S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2015 - 23:47

బెంగాల్ టైగర్‌లో ‘సెలబ్రిటీ శాస్ర్తీ’గా నటిస్తున్న పోసాని కృష్ణమురళి ఫస్ట్‌లుక్ బుధవారంనాడు సోషల్ మీడియాలో విడుదల చేశారు. భిన్నమైన ఆహార్యంతో పోసాని ఆకట్టుకునేలా ఈ పోస్టర్ ఉంది.

12/02/2015 - 23:45

ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు తాజాగా ఛాంబర్‌లో ‘దందా’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడీ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమధ్య కృష్ణంరాజు తను దర్శకత్వం వహిస్తానని, ప్రభాస్ హీరోగా ఈ సినిమా రూపొందుతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అప్పట్లోనే ‘విశాలనేత్రాలు‘, ‘ఒక్క అడుగు’ అనే టైటిల్స్ వినిపించాయి.

12/02/2015 - 23:43

రచయితగా తెలుగు పరిశ్రమలో స్టార్ ఇమేజ్‌ని సంపాదించుకుని ప్రస్తుతం మరోవైపు నిర్మాతగా కూడా తన ప్రస్థానాన్ని సాగిస్తున్నాడు రచయిత కోన వెంకట్. ఇదివరకే ఆయన ‘గీతాంజలి’ చిత్రాన్ని నిర్మించాడు. తాజాగా నిఖిల్‌తో ‘శంకరాభరణం’ చిత్రాన్ని రూపొందించాడు.

12/01/2015 - 21:56

బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ ప్రధాన తారాగణంగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డిక్టేటర్’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తిచేశారు.

12/01/2015 - 21:55

రాజ్‌తరుణ్, అవికాగోర్‌ల జంట తెలుగు తెరపై సందడి చేసి రెండు వరుస విజయాలని అందుకున్న విషయం తెలిసిందే. ‘ఉయ్యాల జంపాల’తో ప్రారంభమైన ఈ కాంబినేషన్‌కు సినిమా చూపిస్తమావ కమర్షియల్‌గా మంచి బ్రేక్‌నిచ్చింది. ఈ జోడీకి ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో మరోసారి జోడీ తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

12/01/2015 - 21:50

వి.వి.ఎస్. క్రియేషన్స్ పతాకంపై ఆర్య, కీర్తి జంటగా చరణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామ్రాజ్యం’. ఈ చిత్రాన్ని నైనాల సాయిరామ్ తెలుగులో అందిస్తున్నారు. తమిళంలో విజయవంతం అయిన ఈ చిత్రం తెలుగులో కూడా అందరికీ నచ్చుతుందని నిర్మాత తెలియజేశారు.

12/01/2015 - 21:49

ముంబైలో నిర్వహించిన ‘తమాషా’ విజయోత్సవంలో బాలీవుడ్ నటీనటులు
దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ సందడి చేశారు. ఆ సినిమాలో వీరు జంటగా నటించిన
విషయం తెలిసిందే. అలాగే రణవీర్‌సింగ్‌తో కలసి దీపిక ‘బాజీరావ్ మస్తానీ’లోనూ నటించారు.
వారిద్దరూ కలసి బాజీరావ్ మస్తానీ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొని అభిమానులను అలరించారు.

12/01/2015 - 21:25

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూ పొందిస్తున్న తాజా చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. మూడు రాష్ట్రాల ప్రభుత్వాల్ని ముప్పుతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితగాథతో తెరకెక్కిన సినిమా ఇది. కన్నడంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. కన్నడ హీరో శివరాజ్‌కుమార్ నటిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఈ చిత్రంపై వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కోర్టులో కేసు పెట్టింది.

12/01/2015 - 21:19

రవితేజ, తమన్నా, రాశీఖన్నా ప్రధాన తారాగణంగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. కె.కె.రాధామోహన్ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో గతంలో విడుదలైంది. ఈ పాటలకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు.

12/01/2015 - 21:18

సుమలీల సినిమా పతాకంపై ఎన్.హెచ్.ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘బంగారుపాదం’. దయ, జ్యోతిశ్రీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 4న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఎన్.హెచ్.ప్రసాద్ మాట్లాడుతూ, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ‘బంగారుపాదం’ సాగుతుందని, వస్తువులకు మనుషులకు వున్న సంబంధాలను ఈ చిత్రంలో తెలిపామన్నారు.

Pages