S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

11/10/2017 - 20:41

సినిమా తారలంతా క్రికెటర్ల ప్రేమలో పడతారెందుకు? అని ప్రేక్షకులు ఎప్పుడూ అనుకుంటారు. కానీ వారు పిచ్‌లో ప్రదర్శించే క్రీడా నైపుణ్యమే అభిమానులుగా మారుస్తుందని, ఆ పైన ప్రేమికులుగా మారుతున్నారని గతంలో కొన్ని సంఘటనలు రుజువుచేశాయి. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అనుష్క కూడా ఓ క్రికెటర్ ప్రేమలో పడిపోయింది. తన అభిమాన క్రికెటర్ ఎవరో తెలియజేసింది.

11/10/2017 - 20:35

సమకాలీన వ్యక్తులపై రచనలు చేసినా బయోపిక్ నిర్మాణం జరిగినా చాలా సంయమనం కావాలి. పారదర్శకంగానూ నిష్పాక్షికంగానూ ఉండాలి. పరిశోధనాత్మకంగా లోతుగా అనే్వషించి నిర్మించాలి.

11/09/2017 - 20:00

హైదరాబాద్‌లో జరుగుతున్న 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్ బాలల కేరింతలతో సందడే సందడిగా మారింది. దేశ, విదేశాలనుంచి డెలిగేట్స్, బాల నటీనటులు ఈ ఉత్సవంలో పాల్గొని పిల్లలను అలరించారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్న బాలలు తమకు నచ్చినవారితో సెల్ఫీలు తీసుకుంటూ హుషారుగా గంతులేశారు.

11/09/2017 - 19:59

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రూపొందించిన ‘గరుడవేగ’ ఇటీవల ఈనెల 3న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్లక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, కలెక్షన్ల వర్షం రెండో వారం కూడా దిగ్విజయంగా కురుస్తోందని నిర్మాత ఎం. కోటేశ్వరరాజు తెలిపారు.

11/09/2017 - 19:57

కిరణ్, హర్షదా కులకర్ణి ప్రధాన తారాగణంగా ధృవ ప్రొడక్షన్స్ పతాకంపై కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో సుజన్ రూపొందించిన చిత్రం ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పోస్టర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.

11/09/2017 - 19:57

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

11/09/2017 - 19:55

ఉయ్యాల జంపాల’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విరించి వర్మ ఆ సినిమా తరువాత నానితో ‘మజ్ను’ సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ అక్కినేని హీరోతో సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ బ్యానర్‌లో అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య కార్తికేయ ఫేమ్ డైరెక్టర్ చందు మొండేటితో సినిమా చేస్తున్నాడు.

11/09/2017 - 19:54

సూర్య అన్న పేరుతో ఈ చిత్రంలో కనిపిస్తా. నా స్నేహితుల కోసం నేను ఏం చేశాను అనేదే ఈ సినిమా కథ. మన చుట్టుప్రక్కల జరిగిన కథలా ఈ చిత్రం సాగుతుంది అని హీరో సందీప్ కిషన్ తెలిపారు. తమిళ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో సందీప్ కిషన్, మెహరీన్ జంటగా రూపొందించిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రం గురించి కథానాయకుడు పలు విశేషాలు తెలిపారు.
సూర్య అంటే

11/09/2017 - 19:52

మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేసి మంచి నటిగా నిరూపించుకోవాలని వుంది అని ‘లవర్స్ క్లబ్’ కథానాయిక పావని తెలిపారు. శ్రీయా ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై అనీష్, పావని జంటగా ధృవశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కథానాయిక పావని చిత్ర విశేషాలు తెలిపారు. ఈ చిత్రంలో నేను గీత అనే అమ్మాయిగా నటించా. మెడికల్ స్టూడెంట్ పాత్ర.

11/08/2017 - 20:05

చారిత్రక నగరం హైదరాబాద్‌లో 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి బాలల చలనచిత్రోత్సం జరుగుతుంది. ఈ చలనచిత్రోత్సవాల కోసం 93 దేశాల నుంచి 1402 సినిమాలొచ్చాయి.

Pages