S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/19/2019 - 22:00

ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో వివేక్ ఒబెరాయ్ ముఖ్యపాత్ర పోషిస్తున్న చిత్రం పీఎం నరేంద్ర మోదీ. వివేక్‌తోపాటు సందీప్‌సింగ్, ఆనంద్‌పండిట్, ఆచార్య మనీశ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాను ఏప్రిల్ 12న విడుదల చేయాలనుకున్నా, కొన్ని కారణాలవల్ల ఏప్రిల్ 5నే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

03/19/2019 - 21:59

కథ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్ అరుణ్, తరువాత భిన్నమైన సినిమాలుచేసి యంగ్ హీరోగా క్రేజ్ సాధించాడు. తాజాగా అడల్ట్ కామెడీ కంటెంట్‌తో తెరకెక్కిన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 21న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో ఆదిత్‌తో ముచ్చట్లు.

03/19/2019 - 21:57

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. నందమూరి తారక రామారావు జీవితంలో అత్యంత ముఖ్యఘట్టమంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టడం తెలిసిందే. వాస్తవానికి మార్చి 22న సినిమాను విడుదల చేయనున్నట్టు వర్మ ప్రకటించారు.

03/19/2019 - 21:55

బిగ్ బికి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అమితాబ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడాయన సింగర్‌గానూ మారాడు. ఇదివరకు బాలీవుడ్ సినిమాల కోసం గొంతువిప్పిన బిగ్ బి, ఈసారి కన్నడ పాట కోసం గొంతు సరిచేసుకున్నాడు. కన్నడలో రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బటర్ ఫ్లై. ఈ చిత్రంలో అమితాబ్ ఓ క్లబ్ సాంగ్ పాడేందుకు సిద్ధమవుతున్నాడట. ఇది కంగనా రనౌత్ చిత్రం క్వీన్‌కు రీమేక్.

03/19/2019 - 21:53

ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్‌తో తెలుగులో బిగ్‌బాస్ షోకి మంచి క్రేజ్ ఏర్పడింది. రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించి క్రేజ్ సాధించినా, కొన్ని వివాదాల కారణంగా పక్కకు తప్పుకున్నాడు. తాజాగా మూడో సీజన్‌కోసం సమాలోచనలు జరిపిన టీమ్ -ఫైనల్‌గా కింగ్ నాగార్జునను ఎంపిక చేశారని టాక్. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో బిజీగావున్న జూనియర్ ఎన్టీఆర్ కోసం గట్టిగానే ట్రై చేసింది కానీ తను ససేమిరా అన్నాడట.

03/19/2019 - 21:52

జెస్సీ సాధించిన విజయంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. అతుల్ కులకర్ణి, కబీర్‌సింగ్, అర్చనా శాస్ర్తీ, ఆషిమా నర్వాల్ ప్రధాన తారాగణంగా రూపొందిన హారర్ థ్రిల్లర్ జెస్సీ. ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై వి అశ్వినికుమార్ దర్శకత్వంలో శే్వతాసింగ్ నిర్మించిన చిత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సాధించింది.

03/19/2019 - 21:50

ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత సుదర్శన్‌రెడ్డి సారథ్యంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ -ప్రేమకథాచిత్రమ్ 2. హరికిషన్ దర్శకుడు. సుమంత్ అశ్విన్, సిద్ధిఇద్నాని జంటగా నటిస్తుంటే, నందిత శే్వత లీడ్‌రోల్ చేస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

03/19/2019 - 21:48

రెండేళ్ళ క్రితం టాలీవుడ్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్ జోరును చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంవేసేది. వరసగా టాప్ హీరోల సినిమాల్లో ఆఫర్లు సాధించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కానీ వరస ఫ్లాపులు తన కెరీర్‌పై ప్రభావం చూపించాయి. మరోవైపు తమిళ... హిందీ చిత్రాలను ఎక్కువగా యాక్సెప్ట్ చేయడంతో తెలుగు ఆఫర్లు తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు స్లోగా టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తోంది రకుల్.

03/19/2019 - 21:46

ఈసీ నుంచి అధ్యక్షుడి వరకూ వివిధ హోదాల్లో పని చేసి అనుబంధం పెంచుకున్న తెలుగు సినీ నటుల సంఘం (మా) కోసం పని చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. కొద్దిరోజుల క్రితం జరిగిన మా ఎన్నికల్లో సీనియర్ నరేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

03/18/2019 - 19:47

సెనే్సషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డియర్ కామ్రేడ్. రష్మిక మందన్న హీరోయిన్. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. సినిమా ఒక ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో టీజర్‌ను విడుదల చేశారు.

Pages