంశీ తాజాగా మరో చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. గత ఏడాది ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తరువాత ఆయన చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటికే చర్చలు జరుపుకుంటున్న ఈ చిత్రం థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా వుంటుందని తెలిసింది. ప్రముఖ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించనుందట.

Pages